Iratta Review: మైండ్ డిస్టర్బ్ అయ్యే క్లైమాక్స్.. అంజలి, జోజు జార్జ్ పాత్రలు ఎలా ఉన్నాయంటే?
రేటింగ్: 2.75/5
టైటిల్: ఇరట్టా
నటీనటులు: జోజు జార్జ్, అంజలి, శ్రీకాంత్ మురళి, ఆర్య సలీమ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: విజయ్
సంగీతం: జేక్స్ బిజోయ్
నిర్మాత: జోజ్ జార్జ్, మార్టిన్ ప్రక్కట్, సిజో వడక్కన్, ప్రశాంత్ కుమార్, చంద్రన్
దర్శకత్వం: రోహిత్ ఎంజీ కృష్ణన్
థియేటర్ విడుదల తేది: ఫిబ్రవరి 3, 2023
ఓటీటీ విడుదల తేది: మార్చి 3, 2023
ఓటీటీ వేదిక: నెట్‌ఫ్లిక్స్
ఎప్పుడు సరికొత్త పంథాలో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ తెరకెక్కించడంలో మలయాళ సినీ ఇండస్ట్రీ ఒక అడుగు ముందు అంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకు మరో ఉదాహరణగా నిలిచిన చిత్రమే 'ఇరట్టా'. ప్రముఖ నటుడు జోజు జార్జ్ ద్విపాత్రాభినయంతో అదరగొట్టిన ఈ సినిమా ముందుగా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ కొట్టింది. ఇక థియేటర్లలో విజయం సాధించిన ఇతర భాష చిత్రాలు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు. అలా ఇటీవల కాలంలో ఎంతగానో ఆసక్తిగా వెయిట్ చేసిన మూవీ 'ఇరట్టా'. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ:
కేరళలోని వాగమన్ అనే ఒక ఊరిలోని పోలీస్ స్టేషన్ లో చిన్న పోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. దానికి ముఖ్య అతిథిగా అటవీ శాఖ మంత్రి హాజరవుతున్నారని పోలీసులు ఎవరి పనిలో వారు హడావిడిగా ఉంటారు. ఈ మీటింగ్ కోసం ప్రజలతోపాటు మీడియా కూడా కవరేజ్ కోసం కుడా ఫుల్ గా వస్తుంది. ఇంతలో పోలీస్ స్టేషన్ నుంచి మూడు సార్లు గన్ కాల్పులు వినిపిస్తాయి. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఏఎస్సై వినోద్ (జోజు జార్జ్) చనిపోయి ఉంటాడు. అక్కడ అనుమానంగా మరో ముగ్గురు పోలీసులు ఉంటారు. దీంతో ఆ స్టేషన్ ప్రాంగణం నుంచి ఏ ఒక్కరిని బయటకు పంపకుండా అక్కడే ఉంచి విచారణ ప్రారంభిస్తారు.
ఈ విషయం వినోద్ కవల సోదరుడు డీఎస్పీ ప్రమోద్ కు (జోజ్ జార్జ్ మరో పాత్ర) తెలిసి అక్కడికి చేరుకుంటారు. అసలు వినోద్ ను ఎవరు చంపారు? ప్రమోద్, వినోద్ కు మధ్య ఉన్న గొడవ ఏంటీ? వినోద్ మరణానికి కారణం ఎవరు? స్టేషన్ లో మిగతా పోలీసులతో వినోద్ కు ఎలాంటి వైరం ఉంది? ఈ కథలో మాలిని (అంజలి) ఎవరు? వినోద్ ఎలా చనిపోయాడో తెలుసుకున్నారా? వంటి తదితర ఆసక్తికర అంశాలను సినిమా చూసి తెలుసుకోవా

విశ్లేషణ:
మలయాళంలో ఇరట్టా అంటే ఇద్దరు అనే మీనింగ్ వస్తుంది. ఈ సినిమా ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే ఫ్యామిలీ డ్రామాకు క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ టచ్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో ఒక ఈవెంట్ తో సాధారణంగా ప్రారంభమైన ఈ సినిమా ఏస్సై వినోద్ చనిపోవడంతో ఆసక్తి కలుగుతుంది. అతను చనిపోయే స్థలంలో ముగ్గురు పోలీసులు ఉండటం. ఆ ముగ్గురితో వినోద్ కు గొడవలు ఉండటం వంటి అంశాలతో ఇన్విస్టిగేషన్ చేయడం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. వినోద్ చనిపోయే సమయంలో ముగ్గురు పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు. వారికి వినోద్ తో ఉన్న వైరం చూపిస్తూ ఓవైపు డౌట్ క్రియేట్ చేస్తూనే మరోవైపు ఒక్కో చిక్కుముడి విప్పుతూ ఉత్కంఠంగా మలిచారు.

ఒక్కో చిక్కుముడి..
ఇక పోలీస్ స్టేషన్ లోనే ఒక పోలీస్ హత్య అనేదానిపై ఓవైపు మీడియా, ప్రజలను పోలీస్ స్టేషన్ లో ఉంచడం, మరోవైపు పై అధికారుల నుంచి ఒత్తిడి అంశాలను చూపిస్తూ చాలా చక్కగా స్టోరీ నెరేషన్ చేశారు. అలాగే వినోద్, ప్రమోద్ కు మధ్య ఉన్న గొడవ చూపిచండం, వినోద్ అసలు క్యారెక్టర్ ఏంటీ అనే విషయాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ కాస్తా స్లోగా అనిపిస్తుంది. అయితే ఇదంతా వినోద్ క్యారెక్టరైజేషన్ ను చూపించేందుకే అని అర్థమవుతుంది. ఓ దశలో వినోద్ సోదరుడు ప్రమోద్ పై డౌట్ రావడం మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ప్రమోద్ చేతిలోకి వచ్చాక మూవీ పరుగులు పెడుతుంది. ఒక్కో చిక్కుముడి వీడిన కోద్ది మైండ్ పోతుంటుంది.

డిస్టర్బింగ్ న్యూస్ లు..
ఇక సినిమాలో క్రైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. కొద్దిసేపు ఏం జరిగిందా అన్నది అర్థం కాదు. పాయింట్స్ అన్నింటికి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే దిమ్మ తిరుగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ నెక్ట్స్ లెవెల్ గా ఆ తర్వాత ప్రమోద్ భవిష్యత్ లో జరిగే విషయాలపై వచ్చే ఆలోచన చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. అయితే మనం న్యూస్ లో కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ వింటుంటాం. అలాంటి వాటిలో ఒక పాయింట్ తీసుకుని దాని చుట్టూ క్రైమ్ థ్రిల్లర్ ను అల్లారు డైరెక్టర్ రోహిత్ ఎంజీ కృష్ణన్.

ఎవరెలా చేశారంటే..
చేసింది మొదటి సినిమా అయినా రైటర్ గా, డైరెక్టర్ గా రోహిత్ ఎంజీ కృష్ణన్ అదరగొట్టారు. రెగ్యులర్ గా న్యూస్ లో చూసే ఓ అంశాన్ని ఇంత బాగా తీయొచ్చా అని ఆశ్చర్యపరిచారు. ఇక ద్విపాత్రాభినయం చేసిన జోర్జ్ జాజ్ నటనతో చింపేశాడు. డీఎస్పీ ప్రదీప్ గా కూల్ గా.. వినోద్ వంటి మాస్ క్యారెక్టర్ లో రెండు వేరియేషన్స్ చూపించి ఇరగదీశాడు. ఇక జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాములుగా లేదు. ప్రతి సీన్ లో ఆ మూడ్ ఎలివేట్ అయ్యేలా ప్రాణం పోశాడు. అంజలి పాత్ర అంతగా ప్రభావం ఉండదు. మిగతా క్యారెక్టర్స్ బాగానే చేశారు. మిగతా సాంకేతిక విభాగం పనితీరు అంతా చాలా బాగుంది. ఫైనల్ గా డిఫరెంట్ థ్రిల్లర్ ను చూద్దామనుకునేవారికి ఇరట్టా ఒక బెస్ట్ ఎంపిక.


Click it and Unblock the Notifications











