Jolly LLB 3 First Review: జాలీ ఎల్ఎల్‌బీ 3 ఫస్ట్ రివ్యూ
బాలీవుడ్‌లో కామెడీ ఆధారంగా రూపొందిన కోర్ట్ రూమ్ డ్రామా జాలీ ఎల్ఎల్‌బీ, జాలీ ఎల్ఎల్‌బీ 2 చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆ తర్వా త ఈ సిరీస్‌లో మూడో చిత్రంగా వస్తున్న చిత్రం జాలీ ఎల్ఎల్‌బీ 3. ఈ చిత్రంలో స్టార్ హీరో అక్షయ్ కుమార్, సీనియర్ నటుడు అర్హద్ వార్సీ, సౌరబ్ శుక్లా, అమృత రావు, హ్యుమా ఖురేషి, బోమన్ ఇరానీ, సీమా బిశ్వాస్, గజరాజ్ రావు, రామ్ కపూర్, అన్ను కపూర్ తదితరులు నటిస్తున్నారు. అలోక్ జైన్, అజిత్ అంధారి నిర్మించిన ఈ కామెడీ లీగల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాపై సెన్సార్ రివ్యూ గురించిన వివరాల్లోకి వెళితే..
జాలీ ఎల్ఎల్‌బీ 3 చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొన్న తర్వాత ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్‌లు న్యాయ వ్యవస్థను కించపరిచేలా ఉంది. ఈ మూవీ టీజర్‌లో జ్యూడిషియరీపై వేసిన సెటైర్లు అభ్యంతరకంగా ఉన్నాయి. కాబట్టి ఈ చిత్ర విడుదలను వాయిదా వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వడం ఓ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అయితే ఈ వివాదంపై సెన్సార్ బోర్డు అధికారులు సెప్టెంబర్ వ తేదీన స్పందించే అవకాశం ఉందని తెలిసింది.

జాలీ ఎల్ఎల్బీ 3 సినిమా కథ విషయానికి వస్తే.. రైతుల కథా నేపథ్యంగా సాగుతుంది. రైతులు ఎదుర్కొనే సమస్యల గురించి కోర్టులో వాదోపవాదనలు కొనసాగుతాయి. రైతులకు పారిశ్రామిక వేత్తకు జరిగే కేసు వినోదాత్మకంగా సాగుతూనే.. సామాజికంగా ఆలోచింజేస్తుంది. రైతుల కోసం జాలీ మిశ్రా, వ్యాపారవేత్త తరఫున జాలీ త్యాగీ కేసును వాదిస్తారు. బద్ద విరోధులుగా ఉండే ఇద్దరు లాయర్లు జాలీ మిశ్రా, జాలీ త్యాగి నడుమ జడ్జి సుందర్ లాల్ త్రిపాఠి ఈ కేసును విచారిస్తారు. ఈ కేసులో రైతులను జాలీ మిశ్రా ఎలా గెలిపించారనేది సినిమా కథ.
జాలీ మిశ్రాగా అక్షయ్ కుమార్, జాలీ త్యాగీగా అర్షద్ వార్సీలు కోర్టులో తమదైన శైలిలో పోటాపోటీగా పెర్ఫార్మ్ చేశారు. న్యాయమూర్తిగా సౌరభ్ శుక్లా తనదైన శైలిలో వినోదాన్ని పండించేందుకు ప్రయత్నించారు. అక్షయ్ కుమార్‌కు భార్యగా హ్యుమా ఖురేషి, అర్హద్ వార్సికి భార్యగా అమృతరావు నటించారు. పారిశ్రామిక వేత్త గజరాజ్ రావు నటించారు. అయితే వీరి నటన పట్ల ఆడియెన్స్ ఎలా ప్రవర్తిస్తారు అనేది వేచి చూడాల్సిందే.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన వివాదాన్ని, కథను పక్కన పెడితే.. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెన్సార్ సర్టిఫికేషన్ (CBFC)తమ రివ్యూ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఈ చిత్రానికి UA 16+ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 16 ఏళ్లు దాటిన యువతీ, యువకులు ఈ సినిమాను చూడటానికి అర్హులు అని అధికారులు తెలిపారు.
ఇక జాలీ ఎల్ఎల్బీ 3 సినిమా నిడివి విషయంలో జాగ్రత్త పడినట్టే కనిపిస్తున్నది. కోర్టు రూమ్ డ్రామాను సాగదీయకుండా క్రిస్పీగా కట్ చేశారనే విషయంస్పష్టమైంది. ఈ సినిమాను సుమారుగా 157 నిమిషాలు అంటే.. రెండు గంటల 37 నిమిషాల రన్ టైమ్‌ను డిసైడ్ చేశారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











