Jolly LLB 3 Critic Review: జాలీ ఎల్‌ఎల్‌బీ 3 క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్
బాలీవుడ్‌లో కామెడీ ఆధారంగా రూపొందిన కోర్ట్ రూమ్ డ్రామా జాలీ ఎల్ఎల్‌బీ, జాలీ ఎల్ఎల్‌బీ 2 చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆ తర్వా త ఈ సిరీస్‌లో మూడో చిత్రంగా వస్తున్న చిత్రం జాలీ ఎల్ఎల్‌బీ 3. ఈ చిత్రంలో స్టార్ హీరో అక్షయ్ కుమార్, సీనియర్ నటుడు అర్హద్ వార్సీ, సౌరబ్ శుక్లా, అమృత రావు, హ్యుమా ఖురేషి, బోమన్ ఇరానీ, సీమా బిశ్వాస్, గజరాజ్ రావు, రామ్ కపూర్, అన్ను కపూర్ తదితరులు నటిస్తున్నారు. అలోక్ జైన్, అజిత్ అంధారి నిర్మించిన ఈ కామెడీ లీగల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది.
జాలీ ఎల్‌ఎల్‌బీ 3 సినిమా కథ విషయానికి వస్తే.. రైతుల కథా నేపథ్యంగా సాగుతుంది. రైతులు ఎదుర్కొనే సమస్యల గురించి కోర్టులో వాదోపవాదనలు కొనసాగుతాయి. రైతులకు పారిశ్రామిక వేత్తకు జరిగే కేసు వినోదాత్మకంగా సాగుతూనే.. సామాజికంగా ఆలోచింజేస్తుంది. రైతుల కోసం జాలీ మిశ్రా, వ్యాపారవేత్త తరఫున జాలీ త్యాగీ కేసును వాదిస్తారు. బద్ద విరోధులుగా ఉండే ఇద్దరు లాయర్లు జాలీ మిశ్రా, జాలీ త్యాగి నడుమ జడ్జి సుందర్ లాల్ త్రిపాఠి ఈ కేసును విచారిస్తారు. ఈ కేసులో రైతులను జాలీ మిశ్రా ఎలా గెలిపించారనేది సినిమా కథ.

అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమాను దుబాయ్‌కి చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ చూశానని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో వెల్లడించారు. ఈ సినిమా తనకు నచ్చిందని, ఇది పైసా వసూల్ చిత్రం కాబోతున్నది అని వెల్లడించారు. జాలీ ఎల్ఎల్‌బీ 3 పవర్ ప్యాక్డ్ కోర్టు రూమ్ డ్రామా అని పేర్కొన్నాడు. ఈ సినిమా కామన్ మ్యాన్ న్యాయం కోసం చేసే పోరాటంగా కథ ఉంటుంది అని ఆయన పేర్కొన్నాడు.
జాలీ ఎల్‌ఎల్‌బీ 3 సినిమాకు ముగ్గురు మూల స్తంభాల్లాగా నిలిచారు. అక్షయ్ కుమార్, అర్హద్ వార్సీ, సౌరభ్ శుక్లా ఈ మూవీని తమ భుజాల మీద మోసారు. తమ నటనతో స్క్రీన్‌పై నవ్వుల పూలు పూయించారు. తమ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే యావరేజ్. మ్యూజిక్ చాలా పేలవంగా ఉంది. ఓవరాల్'గా సినిమా పైసా వసూలు చిత్రం అని ఉమేర్ సంధూ తన రివ్యూలో పేర్కొన్నారు.
జాలీ ఎల్ఎల్బీ 3 చిత్రం కంప్లీట్ ప్యాకేజ్ సినిమా. హ్యుమర్, సెటైర్, డ్రామా, ఎమోషన్స్ పక్కాగా జొప్పించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఇచ్చిన సందేశం బాగుంది. జాలీ వర్సెస్ జాలీ అద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. సుభాష్ కపూర్ ఆడియెన్ పల్స్ గుర్తించి హ్యుమర్, ఎమోషన్స్‌ను జోడించి రూపొందించారు. ది క్లైమాక్స్ ను మేనేజ్ చేసిన విధానం బాగుంది అని తరుణ్ ఆదర్శ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











