Joruga Husharuga Review బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ హిట్ కొట్టాడా? సిరి హన్మంతు, పూజిత మెప్పించిందా?
Rating: 2.75/5
నటీనటులు: విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ, సిరి హన్మంతు, మధు నందన్, సాయికుమార్, రోహిణి, బ్రహ్మజీ, జెమినీ కిరణ్, చంద్రికా థాకూర్ తదితరులు
దర్శకత్వం: అనుప్రసాద్
నిర్మాత: నిరీష్ తిరువీడుల
మ్యూజిక్: ప్రణీత్ నంబూరి
సినిమాటోగ్రాఫర్: మహి రెడ్డి పొందుగుల
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
బ్యానర్: శిఖర, అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ
సమర్పణ: శ్రీమతి నివేదిత
రిలీజ్ డేట్: 2023-12-15
ఆనంద్ (మధు నందన్) బాస్‌గా ఉండే ఆఫీస్‌లో సంతోష్ (విరాజ్ అశ్విన్) పనిచేస్తూ.. నిత్య (పూజిత పొన్నాడ)తో అఫైర్‌లో ఉంటాడు. అయితే సంతోష్‌కు తెలియకుండా ఆనంద్ ఆఫీస్‌లో టీమ్ లీడ్‌గా చేరుతుంది. అయితే వారిద్దరి మధ్య అఫైర్ బయటకు తెలియకుండా సంతోష్, నిత్య జాగ్రత్త పడుతుంటాడు. నాలుగు పదుల వయసు వచ్చినా పెళ్లి కాని ప్రసాదుగా ఉన్న ఆనంద్ తనను ప్రేమిచే సుచిత్ర (సిరి హన్మంతు)ను కాదని తన ఆఫీస్‌లో చేరిన నిత్యపై మనసు పారేసుకొంటాడు.

సంతోష్ చేసిన లవ్ ప్రపోజల్‌ను శిల్ప (చంద్రికా థాకూర్) ఎందుకు రిజెక్ట్ చేసింది? సంతోష్‌తో నిత్య అఫైర్ ఎలా మొదలైంది? సంతోష్ ఆఫీస్‌లోనే నిత్య ఎందుకు చేరాల్సి వచ్చింది? కొన్ని ఆంక్షల మధ్య ఆఫీస్‌లో సంతోష్, నిత్య తమ రొమాంటిక్ లైఫ్‌ను ఎలా కొనసాగించారు? తన బాస్ ఆనంద్ తన ప్రపోజల్‌ను రిజెక్ట్ చేస్తే సుచిత్ర ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? తన లవర్ నిత్యను ప్రేమిస్తున్నానంటూ వెంటపడితే సంతోష్ ఎలా డీల్ చేశారు? ఇదిలా ఉంటే.. 20 లక్షల లోన్ కోసం సంతోష్ ప్రయత్నించాడు? 20 లక్షల లోన్ సంతోష్ ఎందుకు కోసం తీసుకోవాలనుకొన్నాడు? బాస్ ఆనంద్‌ను సుచిత్రను కలుపాలనే ప్రయత్నాలు ఫలించయా? తన తల్లిదండ్రులు (సాయికుమార్, రోహిణి)కి ఎదురైన సమస్య నుంచి సంతోష్ ఎలా గట్టెక్కించాడు? చివరకు నిత్యను ఎలా దక్కించుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే జోరుగా హుషారుగా సినిమా కథ.
లవ్, ఆఫీస్ బేస్డ్ రొమాన్స్, ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి రాసుకొన్న కథ, కథనాలతో దర్శకుడు అను ప్రసాద్ డీల్ చేసిన విధానం బాగుంది. యూత్‌ను దృష్టిలో పెట్టుకొని లవ్, రొమాన్స్‌తో కథను నడుపుతూ.. అదే సమయంలో సాయికుమార్, రోహిణితో ఒక ఎమోషనల్ ట్రాక్‌ను నడిపిన విధానం బాగుంది. యూత్‌ను మెప్పించేలా రాసుకొన్న కామెడీ, ఫన్ ఎలిమెంట్స్‌ను బ్రహ్మాజీ, జెమిని కిరణ్, రాజేశ్ ఖన్నాతో పడించడంతో సరదాగా గడిచిపోయింది. చివర్లలో మ్యారేజ్ డ్రామాతో సినిమాను ముగించిన విధానం ఫీల్‌గుడ్‌గా అనిపిస్తుంది. దర్శకుడిగా అను ప్రసాద్ నటీనటుల నుంచి ఫెర్ఫార్మెన్స్‌ను రాబట్టుకొన్న తీరు మెప్పించేలా ఉంది.

బేబీ తర్వాత విరాజ్ అశ్విన్ మూవీ కావడంతో అందరి దృష్టి మరింత పడింది. అయితే కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతే.. తన ప్రేమను గెలిపించుకొనే యువకుడిగా డిఫరెంట్ వేరియెన్స్ ఉన్న పాత్రను బాగా చేశాడని చెప్పాలి. డైలాగ్ డెలివరీపరంగా, యాక్టింగ్, డ్యాన్సుల పరంగా ఇంకాస్త మెరుగు పరుచుకొంటే.. పోటీని తట్టుకొనే అవకాశం ఉంటుంది. కీలక సన్నివేశాల్లో విరాజ్ మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. పూజిత పొన్నాడతో లవ్లీ కెమిస్ట్రీతో రొమాన్స్ పండిచాడు. సిరి హన్మంతు ఓ కీలక పాత్రలో ఒదిగిపోయింది. మధు నందన్ కూడా బాస్‌గా బాగా చేశాడు. కథకు కీలకమైన పాత్రలో తనదైన శైలిలో మెప్పించే ప్రయత్నం చేశారు. సాయికుమార్, రోహిణి సినిమాకు కావాల్సిన సెంటిమెంట్, ఎమోషన్స్‌ను తమ పరిధిలో పండించారు. రాజేశ్ ఖన్నా కామెడీ టైమింగ్ బాగుంది. ఇతర నటీనటులు తమ రేంజ్‌లో ఫెర్ఫార్మ్ చేశారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. జోరుగా హుషారుగా సినిమాకు సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్. సీన్లను చాలా రిచ్‌గా, గ్రాండియర్‌గా షూట్ చేశాడు. మంచుకొండల్లో విరాజ్, పూజాపై షూట్ చేసిన సాంగ్ విజువల్స్ బాగున్నాయి. ప్రణీత్ నంబూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకొనేలా ఉంది. పలు సీన్లను తన మ్యూజిక్‌తో ఫీల్‌గుడ్‌గా మార్చారు. మార్తాండ్ వెంకటేష్ తన అనుభవంతో సినిమాను పరుగులు పెట్టించారు. నిరీష్ తిరువీడుల అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. క్వాలిటీ కోసం రాజీ పడలేదనే ఫీలింగ్ కలుగుతుంది.

జోరుగా షుషారుగా టైటిల్ తగినట్టే లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫన్ అంశాలతో ఫీల్‌గుడ్‌గా సాగే చిత్రం. థియేటర్లో పెద్దగా మెదడుకు పని చెప్పాల్సిన పని లేకుండా ఆహ్లాదకరంగా, పంచ్ డైలాగ్స్‌తో సినిమా అలరిస్తుంది. కథలో కొత్తదనం లేకపోయినా.. స్టోరిని డిఫరెంట్‌గా చెప్పిన విధానం బాగుంది. స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ మంచి వినోదంతో సాగడం వల్ల అవేమీ పెద్దగా కనిపించవు. ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్లకు కొంచెం క్రేజ్ ఉన్న యాక్టర్లను చేసుకొంటే ఇంకా బెటర్ ఉండేదనిపిస్తుంది.పెద్దగా ట్విస్టులు లేకుండా తమాషాగా, సరదాగా సాగిపోయే సినిమాలో చివర్లో బ్రహ్మాజీ, జెమినీ కిరణ్ చేసిన ఫన్ డ్రామాతో హాయిగా నవ్వుకొని వచ్చేలా సినిమా ఉంటుంది. అంచనాలు లేకుండా వెళితే.. ఈ సినిమా నిరాశపరచదు.


Click it and Unblock the Notifications











