Devara 22 Days Collections: దేవర రేర్ రికార్డు.. ఎన్టీఆర్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
దేవర చిత్రం మూడో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఇటీవల విడుదలైన స్టార్ హీరోల సినిమాలు వేట్టయన్, విశ్వం, జిగ్రా, వికీ విద్యా కా ఓ వాలా వీడియో సినిమాలకు ధీటుగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ఎన్టీఆర్ స్టామినాకు కొత్త నిర్వచనం చెప్పిందనే విషయాన్ని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈ సినిమా 22వ రోజుల క కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. యువ సుధ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హీరో కల్యాణ్ రామ్ నందమూరి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రికార్డు క్రియేట్ చేసింది.

దేవర మూవీ విడుదలకు ముందు భారీ క్రేజ్ ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారుగా 185 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 188 నుంచి 190 కోట్ల రూపాయలుగా విలువ కట్టారు. అలా భారీ టార్గెట్‌తో భాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.
గత మూడు వారాల్లో ఈ సినిమా ఊహించని విధంగా రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ మూవీ తొలివారంలో 250 కోట్లకుపైగా కలెక్షన్లు, రెండో వారంలో 55 కోట్ల రూపాయలు, మూడో వారంలో 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ మూవీ 330 కోట్ల రూపాయల నికర కలెక్షన్లు ఇండియాలో వసూలు చేసింది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇవి అత్యుత్తమ కలెక్షన్లుగా మారాయి.
రిలీజ్‌కు ముందే ఓవర్సీస్‌లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రచ్చ చేసింది. ఈ సినిమా విడుదలకు ముందే 2 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగానే కలెక్షన్ల రాబట్టింది. దాంతో ఈ సినిమా గత 21 రోజుల్లో ఓవర్సీస్‌లో 90 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇటీవల కాలంలో విదేశీ గడ్డపై కల్కి, స్త్రీ 2 తర్వాత ఆ రేంజ్‌లో వసూళ్లను సాధించిన చిత్రంగా దేవర నిలిచింది.
దేవర చిత్రం 22వ రోజున వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ ఇండియాలో 1.5 కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 1.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 511 కోట్లకుపైగా రూపాయలు వసూలు చేసింది. ఈ మూవీ ఇప్పటి వరకు కోటి రూపాయలకు తగ్గకుండా 22 రోజుల పాటు వసూలు చేయడం ఓ రికార్డుగా ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











