Jr NTR Review on Dhandoraa: దండోరా మూవీపై జూనియర్ ఎన్టీఆర్ రివ్యూ.. హ్యాట్సాఫ్ అంటూ యంగ్ టైగర్
బెదురులంక 2012 లాంటి ఫీల్‌గుడ్ చిత్రాన్ని అందించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన చిత్రం దండోరా. తెలుగు సినిమా పరిశ్రమలోని పాపులర్ యాక్టర్లు శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సామాజిక సృహ, కులం వివక్ష లాంటి అంశాలతో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు.
ఈ మూవీ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫిని, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా, మార్క్ కే రాబిన్ మ్యూజిక్, క్రంతి ప్రియం ఆర్ట్ డైరెక్టర్‌గా, రేఖా బొగ్గారపు కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఇప్పటికే మంచి అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం డిసెంబర్ 23న గ్రాండ్‌గా రిలీజైంది.
తెలంగాణ గ్రామీణ వాతావరణం నేపథ్యంగా భాష,యాసతో సంభాషణలను చక్కగా, ఆలోచింపజేసే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కుల వివక్ష, అగ్ర కులాలు, తక్కువ కులాల మధ్య ఆధిపత్యం లాంటి అంశాలను నిజాయితీగా తెర మీదకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలోని పాత్రలను కూడా చక్కగా డిజైన్ చేశారు. అయితే ఇలాంటి సినిమాకు థియేట్రికల్‌గా మంచి రెస్సాన్స్ లభించింది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకు రావాల్సిన గుర్తింపు రాలేదనే అభిప్రాయం సినీ వర్గాల్లో ఉంది.

ఇలాంటి సినిమాపై ఇటీవల పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ప్రముఖుల ప్రశంసలు అందుకొన్న ఈ చిత్రం ఇటీవల ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. మూవీని చూసిన వారంతా ఫీల్‌గుడ్ కామెంట్స్ పాస్ చేస్తున్నారు. అదే కోవలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పోస్టు పెట్టి.. పేరు పేరునా అభినందించారు.
దండోరా సినిమా ఇప్పుడే చూశాను. సమాజంలోని పరిస్థితులను ఆలోచింపజేసే పవర్‌ఫుల్ చిత్రం. నవదీప్, నందూ, రవికృష్ణ, బిందు మాధవి అద్బుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. గ్రామీణ పరిస్థితులు, సామాజిక అంశాలు, ప్రజల జీవన విధాన మూలాల ఆకళింపు చేసుకొని కథను, పాత్రలను బలంగా రాసుకొన్నారు. కథను అద్బుతంగా తెర మీద ఆవిష్కరించిన దర్శకుడు మురళీ కాంత్‌కు హ్యాట్సాఫ్ అని తన పోస్టులో పేర్కొన్నారు.
ఇలాంటి బలమైన కథ నమ్మి... అండదండలు అందించిన నిర్మాత రవీంద్ర బెనర్జీకి అభినందనలు. ఓ గొప్ప చిత్రంలో భాగమైన చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందికి కంగ్రాట్యులేషన్ అని జూనియర్ ఎన్టీఆర్ తన అభినందన సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దండోరా చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











