JSK First Review: జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (JSK) మూవీ ఫస్ట్ రివ్యూ
మలయాళ సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జే ఫణింద్ర కుమార్, సేతు రామన్ నాయర్ కనకోల్ నిర్మాతలుగా రూపొందిన చిత్రం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, స్టార్ హీరో సురేష్ గోపి, దిలీప్, శృతి రామచంద్రన్, దివ్య పిళ్లై తదితరులు నటించారు. అయితే ఈ సినిమా సెన్సార్ వివాదంలో చిక్కకొని రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటం వెనుక అసలు కారణం ఏమిటంటే?
జానకి V/S స్టేట్ ఆఫ్ కేరళ సినిమా కథ విషయానికి వస్తే.. బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేసే జానకి సెలవులను గడిపేందుకు కేరళలోని తన సొంత గ్రామానికి వస్తుంది. అయితే అక్కడ జరిగిన ఓ సంఘటన ఆమె జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ దారుణ సంఘటన తర్వాత ఆమె లైఫ్ అశాంతికి గురి అవుతుంది. దాంతో ఆమె న్యాయపోరాటానికి సిద్దమవుతుంది. అడ్వకేట్ అబెల్ డోనోవ్యాన్ (సురేష్ గోపి) ఎంట్రీ ఇవ్వడంతో కేసు ట్విస్ట్ చోటు చేసుకొంటుంది.

కేరళ న్యాయ వ్యవస్థ బ్యాక్ డ్రాప్‌గా రూపొందింది. న్యాయ వ్యవస్థలోని లోపాలపై సైటరికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. తనపై జరిగిన లైంగిక దాడికి న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించిన జానకీకి తగిన న్యాయం జరిగిందా? కేరళ కోర్టులో తనకు ఎలాంటి తీర్పు, న్యాయం లభించిందనేది కథ.
అయితే ఈ సినిమాను జూన్ 27వ తేదీన రిలీజ్ చేసేందుకు ముహుర్తం నిర్ణయించి సెన్సార్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు అధికారులు ఎలాంటి కట్ లేకుండా U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే జానకి అంటే శ్రీ రాముడు భార్య సీతాదేవీ పేరు. ఈ సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాకుండా మూవీ రిలీజ్‌కు మోకాలడ్డుకొని షాకిచ్చారు. దాంతో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసినట్టు నిర్మాత ప్రవీణ్ నారాయణ్ అధికారికంగా ప్రకటించారు.
అయితే సెన్సార్ బోర్డు పెట్టిన అభ్యంతరాలపై నిర్మాత, చిత్ర యూనిట్ సంప్రదింపుల జరిపారు. ఈ సినిమా టైటిల్‌లోని జానకి పేరు తొలగించేందుకు ఒప్పకొన్నారు. అలాగే కోర్టులో ఉండే ఒక సీన్‌ను తొలగించేందుకు చిత్ర యూనిట్ అంగీకరించింది. అంతేకాకుండా మొత్తం 8 కట్స్‌తో ఈ సినిమాను రీ ఎడిట్ చేసి సెన్సార్ బోర్డుకు సమర్పించారు.
ఎడిట్ వెర్షన్ చూసిన అనంతరం ఈ సినిమా రిలీజ్‌కు సెన్సార్ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంలోని సురేష్ గోపి, మాధవ్, అలాగే అనుపమ పరమేశ్వరన్ నటన హైలెట్ అని పేర్కొన్నారు. ఇక ఈ సినిమా కథ ఎంపిక, దానిని తెర మీదకు తీసుకొచ్చిన దర్శకుడిపై ప్రశంసలు గుప్పించారు. దాంతో ఈ సినిమాను జూలై 17వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు.
ఈ చిత్రంలో కేంద్ర మంత్రి సురేష్ గోపి చాలా రోజుల తర్వాత మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాకుండా తన కుమారుడు మాధవ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం మరో విశేషం. ఇక ఈ చిత్రం ద్వారా అనుపమ పరమేశ్వరన్ చాలా ఏళ్త తర్వాత మలయాళ చిత్రంలో నటించింది. ఈ సినిమా అన్ని అడ్డంకులను తొలగించుకోని రిలీజ్‌కు సిద్దం కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











