Junior Movie Twitter Review: జూనియర్ మూవీ ట్విట్టర్ రివ్యూ

తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వరాహి చలన చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి నిర్మాతగా సాయి శివానీ సమర్పణలో రాధాకృష్ణా రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం జూనియర్. ఈ చిత్రంలో గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ హీరోగా పరిచయం అవుతూ శ్రీలీల, జెనిలియా డిసౌజాతో కలిసి నటించిన ఈ చిత్రం ఇది.

ఇంకా ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్, రావురమేష్, ఆచ్యుత్ రావు, సత్య, వైవా హర్ష తదితరులు నటించారు. ఈ సినిమా జూలై 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఓవర్సీస్, హైదరాబాద్‌లోని ప్రీమియర్ల తర్వాత నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాల్లోకి వెళితే..

Junior Movie Twitter Review

సినీ రంగానికి కొత్తగా హీరోను పరిచయం చేయాలంటే.. సింపుల్‌గా, ఎఫెక్టివ్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్టార్ హీరో ఇమేజ్‌ను తొలి సినిమాలోనే బిల్డ్ చేయాలని ప్రయత్నిస్తే బ్యాక్ ఫైర్ అవుతుంది. ఈ సినిమా మిక్స్‌డ్ ఫ్రూట్ జ్యూస్. ఈ సినిమాలో పాత్రల క్యారెక్టరైజేషన్ సరిగా లేకపోవడం పెద్ద మైనస్. కథలో ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయింది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

సినీ రంగానికి తొలి పరిచయమైన కిరీటీ రెడ్డి ఇంప్రెసివ్‌గా నటించాడు. ముఖ్యంగా డ్యాన్స్, యాక్షన్ సీన్లు బాగున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన వైరల్ వయ్యారీ పాట సినిమాకు హైలెట్. కానీ స్టోరీ పరమ రొటీన్‌గా ఉంది. హీరోయిన్లు శ్రీలీల, జెనీలియాకు ఇంకా బెటర్ క్యారెక్టర్లు ఉండాల్సింది. కథ గురించి పట్టించుకోకుండా హీరో కోసం ఓసారి చూడొచ్చు అని నెటిజన్ కామెంట్ చేశాడు.

జూనియర్ సినిమా ప్రీమియర్ చూశాను. కిరీటి నటన, డాన్స్ సూపర్ గా చేసాడు. శ్రీలీల ఎప్పటిలానే చేసింది.కాని ఈ సినిమాలో కథ ప్రదానమైన మైనస్. ఎన్నో సినిమాలలో చూసి రుద్దేసిన టెంప్లెట్ లో సాగుతుంది. దేవిశ్రీ మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ సూపర్. సినిమా మాత్రం యావరేజ్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

జూనియర్ సినిమా చూసిన ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశాడు. మిర్చి, శ్రీమంతుడు, మహర్షి సినిమాలు మూడు కలిపితే జూనియర్ అంటూ కామెంట్ చేశాడు.

జూనియర్ సినిమా ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. కిరిటీ తన ఇంట్రోతోను డ్యాన్సులు, పెర్ఫార్మెన్స్‌తో ఇంప్రెస్ చేశారు. అయితే శ్రీలీలతో ఉన్న ఎపిసోడ్స్ అంత ఇంపాక్ట్‌గా లేవు. దాంతో ఫస్టాఫ్ కొంత డీలా పడింది. సాంగ్స్ బాగున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సత్య, వైవా హర్ష కామేడీ వర్కవుట్ అయింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

జూనియర్ సినిమాలో కిరీటీ ఎనర్జీ, డ్యాన్స్, ఫైట్స్, పెర్ఫార్మెన్స్ సూపర్బ్. జెనీలియా మంచి పాత్రతో కమ్ బ్యాక్ మంచిగా ఇచ్చింది. జూనియర్ సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని నెటిజన్ కామెంట్ చేశారు.

జూనియర్ సినిమా చూశాను. హీరో కిరిటీకి మంచి ఫ్యూచర్ ఉందని నిరూపించుకొన్నాడు. నీ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ బాగుంది. నీ ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. మంచి స్క్రిప్టులు పడితే ఏదో ఒకరోజు నీది అవుతుంది. డ్యాన్సులు బాగా చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ మాదిరిగా స్టెప్పులు వేశాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Read more about: junior kireeti sreeleela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X