మరో బ్యాచ్‌ లర్స్‌

By Staff

Juniors
- జలపతి
చిత్రం: జూనియర్స్‌
నటీనటులు: నరేష్‌, షిరీన్‌, అనిల్‌,
ప్రకాష్‌ రాజ్‌, తనికెళ్ళ భరణి, సుధాకర్‌
సంగీతం: చక్రి
నిర్మాతలు: జె.భగవాన్‌, డి.వి.వి.దానయ్య
స్క్రీన్‌ ప్లే, దర్వకత్వం: జె.పుల్లారావు

ఒక దశలో తెలుగు, మళయాళం, తమిళ భాషల్లో 'గుప్త జ్ఞాన' చిత్రాలు పేరిట ఛీప్‌ సెక్స్‌ చిత్రాలు వెల్లువలా వచ్చాయి. పేరుకు అవి ఎడ్యుకేషన్‌ అని చెప్పిన 'బిజినెస్‌' చేసుకోవడమే పరమావధి. అదే కోవలో తెలుగులో కొంచెం సోఫెస్టికేటడ్‌ వర్షన్‌ లో బ్యాచ్‌ లర్స్‌ అనే చిత్రం వచ్చింది. పచ్చిబూతులు, టీనేజ్‌ కాలేజ్‌ పిల్లలు చేసే వెకిలి చేష్టలు..

అన్ని చూపించి చివరికి 'నీతి పాఠం' ఒకటి చెప్పే చిత్రాలకు అది నాంది పలికింది. తెలుగులో వచ్చిన ఈ ట్రెండ్‌ ను ప్రేరణగా తీసుకొని తమిళంలో దర్శకుడు కస్తూరి రాజా తుల్లువదో ఇళ్ళామై అనే చిత్రాన్ని రూపొందించాడు. తమిళంలో గత విజయం సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీన్నే మళ్ళీ తెలుగులో రీమేక్‌ చేయడం విశేషం.

ఇంతకుముందే చెప్పినట్లు టీనేజీ సమస్యలను చూపించి, చివర్లో ప్రకాష్‌ రాజ్‌ తో భారీ సందేశాన్ని ఒకటి చెప్పించి ముగించిన ఈ చిత్రం ఆకట్టుకోదు. ఇలాంటి 'అమెరికన్‌ ఫై' టైప్‌ చిత్రాలు ఆకట్టుకోవాలంటే బాగా నవ్వించే గలిగే సన్నివేశాలు, డైలాగ్స్‌ ఉండాలి. అవి శూన్యం. ఏ సినిమాలోనైనా ఒకే తీరుగా నటించే నరేష్‌ నటన చూడడమూ కష్టమే. హీరోయిన్‌ షిరీన్‌ ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్‌. ఆమె అందం కాస్తా కంటికి ఆనందం కల్గిస్తుంది. సాధారణ చిత్రం, అంతకన్నా సాధారణ సంగీతం. ఇంకా ఈ చిత్రం కథ కావాలా? అయితే చదవండి.

నరేష్‌, షిరీన్‌, అనిల్‌, ఇంకా ఇతర గ్యాంగ్‌ అంతా కలిసి కాలేజ్‌ లో చదువుతారు. వీళ్ళ తల్లితండ్రులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. సో..తల్లిండ్రులకు తమ మీద ప్రేమ లేదని భావించి వీరంతా కట్టకట్టుకొని టూర్‌ కు వెళుతారు. టూర్‌ లో నరేష్‌, షిరీన్‌ శారీరకంగా ఒకటవుతారు 'తప్పు' చేశామని ఇంటికి వచ్చాక, తల్లితండ్రులు కూడా ఆదరించారు. ఆ సమయంలో ప్రకాష్‌ రాజ్‌ 'యూత్‌ గొప్పతనం' గురించి భారీ క్లాస్‌ ఇచ్చి క్లైమక్స్‌ చెప్పుతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X