Jurassic World Dominion movie review స్పీల్‌బర్గ్ స్థాయిని అందుకోలేక.. నిరాశను మిగిల్చిన లేటేస్ట్ ఫ్రాంచైజీ
Rating: 2.5/5
నటీనటులు: క్రిస్ ప్రాట్, బ్రైసీ డల్లాస్ హోవార్డ్, లారా డెర్న్, జెఫ్ గోల్డ్‌బ్లమ్, సామ్ నీల్ తదితరులు
దర్శకత్వం: కోలిన్ ట్రెవెరో
కథ: డెరిక్ కన్నొల్లీ, కోలిన్ ట్రెవరో
స్క్రీన్ ప్లే: ఎమిలీ కార్మికేల్, కోలీన్ ట్రెవరో
నిర్మాత: ఫ్రాంక్ మార్షల్, ప్యాట్రిక్ క్రోవిలీ
సినిమాటోగ్రఫి: జాన్ స్క్రావర్జ్ మెన్
ఎడిటింగ్: మార్క్ సేంజర్
మ్యూజిక్: మైఖేల్ గ్లాచినో
బ్యానర్: అంబ్లిన్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫర్ట్‌ఫెక్ట్ వరల్డ్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2022-06-10
నిడివి: 146 నిమిషాలు
బడ్జెట్: 165 మిలియన్ డాలర్లు
ప్రపంచ సినిమా చరిత్రలో 30 ఏళ్ల క్రితం సంచలన దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ అద్భుతమైన గ్రాఫిక్స్‌తో జురాసిక్ పార్క్ చిత్రాన్ని ఓ విజువల్ వండర్‌గా అందించి ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కల్పించాడు. వివిధ రకాల సైజులో డైనోసార్లను ప్రేక్షకులకు పరిచయం చేసి థ్రిల్ అందించారు. హాలీవుడ్‌లో ఎన్నడూ లేని విధంగా కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో కొత్త తరహా చిత్రాలను అందించాడు. ఇప్పటికీ జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలు వస్తున్నాయంటే ప్రేక్షకులకు ఓ పండగ మాదిరి వాతావరణం ఉంటుంది. తాజాగా జురాసిక్ ఫ్రాంచైజీగా వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రం ఎలాంటి అనుభూతిని కలిగించిందంటే..
ప్రపంచ వినాశనానికి కంకణం కట్టుకొన్న బైసిన్ జెనెటిక్స్ అనే కార్పోరేట్ డైనోసార్ సృష్టికర్త దుష్టబుద్ధితో క్రూరమైన డైనోసార్లను రూపొందిస్తుంది. జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్‌లో ఇస్లా నుబ్లర్ విధ్వంసం తర్వాత నాలుగేళ్లకు జురాసిక్ వరల్డ్ డామినియన్ ఏర్పడుతుంది. అయితే డైనోసార్లు ద్వీపంలో జీవించవు.. అవి మానవులతో జీవనం చేస్తాయనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక మానవ క్లోనింగ్ మాసీ లాక్‌ఉడ్ (ఇసాబెల్లా సెర్మాన్)ను బైసిన్ జెనెటిక్స్ కంపెనీ సీఈవో డాక్డర్ లూయిస్ డాడ్గ్‌సన్ (క్యాంప్‌బెల్ స్కాట్) కిడ్నాప్ చేస్తాడు.

కిడ్నాప్‌కు గురైన మాసీని కాపాడుకోవడానికి డైనోసార్లతో, అలాగే దుష్ట మానవులతో వారి పెంపుడు తల్లిదండ్రులు ఎలాంటి పోరాటం చేశారు? తన పుట్టుకపై మాసీకి ఉన్న సందేహాలు ఎలాంటివి? మాసీ పుట్టుక వెనుక కారణాలు ఏమిటి? చివరకు బైసిన్ జెనెటిక్స్ కంపెనీ సీఈవో పరిస్థితి ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే జురాసిక్ వరల్డ్ డొమినియన్ సినిమా కథ.

ఇక జురాసిక్ వరల్డ్ డొమినియన్ సినిమా ఎలా ఉందనే విషయానికి వస్తే.. జురాసిక్ పార్క్ చిత్రాన్ని స్టీవెన్ స్పీల్‌బర్గ్ అద్బుతంగా తెరకెక్కించారు. డైనోసార్లు ఎంత ప్రమాదకరమనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు.. వెన్నులో చలిపుట్టే విధంగా తెర మీద ఆవిష్కరించాడు. అయితే జురాసిక్ వరల్డ్ డొమినియన్ విషయానికి వస్తే.. దర్శకుడు కోలిన్ ట్రెవరో మాత్రం ఆ మ్యాజిక్‌ను క్రియేట్ చేయడంలో దారుణంగా విఫలమయ్యాడని చెప్పవచ్చు.

ఇక జురాసిక్ వరల్డ్ డొమినియన్ ప్రత్యేకత ఏమిటంటే.. 1993లో జురాసిక్ పార్క్ మూవీ వచ్చినప్పటి నుంచి జెఫ్ గోల్డ్‌లమ్, లారా డెర్న్, సామ్ నీల్ స్క్రీన్ మీద కనిపించడం ఫ్యాన్స్‌కు కిక్కెంచే విషయం. మొదటి రెండు జురాసిక్ ఫ్రాంచైజీలో నటించిన క్రిస్ ప్రాట్, బ్రైస్ డల్లాస్ హోవార్డ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. అయితే వారి గత సినిమాల్లో పాత్రలతో పోల్చుకొంటే తేలిపోయినట్టు కనిపిస్తాయి. ఎథోలాజిస్ట్ ఓవెన్ గ్రాడీగా క్రిస్ ప్రాట్, జురాసిక్ వరల్డ్ పార్క్ మేనేజర్‌గా బ్రౌసీ డాల్లస్, డాక్టర్ అలన్ గ్రాంట్‌గా సామ్ నీల్, డాక్టర్ ఇయాన్ మాల్కమ్‌గా జెఫ్ గొల్డ్‌బ్లమ్ నటించారు.

జురాసిక్ పార్క్ సృష్టికర్త స్టీవెన్ స్పీల్‌బర్గ్ జురాసిక్ వరల్డ్ డొమినియన్ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం మరో స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమాకు దర్శకుడు కోలిన్ ట్రెవరో, ఎమిలీ కార్మిచెల్ స్క్రీన్ ప్లే అందించారు.
డైనోసార్స్ దీవుల్లోనే కాకుండా మానవులతో కలిసి జీవిస్తాయి.. అలాగే మానవ క్లోనింగ్ మాసీ కిడ్నాప్ అనే రెండు పాయింట్లను మేలవించి జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే పాత చిత్రాల కంటెంట్‌తోనే ఈ ఫ్రాంచైజీని సరిపెట్టారనిపిస్తుంది. కొత్తదనం ఏమీ కనిపించవు. పాత చిత్రాలను తలదన్నే విధంగా కంటెంట్ ఉండదు. లారా డెర్న్, సామ్ నీల్, జెఫ్ గోల్డ్‌బ్లమ్ ఎంట్రీ సీన్లు కేక పెట్టిస్తాయి. మ్యూజిక్, సౌండ్ విభాగాల పనితీరు బాగుంది. జురాసిక్ పార్క్ అభిమానులు ఓ సారి కొత్త అనుభూతిని పొందేందుకు ఓసారి చూడవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే కొన్ని అంశాలు నచ్చేలా ఉంటాయి.


Click it and Unblock the Notifications











