K Ramp Twitter Review: K Ramp మూవీ ట్విట్టర్ రివ్యూ

ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌పై అభిరుచి గల నిర్మాత రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం K Ramp. యువ హీరో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్నారు. సీనియర్ నటులు వీకే నరేష్, కామా జెఠ్మలానీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి పండుగ కానుకగా ఈ మూవీ ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్దమైంది.

K ర్యాంప్ సినిమా ప్రమోషన్స్ పరంగా ఆకట్టుకొంటూ దూసుకుపోయింది. ప్రోమోలు, టీజర్, ట్రైలర్లకు భారీ స్పందన వచ్చింది. హీరో కిరణ్ అబ్బవరం, వీకే నరేష్ చేసిన ప్రమోషన్స్ బాగా వర్కవుట్ కావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా బ్రహ్మ కడలి, యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పృథ్వీ, ఎడిటర్‌గా ఛోటా కె ప్రసాద్, సినిమాటోగ్రాఫర్‌గా సతీష్ రెడ్డి మాసం, మ్యూజిక్ డైరెక్టర్‌గా చేతన్ భరద్వాజ్ బాధ్యతలను నిర్వహించారు. ఈ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్, ప్రేక్షకులు ఎలాంటి అభిప్రాయాలను, రివ్యూలను పోస్ట్ చేశారంటే..

K Ramp Twitter Review

KRamp సినిమా చూశాను.దీపావళీ పండుగ సమయంలో ఫన్ ఎలిమెంట్స్‌తో కూడిన సినిమా ఇది. కిరణ్ అబ్బవరం కామెడీ టైమింగ్ బాగుంది. ఆయన వన్ మ్యాన్ షో చూస్తాం. మాస్ ఆడియెన్స్‌కు ఐ ఫీస్ట్. దర్శకుడు కొత్తవాడైనా సెకండాఫ్‌ను బాగా ప్రజెంట్ చేశాడు. ఈ సినిమాకు డైలాగ్స్ బిగ్గెస్ట్ అసెట్. చైతన్ భరద్వాజ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

K ర్యాంప్ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్. వేగంగా సాగే స్క్రీన్ ప్లేతో ఫస్టాఫ్ ఎంగేజింగ్‌గా ఉంటుంది. కాలేజీ ఎపిసోడ్స్ బాగా చిత్రీకరించారు. ఎగ్జామ్ ఎపిసోడ్, రెడ్ షీట్ ఎపిసోడ్స్ హైలెట్. ఇంటర్వెల్ బ్లాక్ టెర్రిఫిక్. సెకండాఫ్‌ల నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది. ముఖ్యంగా హాస్పిటల్ సీన్ బాగుంటుంది. వెన్నెలకిషోర్, నరేష్ కాంబినేషన్‌లో వచ్చే సీన్లు అదిరిపోయాయి. ఎమోషనల్ కనెక్ట్ బాగుంది అని నెటిజన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

కే ర్యాంప్ సినిమా చూశాను. సెకండాఫ్ చాలా బాగుంది. డిజార్డర్‌తో కూడిన క్యారెక్టరైజన్ సీన్లలో కామెడీ ఫుల్లుగా వర్కువుట్ అయింది. కుమార్ అబ్బవరం తన పెర్ఫార్మెన్స్‌తో మనసు దోచుకొంటాడు. ఫాదర్ సెంటిమెంట్ సీన్లలో బాగా నటించాడు. క్లైమాక్స్ జస్ట్ గుడ్. ఓవరాల్‌గా డీసెంట్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాకు నా రేటింగ్ 2.5/5 అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

కే ర్యాంప్ ఓవర్సీస్ టాక్. కిరణ్ అబ్బవరం ఎనర్జీ, టైమింగ్ వర్క్‌డ్ అవుట్. యూకే, యూఎస్ఏ ఆడియెన్స్ ప్రతీ సీన్‌కు ఎంజాయ్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరంకు కంగ్రాట్స్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

కే ర్యాంప్ సినిమా ఫస్టాఫ్ ముగిసింది. కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. క్లాస్ రూమ్, ఎగ్జామ్ ఎపిసోడ్స్ బాగున్నాయి. కొన్ని సీన్లు వర్కవుట్ కాలేదు. సాంగ్స్ ఓకే. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఫస్టాఫ్ బాగుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

కే ర్యాపం్ సినిమా ఫస్టాఫ్ ఎక్సలెంట్, ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. హిలేరియస్ కామెడీతో సాగుతుంది. సెకండాఫ్‌లో ఫన్ మాత్రమే కాకుండా ఎమోషనల్ సీన్లు వర్కువట్ అయ్యాయి అని నెటిజన్ కామెంట్ చేశాడు. హీరో ఎంట్రీ, ఎనర్జీ బాగుంది. లీడ్ పెయిర్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. రేసీ స్క్రీన్ ప్లే, ఎగ్జామ్ ఎపిసోడ్ బాగుంది. రెడ్ షర్ట్ ఫైట్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. వన్ లైనర్స్ వర్కవుట్ అయ్యాయి. పాటలు ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. ఓవరాల్‌గా సినిమా బాగుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

కే ర్యాంప్ సినిమా ఇన్‌సైడ్ రిపోర్ట్:
ఫస్టాఫ్ చాలా బాగుంది. ఇంటర్వెల్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ హిలేరియస్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో మంచి సామాజిక సందేశంతో కూడిన ముగింపు ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్ రోల్ బాగా రాశారు. నరేష్, వెన్నెల కిషోర్ ట్రాక్ చాలా బాగుంటుంది అని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

More from Filmibeat

Read more about: kiran abbavaram vk naresh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X