KA Movie Review: క తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు
రచన, దర్శకత్వం: సుజీత్, సందీప్
సహ నిర్మాతలు: చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి
నిర్మాత: చింతా గోపాలకృష్ణ రెడ్డి
ఎడిటర్: శ్రీ వరప్రసాద్
సినిమాటోగ్రఫి: విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్: సామ్ సీఎస్
సీఈవో: రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)
కాస్ట్యూమ్స్: అనూష పుంజ్ల
మేకప్: కొవ్వాడ రామకృష్ణ
ఫైట్స్: రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్
కొరియోగ్రఫీ: పొలాకి విజయ్
రిలీజ్ డేట్: 2024-10-31
అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనాథ రక్షక నిలయంలో పెరిగిన ఓ అనాథ. తాను అనాథ అయినప్పటికీ.. ఓ తల్లి కడుపున పుట్టాను కాబట్టి.. తనకు తల్లి ఎవరో ఉంటారని అన్వేషిస్తుంటాడు. ఆ క్రమంలో తన టీచర్‌ను ఎదురించి అతడి డబ్బుతో స్కూల్ నుంచి పారిపోయి కృష్ణగిరి అనే గ్రామానికి చేరుతాడు. అక్కడ పోస్ట్‌మ్యాన్‌గా ఉద్యోగంలో చేరడంతోపాటు పోస్ట్ మాస్టర్ కూతురు (నయన్ సారిక)తో ప్రేమలో పడుతాడు. ఈ నేపథ్యంలో ఆ గ్రామం నుంచి యువతులు అదృశ్యం అవుతుంటారు. రాధ అనే టీచర్ కోసం ఓ హత్య కేసులో ఇరుక్కొంటాడు.

టీచర్ డబ్బు కొట్టేసి వాసుదేవ్ ఎందుకు పారిపోయాడు? కృష్ణ గిరికి వెళ్లి ఎందుకు పోస్టు మ్యాన్ ఉద్యోగంలో చేరాడు? ఇతరుల ఉత్తరాలు చదవే ఆయనకు తెలిసిన ఓ విషయం అతడిని హత్య కేసులో ఇరికించేలా చేసింది? రాధ కోసం వాసుదేవ్ ఎందుకు అంతగా తెగించాడు? తాను డబ్బు దొంగిలించడంతో టీచర్‌కు జీవితంలో ఎలాంటి నష్టం జరిగింది? టీచర్‌కు జరిగిన అన్యాయానికి వాసుదేవ్ ఎలా రుణం తీర్చుకొన్నాడనేది సినిమా కథ.
వాసుదేవ్‌ను కృష్ణగిరిలోని ఓ గదిలో బంధించి నిజాలు కక్కించే ప్రయత్నాన్ని అజ్ఞాత వ్యక్తి చేస్తుంటాడు. వాసుదేవ్ ఎందుకు తన గతాన్ని మరిచిపోతాడు? గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి అపరిచిత వ్యక్తి చేసిన ప్రయత్నాలు ఏమిటి? తన గతం గుర్తుకు వచ్చిన తర్వాత వాసుదేవ్ జీవితంలో ఏం జరిగింది? తన గ్రామమే తన జీవితం అనుకొన్న సమయంలో ఆ ఊరి కోసం వాసుదేవ్ ఎలాంటి తెగింపు చేశాడు? ఆ గ్రామంలో అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారణం ఏమిటి? తన టీచర్‌కు తన రుణాన్ని ఎలా తీర్చుకొన్నాడు? అసలు క అంటే ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా కథ.
గతం మరిచిపోయిన వాసుదేవ్‌ను బంధించి వాస్తవాలు తెలుసుకొంటున్న అజ్ఞాతవాసి ఎపిసోడ్‌తో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్, స్క్రీన్ ప్లేతో పాత్రలను పరిచయం చేస్తూ మూవీని నడిపించిన విధానం బాగుంది. ఇంటర్వెల్‌లో భారీ ట్విస్ట్‌తో కథను మలుపు తిప్పిన తీరు వారి ప్రతిభకు అద్దం పట్టింది. సెకండాఫ్‌లో పూర్తి స్థాయి కథను వివరించిన విధానం.. అలాగే క్లైమాక్స్‌ను గుండెను పిండేసేలా ముగించి తీరు సినిమా ఫీల్‌గుడ్‌గా మార్చింది.
కిరణ్ అబ్బవరం ప్రతీ సినిమాకు ఓ కొత్తదనంతో రావాలనే ప్రయత్నం కనిపిస్తుంటుంది. ఈ సినిమాలో కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎత్తుకొని .. తన పాత్ర చుట్టూ కథను అల్లుకొన్న స్టయిల్ బాగుంది. పాత్ర కోసం తన రూపాన్ని మార్చుకొన్న తీరు ఇవన్నీ సినిమాకు ప్లస్ అయింది. సెకండాఫ్‌లో కిరణ్ ఫెర్ఫార్మెన్స్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇక రాధగా తన్వీ రామ్ ఎమోషన్స్‌ను పండిస్తే, నయన్ సారిక పాత్రలు సినిమాకు గ్లామర్ తెచ్చిపెట్టాయి. అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్ స్లే, శరణ్య, అజయ్, బలగం జయరామ్ గుర్తుండిపోయే పాత్రలతో మెప్పించారు.
క సినిమాకు సాంకేతిక అంశాలు బలంగా నిలిచాయి. కథ, కథనం, సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ తన సత్తాను చూపించాడు. పలు సన్నివేశాలను హై రేంజ్‌లో ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫి, ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. చింతా గోపాలకృష్ణ రెడ్డి
అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
క మూవీ మదర్, సిస్టర్ సెంటిమెంట్‌తో సాగే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. కిరణ్ అబ్బవరం, దర్శకులు సుజిత్, సందీప్ పనితీరు ఈ సినిమాకు హైలెటె్. ఎమోషన్స్, వినోదం పూర్తిస్థాయిలో ఉన్న చిత్రాన్ని తప్పకుండా థియేటర్‌లో చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది. పండగ సీజన్‌లో ఫ్యామిలీ అంతా కలిసి చూసే భావోద్వేగమైన చిత్రం. డోంట్ మిస్.


Click it and Unblock the Notifications











