KA Movie Twitter Review: క మూవీ ట్విట్టర్ రివ్యూ.. కిరణ్ అబ్బవరం హిట్టు కొట్టాడా?
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క (KA). నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను రూపొందించారు. దీపావళీ కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.
క (KA) సినిమా ప్రమోషన్స్ భారీగా ఆదరణ దక్కడంతో ఈ మూవీ ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్లు ప్రదర్శిస్తున్నారు. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీగా స్క్రీనింగ్ చేస్తున్నారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు.

క మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రిలీజైన నాగచైతన్య అక్కినేని మాట్లాడుతూ.. కిరణ్ అబ్బవరం జర్నీకి నేను నెంబర్ వన్ ఫ్యాన్ ను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో మంచి ప్రొటెక్షన్ తో వచ్చాను. తనకు ఎవరి సపోర్ట్ లేదు. స్వతహాగా ఎదిగాడు. కిరణ్ సక్సెస్ స్టోరీ నాకు ఇన్సిపిరేషన్ గా నిలుస్తుంది. ఇండస్ట్రీకి వచ్చే ఎంతోమందికి కిరణ్ స్ఫూర్తిగా నిలుస్తారు. ఇలాంటి హీరోస్ సక్సెస్ కావాలి. నేను "క" సినిమా ట్రైలర్ చూశాను. బాగా నచ్చింది. కిరణ్ ఫోన్ చేసి ప్రి రిలీజ్ కు గెస్ట్ గా రావాలని పిల్చినప్పుడు హ్యాపీగా ఫీలయ్యా. ఇలాంటి మంచి మూవీ ప్రమోషన్ లో భాగమవడం సంతోషంగా ఉంది అని అన్నారు.
క (KA) మూవీ ప్రీమియర్లకు భారీ రెస్పాన్స్ వస్తున్నది. బుక్ మై షోలో ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి. దాంతో ఈ సినిమాపై ప్రత్యేకంగా బజ్ కనిపిస్తున్నది. ఈ సినిమాపై నెటిజన్లు, సినీ ప్రముఖులు వెల్లడిస్తున్న అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

క మూవీ ఎంగేజింగ్ థ్రిల్లర్. ఈ సినిమాకు మ్యూజిక్ బిగ్గెస్ట్ అసెట్. హీరో వాసుదేవ్ పాత్రలో కిరణ్ అబ్బవరంను డిఫరెంట్‌గా చూస్తారు. ఫస్టాఫ్‌లో ఇంట్రడక్షన్ సీన్, మంచి పాటలు, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నాయి. సెకండాఫ్‌లో యాక్షన్ ఎపిసోడ్స్, జాతర సాంగ్, క్లైమాక్స్ ఎడ్ల బండి ఎపిసోడ్ బాగున్నాయి. ఈ సినిమా ఓవరాల్‌గా బ్లాక్ బస్టర్ అటెంప్ట్ అని చెప్పవచ్చు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
క మూవీ కోసం రాసిన స్టోరీలైన్‌ను విషయంలో డైరెక్టర్‌ను మెచ్చుకోవాల్సిందే. సింపుల్‌గా ఫస్టాఫ్ సాగిపోతూ ఇంటర్వెల్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్‌తో ఆశ్చర్యపోతారు. సెకండాఫ్ ఎంగేజింగ్‌గా ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్బ్‌గా ఉంది. మ్యూజిక్ సినిమాకు పాజిటివ్‌గా మారిన అంశాల్లో ఒకటి. ట్విస్టులు, మంచి నేరేషన్‌తో థ్రిల్ చేసే క ను తప్పకుండా చూడాలి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
క మూవీ క్లైమాక్స్ సూపర్‌గా ఉంది. సినిమాలో ట్విస్ట్ ఎవరూ కూడా గెస్ చేయలేరు. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం బ్యాక్ వచ్చాడు. ఆయన కెరీర్‌లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా ఆయన జర్నీలో బెస్ట్ సినిమా. సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మూవీ కాన్సెప్ట్ బాగుంది. డైరెక్టర్లు సుజిత్, సందీప్ మంచి కథతో సినిమాను అందించారు. క్లైమాక్స్ తీసిన విధానం మైండ్ పోతుంది అని నెటిజన్ అన్నాడు.
క మూవీ ఫస్టాఫ్ గ్రిప్పింగ్‌గా ఉంది. అభినయ వాసుదేవగా కిరణ్ అబ్బవరంపై ఒపెనింగ్స్ సీన్ అదిరిపోయింది. మెమొరీ లాస్, మిస్టరీ పాయింట్‌తో ఆసక్తిని కలిగించాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. బీజీఎం గ్రేట్‌గా ుంది. కామెడీ డీసెంట్‌గా ఉంది. ఎంగేజ్‌మెంట్ బాగుంది. సినిమాటోగ్రఫి సూపర్బ్. విజువల్స్ టాప్ లెవెల్‌లో ఉన్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు రానటువంటి క్లైమాక్స్‌ను క మూవీలో చూడొచ్చు. స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ ఇంకా పండి ఉండాల్సిందనిపిస్తుంది. కిరణ్ అబ్బవరం కొత్తగా, డిఫరెంట్‌గా సినిమాను అందించాడు అని చెప్పవచ్చు. ఇది మంచి అటెంప్టెతో వచ్చిన సినిమా అని నెటిజన్ అన్నాడు.
క మూవీ గురించి, కిరణ్ అబ్బవరం గురించి విశ్వక్ సేన్ ఎమోషనల్ ట్వీట్ వేశారు. ఎదిగే హక్కు ప్రతీ ఒక్కడికి ఉంది. నా సోదరుడు కిరణ్ అబ్బవరం పూర్తిగా శక్తి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. #KA మూవీ గ్రాండ్ రిలీజ్ అవుతున్నందన ఆల్ ది బెస్ట్. అందరికి నా అబినందనలు అంటూ విశ్వక్ సేన్ ట్వీట్ చేశారు.
#KA టీమ్‌కు, దీపావళీ రోజున రిలీజవుతున్న అన్ని సినిమాలకు నా బెస్ట్ విషెస్. ఆన్ స్క్రీన్‌పై ఈ సినిమాలు మంచి అనుభూతిని క్రియేట్ చేస్తాయని భావిస్తున్నాను. కిరణ్ అబ్బవరం, దుల్కర్‌కు నా అభినందనలు అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.
క మూవీ రిలీజ్ సందర్భంగా అభిమాని ఒకరు ట్వీట్ చేస్తూ.. కిరణ్ అబ్బవరం అన్నా.. ఆల్ ది బెస్ట్. మీకు మేమంతా ఉన్నాం. ఈ సినిమా ప్రీమియర్ షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ తరఫున బెస్ట్ విషెస్ అని అన్నారు.
టైటిల్ నుంచి ట్రైలర్ వరకు క మూవీ మంచి ఫీల్ కలిగిస్తున్నది. ఈ సినిమా ద్వారా కిరణ్ అబ్బవరం కమ్ బ్యాక్ అవుతారని భావిస్తున్నాం. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బౌన్స్ బ్యాక్ అవుతారనే నమ్మకం ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











