Kaalamega Karigindhi Movie Review: కాలమేగా కరిగింది మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార, అశ్వత్ తదితరులు
దర్శకత్వం: శింగర మోహన్
నిర్మాత: మరే శివశంకర్
సినిమాటోగ్రఫి: వినీతి పబ్బతి
మ్యూజిక్ డైరెక్టర్: గుడప్పన్
ఎడిటర్: యోగేష్
బ్యానర్: శింగర క్రియేటివ్ వర్క్స్
రిలీజ్ డేట్: 2025-03-21

పోరుమామిడి గ్రామంలోని పాఠశాలలో ఫణి, బిందు స్టూడెంట్. చిన్న వయసులోనే ఒకరిపట్ల మరొకరు ఆకర్షితులవుతారు. యుక్త వయసులో వారి ప్రేమ గాఢంగా మారిపోతుంది. ఒకరిని విడిచి మరొకరు క్షణం విడిచిపెట్టలేని ప్రేమికులుగా మారిపోతారు. వారి మధ్య ఎడబాటు వారికి క్షణం ఒక యుగంలా ఉంటుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిన ఇద్దరు బాల ప్రేమికులు ఎందుకు విడిపోయారు? వారి సుదీర్ఘమైన ఎడబాటుకు కారణం ఏమిటి? వారిద్దరిని విడదీసిన అంశం ఏమిటి? చివరకు వారు కలుసుకొన్నారా? వారిద్దరి స్వచ్ఛమైన ప్రేమకథకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు జవాబే ఈ సినిమా కథ.

Kaalamega Karigindhi Movie Review

దర్శకుడు శింగర మోహన్ రాసుకొన్న పాయింట్ కొత్తదేమీ కాదు. ప్రేమ కంటే ఆశయం గొప్పదనే పాయింట్ చుట్టూ స్కూల్ టీనేజ్ లవ్‌ను కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. కొన్ని సీన్లు ఫ్రెష్‌గా ఉండటం వల్ల పలు చోట్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ కనిపించాయి. పదే పదే రిపీట్ షాట్స్ వేయడం వల్ల కథలోని ఇంటెన్సిటీ తగ్గిందనే ఫీలింగ్ కలుగుతుంది.

అయితే కమర్షియల్ సినిమా ఫార్మాట్‌కు దూరంగా ఉండటం, కథకు కావాల్సిన ప్యాడింగ్ లేకపోవడం వల్ల ప్రేమ కథకు కావాల్సిన ఎమోషన్స్ మిస్ అయ్యాయనిపిస్తుంది. కలహాలు లేని ప్రేమ కథ కాబట్టి.. ఒకే నోట్‌లో మూవీ ట్రావెల్ కావడం వల్ల ఎక్కువగా భావోద్వేగాలు ఎలివేట్ కాకుండా మిస్ అయ్యాయనిపిస్తుంది. ఈ సినిమాలో విజువల్ బ్యూటీ ఉంది. కానీ ఆ స్ట్రెంగ్త్‌ను విపరీతమైన డైలాగ్ డ్రామా దెబ్బ తీసిందా? అనే అనుమానం కలుగుతుంది.

బాల్యంలో ఫణి బిందు క్యారెక్లర్లను అరవింద్, నోమిన తార పోషించారు. వారిద్దరూ తమ యాక్టింగ్ స్కిల్స్ కంటే.. సన్నివేశాల్లో వారి ప్రజెన్స్, అమాయకత్వం, నిజాయితీగా పాత్రలను పోషించిన విధానం ప్రేక్షకుడిని రెండుగంటలపాటు కూర్చుండేలా చేసిందని చెప్పాలి. ఫణిగా వినయ్ కుమార్ షో రన్నర్‌గా మంచి మార్కులే కొట్టేశాడు. ఇతర పాత్రల్లో కనిపించిన వారికి పెద్దగా పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేదనే చెప్పాలి.

కాలమేగా కరిగింది సినిమాకు అత్యంత బలంగా మారిన అంశాలు మ్యూజిక్, సినిమాటోగ్రఫి. చాలా సన్నివేశాలను మ్యూజిక్‌తో గుడప్పన్ బాగా ఎలివేట్ చేశారు. రిపీట్ సీన్లను కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మంచి ఫీల్ తెప్పించ గలిగిన ప్రతిభను షోకేస్ చేశారు. ఇక వినీతి పబ్బతి సినిమాటోగ్రఫి మరో స్పెషల్ ఎట్రాక్షన్. సీన్లను చాలా సహజత్వంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ విభాగానికి బోలెడంత పని ఉంది. యోగేష్
కనికరం చూపించకుండా చాలా సీన్లను లేపేసి ఉంటే సినిమా వేగం పెరిగి.. కాస్త నిడివి తగ్గి మూవీ మరింత ఫీల్‌గుడ్‌గా మారి ఉండేది. మరే శివశంకర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మంచి అభిరుచితో మూవీని అందించారు. ఎలాంటి అంచనాలు లేకుండా.. పోయేటిక్ లవ్ స్టోరీలను, స్వచ్చమైన తెలుగు డైలాగ్ డ్రామాన్ ఆదరించే వారికి ఈ మూవీ నచ్చడానికి అవకాశాలు చాలానే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X