Kaantha First Review: కాంత మూవీ ఫస్ట్ రివ్యూ

దక్షిణాదిలో స్టార్ హీరోలు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్లపై రూపొందుతున్న చిత్రం కాంత. తమిళ సినిమా పరిశ్రమంలో ఎంకే త్యాగరాజ భాగవతార్, ఎంజీఆర్, ఎంఆర్ రాధా లాంటి సినీ లెజెండ్స్ జీవితాలల్ో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రంలో దుల్కర్, సముద్రఖని, భాగ్యశ్రీ భోర్సే, రానా దగ్గుబాటి, రవీంద్ర విజయ్ తదితరులు నటిస్తున్నారు. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నవంబర్ 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు డానీ సాంచేజ్ లోపేజ్ సినిమాటోగ్రఫీని, జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, జాను చాంతర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి లీవెలీన్ ఆంథోని, గోన్సాల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులు, సభ్యులు వీక్షించారు. ఈ చిత్రానికి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది? ఈ సినిమా నిడివి ఎంత? వారు జారీ చేసిన సర్టిఫికెట్, ఇతర వివరాల్లోకి వెళితే..

Kaantha Review by Censor Board

కాంత చిత్రం కథ విషయానికి వస్తే.. ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా తెరకెక్కిందనే వార్తల నేపథ్యంలో కేసు నమోదైంది. అయితే ఈ కథ ఎవరి జీవితానికి సంబంధించింది కాదు. కేవలం ఫిక్షనల్ స్టోరి. కేసు వలన సినిమా రిలీజ్ ఆగిపోదు అని రానా దగ్గుబాటి వెల్లడించారు. అయితే ఈ మూవీ ట్రైలర్‌ను బట్టి కథ విషయానికి వస్తే.. ఓ హీరో, డైరెక్టర్, ఓ నిర్మాత, ఓ హీరోయిన్ మధ్య చోటు చేసుకొన్న సంఘటనలే అని స్పష్టమైంది.

ఇలాంటి వివాదాలు, ఊహాగానాల మధ్య కాంత చిత్రాన్ని సెన్సార్ బోర్డు అధికారులు రివ్యూ చేశారు. ఈ సినిమా టెక్నికల్‌గా బ్రిల్లియెంట్ ఉంది. దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ భోర్సే, రానా పోటీ పడి నటించారు. ఈ సినిమాకు బీజీఎం ప్లస్ పాయింట్, సినిమాటోగ్రఫి ఈ సినిమాను మరింత రిచ్‌గా మార్చింది. కమర్షియల్ వాల్యూస్‌తోపాటు పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అనే అభిప్రాయాన్ని సెన్సార్ ప్రతినిధులు వెల్లడించినట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

సినిమా బ్యాక్ డ్రాప్‌తో టిపికల్ సాగే పిరియాడిక్ మూవీ కాంత. బలమైన కథ, వేగంగా సాగే కథనం, మోడరన్ టెక్నాలజీతో విభిన్నమైన అనుభూతిని అందిస్తుందని విషయం సెన్సార్ రివ్యూ తర్వాత బయటకు వచ్చింది. అయితే ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు యూఏ 13+ (UA13+) సర్టిఫికెట్ జారీ చేశారు. అంటే ఈ సినిమాను 13 ఏళ్లు పైబడిన వారంతా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది అని సర్టిఫికెట్‌లో వెల్లడించారు.

ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్‌తో ఇంటెన్స్‌గా సాగుతుందనే చెప్పబడుతున్న ఈ చిత్రం నిడివిని అన్ని వర్గాలను దృష్టిలో పెట్టికొని పర్‌ఫెక్ట్‌గా కట్ చేశామని చిత్ర యూనిట్ చెప్పింది. ఈ సినిమా నిడివి 2.45 గంటలు అంటే.. 165 నిమిషాలు అని తెలిసింది. ఇక ఈ సినిమా గురించిన విశేషాలు, వివరాలు, ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X