Kaantha Critics Review: కాంత మూవీ క్రిటిక్స్ రివ్యూ

దక్షిణాదిలో స్టార్ హీరోలు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్లపై రూపొందుతున్న చిత్రం కాంత. తమిళ సినిమా పరిశ్రమంలో ఎంకే త్యాగరాజ భాగవతార్, ఎంజీఆర్, ఎంఆర్ రాధా లాంటి సినీ లెజెండ్స్ జీవితాలల్ో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రంలో దుల్కర్, సముద్రఖని, భాగ్యశ్రీ భోర్సే, రానా దగ్గుబాటి, రవీంద్ర విజయ్ తదితరులు నటిస్తున్నారు. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నవంబర్ 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు డానీ సాంచేజ్ లోపేజ్ సినిమాటోగ్రఫీని, జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, జాను చాంతర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి లీవెలీన్ ఆంథోని, గోన్సాల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు నవంబర్ 12వ తేదీన ప్రదర్శించారు. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో క్రిటిక్స్ వెల్లడించిన అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

Kaantha Review by Critics

కాంత సినిమా ఫస్టాఫ్‌లో ఎక్సలెంట్ డ్రామా ఉంది. సెకండాఫ్‌ అంతా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, డ్రామాతో ముందుకెళ్తుంది. 50 దశకంలో మద్రాస్ మూవీ ఇండస్ట్రీలో జరిగిన సంఘటనలతో కథ సాగుతుంది. దుల్కర్ సల్మాన్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. భాగ్యశ్రీ భోర్సే పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్ ఉంది. సముద్రఖని ఫెంటాస్టిక్. రానా దగ్గుబాటి ఎక్సలెంట్ యాక్టింగ్ ఉంది. టెక్నికల్2గా సుపీరియర్‌గా ఉంటుంది. సెల్వరాజ్ స్టోరి టెల్లింగ్‌లో మాస్టర్ అని ఈ సినిమా ద్వారా నిరూపించుకొన్నారు అని రమేష్ బాలా ట్వీట్ చేశారు.

కాంత సినిమా చూశాను. ఈ సినిమాలో దుల్కర్ పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంది. ఆయన యాక్టింగ్ చూసిన తర్వాత ఎంత అద్బుతమైన యాక్టర్ ఈయన అనిపించింది. ఈ సినిమాలోని నటనకు ఆయనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావాల్సిందే. ఆయనకు ఆ అర్హత ఉందనే ఫీలింగ్ కలిగింది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

కాంత సినిమా చూడటం జరిగింది. అద్బుతమైన పిరియాడిక్ డ్రామా, థ్రిల్లింగ్ మూమెంట్స్. ఎమోషన్స్‌ బాగున్నాయి. దుల్కర్ షో రన్నర్. ఈ సినిమాకు ఆయన నటన ఆత్మలాంటింది. ఆయన పవర్ ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశాడు. ఓ డిఫరెంట్ రోల్‌లో రానా దగ్గుబాటి సింపుల్, బ్రిల్లియంట్‌గా కనిపించారు. భాగ్యశ్రీ భోర్సే యాక్టింగ్ బ్రహ్మండంగా ఉంది అని ఓ క్రిటిక్ ట్వీట్ చేశాడు.

కాంత మూవీ ఓ మాస్టర్ పీస్. ఫస్టాఫ్‌లో క్యారెక్టర్ల మధ్య ఇగోలు, భావోద్వేగాలు, సంఘర్షణ సూపర్బ్‌గా ఉన్నాయి. సెకండాఫ్ చాలా అద్బుతంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కొనసాగుతుంది. దుల్కర్ సల్మాన్ ఎప్పటిలానే తన నటనతో నట చక్రవర్తి అనిపించుకొన్నాడు. సముద్రఖని తన పాత్రను అద్బుతంగా పండించాడు. భాగ్యశ్రీ భోర్సే తన రోల్‌లో ఒదిగిపోయారు అని మరో క్రిటిక్ ట్వీట్ చేశారు.

లెజెండరీ యాక్టర్ టీకే మహాదేవన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయాడు. తాను గొప్ప యాక్టర్ అని ఈ సినిమా ద్వారా మరోసారి నిరూపించుకొన్నారు. తన పాత్ర స్వాగ్‌ను, భావోద్వేగాలను తెరపైన పండించారు. లీడ్ యాక్టర్లందరూ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. క్లైమాక్స్‌ అదిరిపోయింది. హిచ్‌కాక్ తరహా ఇన్వెస్టిగేషన్‌తో సాగే రానా పాత్ర, భాగ్యశ్రీ క్యారెక్టర్లు సినిమాకు ప్రాణంగా నిలిచాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.


కాంత మూవీ చూశాను. దుల్కర్ సల్మాన్ ఎంచుకొనే స్క్రిప్టులు అమెజింగ్‌గా ఉంటాయి. దుల్కర్ నటించే సినిమాలో క్రియేటివిటి, ఎమోషన్, ఇంటెలిజెన్స్, రొమాన్స్ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. ఇంటెన్స్‌తో కూడిన క్యారెక్టర్లు, విభిన్నత, విలక్షణ అనేది ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని ఓ క్రిటిక్ కామెంట్ చేశాడు.

కాంత ఓ క్లాసిక్ సినిమా. దర్శకుడు సెల్వరాజ్ సెల్వమణి తరాలు గుర్తుంచుకొనే సినిమా తీశాడు. ఫస్టాఫ్‌లో గురు, శిష్యుల మధ్య ఇగోలు, గొడవలతో కొనసాగుతుంది. అలాగే హీరో, హీరోయిన్ల రొమాంటిక్ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. రానా ఇన్వెస్టిగేటర్ పాత్రలో ఆకట్టుకొన్నారు. ఈ సినిమా టీకే మహాదేవన్ జీవితంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి అని క్రిటిక్ తన రివ్యూను పంచుకొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X