Kaantha Twitter Review: కాంత ట్విట్టర్ రివ్యూ

స్పిరిట్ మీడియా, వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి, జామ్ వర్గీస్‌‌లు నిర్మించిన చిత్రం కాంత. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. కాంత చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సముద్రఖని, రానా దగ్గుబాటి, రవింద్ర విజయ్, నిళ్‌గల్ రవి, భగవతి పెరుమాళ్, బిజేష్ నగేష్‌లు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమిజ్ ప్రభ ఈ చిత్రానికి కథను అందించారు. లీవెల్లన్ అంటోనీ, గాన్‌సెల్వజ్‌లు ఎడిటింగ్.. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం.. జాను చంథర్ స్వరాలు సమకూర్చారు. డానీ సాన్‌చెజ్ లోపెజ్‌ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటుడిగా, నిర్మాతగా దుల్కర్ సల్మాన్ ఎదురు లేకుండా దూసుకెళ్తున్న నేపథ్యంలో కాంత చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, మలయాళ భాషల్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. బాలల దినోత్సవం కానుకగా నవంబర్ 14న కాంత చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు నవంబర్ 13వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రమఖుల అభిప్రాయాల్లోకి వెళితే...

Kaantha Twitter Review in Telugu  Will Dulquer Salmaan hits bulls eye

ఫస్టాఫ్ ఎక్సలెంట్‌గా ఉంది. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ ఇరగదీసేశాడు. హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్, రొమాన్స్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ హైలైట్ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

కాంత ఫస్టాఫ్ బ్లాస్ట్... దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే మధ్య రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది అని ఓ యూజర్ కాంప్లిమెంట్ ఇచ్చాడు.

ఫస్టాఫ్ ఇప్పుడే పూర్తయ్యింది. దుల్కర్ సల్మాన్ గేట్ పర్ఫార్మర్. ఫస్టాఫ్‌లో ప్రతి సీన్ చాలా బాగుంది ఎక్స్‌లెంట్ అని ఓ అభిమాని చెప్పాడు.

ఫస్టాఫ్ ఎంగేజింగ్‌గా చాలా బాగుంది. దుల్కర్ సల్మాన్ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుందని ముందే ఊహించినట్లుగా ఉంది. దుల్కర్, భాగ్యశ్రీల కెమెస్ట్రీ బాగుంది. ఇంటర్వెల్ అయితే అస్సలు ఊహించలేం. అని ఓ నెటిజన్ ఫస్టాఫ్ రివ్యూ ఇచ్చాడు.

స్క్రీన్‌పై దుల్కర్ సల్మాన్ ఆధిపత్యమే కనిపిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే తన పాత్రను అద్భుతంగా పోషించింది. టాప్ - క్లాస్ మేకింగ్, ఎమోషన్స్ బాగా వచ్చాయి. సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నానని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

కాంత ఫస్టాఫ్ ఔట్ స్టాండింగ్ అసలు.. దుల్కర్ సల్మాన్ షైనింగ్ కనిపిస్తుంది.. మరీ ముఖ్యంగా మిర్రర్ సీన్‌లో. భాగ్యశ్రీ బోర్సేను అద్భుతంగా ఆవిష్కరించారు. సముద్రఖని ఎప్పటిలాగే బరువైన పాత్రను పోషించారు. బలమైన కెమెస్ట్రీ, పదునైన డ్రామా. జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కర్ అద్భుతం అని ఓ అభిమాని చెప్పారు.

దుల్కర్ సల్మాన్, సముద్రఖని మధ్య టెన్షన్ సీన్లు బాగా కుదిరాయి. ఇద్దరూ మనల్ని పాత్రల్లో నిమగ్నం చేసేలా బలమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. భాగ్యశ్రీ బోర్సే తన పాత్రలో అద్భుతంగా నటించింది. ఓవరాల్‌గా.. కాంత మొదటి అర్థ భాగం మంచి వేగంతో, బలమైన ప్రదర్శనలతో, ఉత్కంఠభరితమైన అహంకారం చూపించే ఘర్షణతో ముందుకు సాగుతూ.. అద్భుతమైన ఇంటర్వెల్ హుక్‌తో ముగుస్తుంది. అని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.

ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. సముద్రఖని, దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సేల యాక్టింగ్ పీక్స్. సముద్రఖని క్యారెక్టర్‌తో కథ ప్రారంభమవుతుంది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సేలు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఇది నిజంగా ఒక సినిమాలోని సినిమా.. ప్రత్యేకమై మెటా సినిమా కాన్సెప్ట్. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. కొన్ని కామెడీ సన్నివేశాలు బాగా పేలి ప్రేక్షకుల్లో జోష్ తీసుకొస్తాయి. ఈ సినిమా పాతకాలపు వైబ్‌ని తీసుకొస్తుంది. బ్లాక్ అండ్ వైట్ టోన్‌లో చిత్రీకరించబడిన ఈ సినిమా పాత సినిమాల్లోని క్లాసిక్స్‌ని గుర్తుచేస్తుంది. భాగ్యశ్రీ బోర్సే తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. పనిమలారే పాట అద్భుతంగా ఉంది. డ్యాన్స్ కూడా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించలేరు. ఫస్టాఫ్ సాలీడ్, పవర్‌ఫుల్ సీన్స్‌తో ముగుస్తుంది. తర్వాత ఏం జరుగుతుందోనని ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. అని ఓ నెటిజన్ రివ్యూ రాసుకొచ్చాడు.

కాంతా సెకండాఫ్ టెన్షన్‌గా, అద్భుతమైన ప్రదర్శనలతో నిండిపోయింది. రానా దగ్గుపాటి పాత్ర పీక్స్‌లో ఉంది. ప్రతి సన్నివేశం పవర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. కథ చెప్పడం బాగుంది. దుల్కర్ సల్మాన్ నటన ఫస్టాఫ్‌ను మించి ఉంది. ఆయన అన్ని అవార్డులకు అర్హుడు. ఫైనల్‌గా బొమ్మ బ్లాక్‌బస్టర్ అని ఓ ట్విట్టర్ యూజర్ తెలిపారు.

కాంత రివ్యూ: ఉత్కంఠభరితమైన థ్రిల్లింగ్ డ్రామా.. దుల్కర్ సల్మాన్ ఓ స్టార్‌లా మెరిసిపోయాడు. సహాయక నటులు ఈ చిత్రానికి ప్రాణం. స్క్రీన్ ప్లేను అద్భుతంగా నడిపించారు. విజువల్స్, బీజీఎం బాగున్నాయి. దీనికి నా రేటింగ్ 4/5. అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు.

దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్‌కు బెంచ్‌మార్క్ అనదగ్గ అరంగేట్రం. సాంకేతిక అంశాల నుంచి బ్లాక్ అండ్ వైట్ అంశాలను ఏ నిష్పత్తిలో వాడాలో తెలివిగా వ్యవహరించాడు. నటీనటుల విషయానికి వస్తే.. భాగ్యశ్రీ బోర్సే తనకు ఇచ్చిన పాత్రలో అద్భుతంగా నటించింది. రానా దగ్గుబాటి కూడా తన విచిత్రమైన పోలీస్ ఆఫీసర్ పాత్రతో రాణించాడు. నటుడు, నిర్మాత దుల్కర్ సల్మాన్ ఈసారి A గేమ్ తీసుకొచ్చాడు. అందరూ వెళ్లండి అని ఓ ట్విట్టర్ యూజర్ రివ్యూ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X