ప్రేమ కబడ్డీ కబడ్డీ..

By Staff

Kabaddi Kabaddi
-జలపతి
చిత్రం: కబడ్డీకబడ్డీ
నటీనటులు: జగపతిబాబు, కళ్యాణి, జీవా, కృష్ణభగవాన్‌
సంగీతం: చక్రి
నిర్మాత: వల్లూరిపల్లి రమేష్‌
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: వెంకీ

టీనేజ్‌ ప్రేమకథల నుంచి కొద్దిగా రిలీఫ్‌ నిచ్చే ప్రేమకథ చిత్రం ఇది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఫర్వాలేదనిపిస్తుంది. లగాన్‌ చిత్ర కథనుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన ఈ చిత్రం మ్యూజికల్‌ రోమాంటిక్‌ చిత్రం. కళ్యాణి అందం, కామెడీ, పాటలు ఈ సినిమాకు ప్రాణం. కోనసీమ నేపథ్యంలో గతంలో వచ్చిన చిత్రాలతో పోల్చితే..ఈ చిత్రం ఓ మోస్తారుగానే కన్పించినా..ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం మాదిరిగా ఏ ఇబ్బంది లేకుండా చూడవచ్చు. కామెడీలో ఇంకా పంచ్‌ ఉంటే బాగుండేది.

జగపతిబాబు పనీపాటా లేకుండా తిరుగుతాడు. ఒక రోజు రాజోలు వెళుతుండగా బస్‌ లో కళ్యాణిని చూస్తాడు. మనసు పారేసుకుంటాడు. ఆ అమ్మాయిని ప్రసన్నం చేసుకొని ప్రేమను వ్యక్తపరుస్తాడు. వీరి ప్రేమకు కళ్యాణి బ్రదర్‌ అడ్డు. ఆయనకు కబడ్డీ పిచ్చి. కళ్యాణిని ఆ ప్రాంతంలో ఉన్న కబడ్డీ ఛాంపియన్‌ కు ఇచ్చి పెళ్ళి చేయాలని అనుకుంటాడు.

జగపతిబాబు కళ్యాణిని నిజంగా ప్రేమిస్తే...ఆమెను పెళ్ళి చేసుకోవాలంటే...ఛాంపియన్‌ జట్టుపై నెలరోజుల్లోగా కబడ్డీ ఆడి గెలవాలని ఛాలెంజ్‌ వేస్తాడు. సో..మన హీరో లగాన్‌ టైప్‌ లో ఊళ్ళో ఉన్న పేకాటరాయుళ్ళు, దొంగకోళ్ళు పట్టుకునేవాడు, టీబడ్డీ షాప్‌ వాడు..తో టీం తయారు చేస్తాడు. అమీర్‌ ఖాన్‌ లాగా క్లైమాక్స్‌ లో గెలిచి కళ్యాణిని పొందుతాడు.

కళ్యాణి అందం, కోనసీమ నేపథ్యం, చక్రి వినసొంపైన సంగీతం వల్ల సినిమా ఆకట్టుకుంటుంది. అయితే, చక్రి నేపథ్య సంగీతం మాటిమాటికీ చికాకు పరుస్తుంటుంది. చక్రి రీరికార్డింగ్‌ చేయడం అర్జెంట్‌ గా నేర్చుకోవాలి. జగపతిబాబు, కళ్యాణిలు చక్కగా చేసినా..కృష్ణభగవాన్‌, జీవాల నటనే అందర్నీ ఆకట్టుకుంటుంది. కొత్త దర్శకుడు వెంకీ పనితనం ఫర్వాలేదనే చెప్పాలి. భూపతి ఫోటోగ్రఫీ ఓకే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X