Kabzaa movie Review పిరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఎలా ఉందంటే? ఉపేంద్ర ఎలా చేశారంటే?

నటీనటులు: ఉపేంద్ర, శ్రీయ సరన్, కిచ్చ సుదీప్, శివ రాజ్ కుమార్, మురళీ శర్మ, దేవ్ గిల్, సుధ, కబీర్ ఖాన్ తదితరులు
రచన, దర్శకత్వం: ఆర్ చంద్రూ
నిర్మాతలు: ఆనంద్ పండిట్, ఆర్ చంద్రూ, అలంకార్ పాండ్యన్
సినిమాటోగ్రఫి: ఏజే శెట్టి
ఎడిటింగ్: మహేష్ ఎస్ రెడ్డి
మ్యూజిక్: రవి బ్రసూర్
బ్యానర్: ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్, శ్రీ సిద్దేశ్వర ఎంటర్‌ప్రైజెస్, ఎవెనియో ఆరిజిన్
రిలీజ్ డేట్: 2023-03-17

కబ్జ కథ ఏమిటంటే?

కబ్జ కథ ఏమిటంటే?


స్వతంత్ర సమరయోధుడు అమరేశ్వర కుమారుడైన అరకేశ్వర అలియాస్ ఆర్కా (ఉపేందర్) ఎయిర్‌ ఫోర్స్ ఆఫీసర్. అమ్రాపుర రాజ సంస్థానం పాలకుడు వీర్ బహద్దూర్ (మురళీ శర్మ) కుమార్తె మధుమతి (శ్రీయా సరన్) ప్రేమలో ఉంటాడు. పెళ్లి చేసుకొందామనేకునే సమయంలో కొన్ని పరిస్థితుల వల్ల రౌడీగా, మాఫియా డాన్‌గా మారుతాడు.

కబ్జ కథలో ట్విస్టులు

కబ్జ కథలో ట్విస్టులు


ఉత్తర భారతం నుంచి తల్లి తులసి దేవీ (సుధ) తన కుమారులు అరకేశ్వర, సంకేశ్వరను తీసుకొని ఎందుకు పారిపోయి దక్షిణాదికి వస్తుంది. దేశభక్తుడైన ఆర్కా తండ్రి ఎలా మరణించాడు? ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా పనిచేసే ఆర్కా ఎందుకు రౌడీగా మారాడు? వీర్ బహద్దూరు నేతృత్వంలోని రాజరిక వ్యవస్థకు రాజకీయ నాయకులకు ఎందుకు వైరం ఉంటుంది? రాజరిక వ్యవస్థ నుంచి వీర్ బహద్దూర్ ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకొంటాడు? మాఫియా డాన్‌గా మారిన ఆరకేశ్వర ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? జైలు నుంచి మాఫియాను ఎలా ఎదుర్కొన్నాడు? మాఫియా చేతిలో బంధింపబడిన మధుమతి జీవితం ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే కబ్జ సినిమా కథ.

కబ్జ కథ ఎలా సాగిందంటే?

కబ్జ కథ ఎలా సాగిందంటే?


పోలీస్ ఆఫీసర్ భార్గవ్ భక్షి (సుదీప్ కిచ్చ) కథ చెప్పడం ద్వారా కబ్జ ఆసక్తికరంగా మొదలవుతుంది. స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన తులసి.. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆర్కా, సంకేశ్వరను తీసుకొని పారిపోయి రావడమనే పాయింట్‌తో కథ ఎమోషనల్‌గా మారుతుంది. ఆ తర్వాత అరకేశ్వర, మధుమతి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కథను సరైన దారిలోనే వెళ్తున్నాయనిపిస్తుంది. కానీ మురళీ శర్మ, ఖాలీద్ (డానిష్ అఖ్తర్) మధ్య వార్ కథను కంగాళీగా మార్చేస్తుంది. కథ గాడి తప్పడంతోపాటు అనవసరపు హంగామా సినిమాను మరింత దిగజార్చిందనే ఫీలింగ్ కలుగుతుంది. అవవసరం లేని చోట బిల్డప్ షాట్స్ గాడి తప్పేలా చేసింది. ప్రతీ ఫ్రేమ్‌లోను కేజీఎఫ్ ప్రభావం కనిపిస్తుంది.

కబ్జ దర్శకుడి గురించి

కబ్జ దర్శకుడి గురించి


దర్శకుడు చందూ రాసుకొన్న మెయిన్ పాయింట్ ఎమోషనల్‌గా కనిపిస్తుంది. కానీ కథను విస్తరించడంలో అత్యుత్సాహం, మితిమీరిన కమర్షియల్ పాయింట్స్‌తో సినిమా హద్దులు దాటేలా చేసిందనిపిస్తుంది. పాత్రల తీరుతెన్నులు కూడా సరిగా కనిపించవు. ఇంట్రెవల్ బ్యాంగ్‌కు ఓ విలన్ గురించి ఫుల్ బిల్డప్ ఇస్తారు. కానీ కాసేపటికే ఆ పాత్రను ఖతం చేసి తుస్పుమనిపించడంలో దర్శకుడి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

ఉపేంద్ర, శ్రీయ సరన్ ఫెర్ఫార్మెన్స్

ఉపేంద్ర, శ్రీయ సరన్ ఫెర్ఫార్మెన్స్


ఇక నటీనటులు విషయానికి వస్తే.. అరకేశ్వరగా ఉపేంద్ర విభిన్నంగా కనిపించాడు. కమర్షియల్, ఇతర అంశాలు సరిగా పండకపోవడం వల్ల ఆ పాత్ర బలంగా కనిపించదు. రకరకాల విషయాల వల్ల ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండే పాత్ర తేలిపోయినట్టు కనిపిస్తుంది. మధుమతిగా శ్రీయాసరన్ తన పాత్ర పరిధి మేరకు న్యాయం చేశారు. కొన్ని ఎమోషనల్ సీన్లలో భావోద్వేగమైన నటనను ప్రదర్శించేలా యాక్టింగ్ చేసిందని చెప్పవచ్చు. మురళీ శర్మ, దేవ్ గిల్, సుదీప్, నవాబ్ షా, ఇంకా మిగితా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

కబ్జ టెక్నికల్‌గా

కబ్జ టెక్నికల్‌గా

టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి కబ్జా సినిమాను మరింత రిచ్‌గా మార్చింది. కలర్ ప్యాలెట్, సీన్లలో ఉండే ఎమోషన్స్, బ్యాక్ డ్రాప్, ఆర్ట్ వర్క్‌ను బాగా ఎలివేట్ చేయడంలో సినిమాటోగ్రాఫర్ ఏజే శెట్టి సఫలమయ్యాడు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ కెమెరాపనితనం మరో హైలెట్. సినిమాను మరో రెంజ్‌కు తీసుకెళ్లేలా చేశారు. మహేష్ ఎస్ రెడ్డి ఎడిటింగ్‌ చేయాల్సిన పరిస్థితి ఇంకా ఉందని చెప్పవచ్చు. గ్రాఫిక్స్ చాలా చీప్‌గా ఉన్నాయి. నిర్మాతలు ఆనంద్ పండిట్, ఆర్ చందు, అలంకార్ పాండ్యన్ అనుసరించిన నిర్మాణ విలువలు హై క్లాస్‌లో ఉన్నాయి.

ఫైనల్‌గా ఎలా ఉందంటే?

ఫైనల్‌గా ఎలా ఉందంటే?


దేశభక్తి, పాలిటిక్స్, ఫ్యామిలీ బాండింగ్స్, లవ్, మాఫియా అంశాలు కలబోసిన లార్జ్ స్పాన్ ఉన్న కథ కబ్జ. కానీ ఎమోషన్స్ పండకపోవడం, కమర్షియల్ వ్యాల్యూస్ ప్రేక్షకుల అంచనాలకు దిగువన ఉండటం వల్ల కథ, కథనాలు తేలిపోయాయని చెప్పవచ్చు. నటీనటులు ఫెర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ వ్యాల్యూ టాప్ క్లాస్‌గా ఉన్నాయని చెప్పవచ్చు. కేజీఎఫ్ తరహా చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా కూడా నచ్చడానికి అవకాశం ఉంది. అంచనాల లేకుండా వెళితే.. ఈ సినిమా నచ్చే అవకాశం లేకపోలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X