KadakSingh Review ఆర్థిక కుంభకోణాల బ్యాక్ డ్రాప్‌తో..పంకజ్ త్రిపాఠి ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కడక్ సింగ్ సమీక్ష

Rating: 2.75/5

నటీనటులు: పంకజ్ త్రిపాఠి, పార్వతి తిరువోతు, సంజనా సాంఘీ, జయా ఆషన్ తదితరులు
దర్శకత్వం: అనిరుధ రాయ్ చౌదరీ
నిర్మాత: మహేష్ రామనాథన్, విరాఫ్ సర్కారీ
మ్యూజిక్: శంతను మొయిత్రా
సినిమాటోగ్రఫి: అవిక్ ముఖోపాధ్యాయ్
ఎడిటింగ్: ఆర్గా కమల్ మిత్రా
రిలీజ్ డేట్: 2023-12-08

ఏకే శ్రీవాస్తవ అలియాస్ కడక్ సింగ్ (పంకజ్ త్రిపాఠి) ఆర్థిక నేరాల డిపార్ట్‌మెంట్‌లో ఆఫీసర్. ఓ ఆర్థిక కుంభకోణంలో ఇరుక్కుపోయిన ఆయన సూసైడ్‌కు ప్రయత్నిస్తాడు. మృత్యువు నుంచి తప్పించుకొని.. గతం మరిచిపోయి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతుంటాడు. అయితే గతం మరిచిపోయినప్పటికి ఓ కొడుకు, భార్య ఉందనే విషయం గుర్తుకు ఉంటుంది. కూతురు సాక్షి (సంజనా సాంఘీ) వచ్చి గతాన్ని గుర్తుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. అయితే నాకు కూతురు ఉన్నట్టు గుర్తుకు లేదని ఆమెను ప్రశ్నిస్తాడు.

Kadak Singh Review and Rating: Pankaj Tripathi pulls off as Kadak Singh

ఆర్థిక కుంభకోణంలో ఇరుక్కుపోయిన తర్వాత ఏకే శ్రీవాస్తవ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? సూసైడ్‌కు ప్రయత్నించాడా? లేదా ఏదైనా హత్యా ప్రయత్నం ఆయనపై జరిగిందా? నిజంగానే గతాన్ని మరిచిపోయాడా? తన డిపార్ట్‌మెంట్‌లో ఇతర ఉద్యోగులు ఎందుకు ఉన్నట్టుండి చనిపోయారు? భార్యతో కడక్ సింగ్‌కు ఎందుకు విభేదాలు వచ్చాయి? అసలు ఏకే శ్రీవాస్తవకు కడక్ సింగ్ అనే పేరు ఎందుకు వచ్చింది? చివరకు ఆర్థిక కుంభకోణం నుంచి బయటపడ్డారా? అనే ప్రశ్నకు సమాధానమే కడక్ సింగ్ మూవీ కథ.

హస్పిటల్‌లో చేరిన కడక్ సింగ్‌కు కూతురు సాక్షి గతంలో జరిగిన సంఘటనలు చెప్పడం ద్వారా సినిమా కొంత ఇంట్రెస్టింగ్‌గా మొదలవుతుంది. అయితే సింగిల్ పేరెంట్‌గా కడక్ సింగ్ పిల్లల పట్ల చాలా కఠినంగా ఉండటమనే ఓ ఎమోషనల్ పాయింట్‌గా మారుతుంది. అయితే హాస్పిటల్‌లో కూతురు కడక్ సింగ్ జీవితం గురించి చెప్పే విషయాల్లో కోత్తగా అనిపించదు. రొటీన్ సీన్లుగా సాగిపోతాయి. అయితే కుంభకోణం గురించి ఇంట్రాగేషన్ మొదలైన తర్వాత కథలో వేగం పుంచుకొంటుంది. ఏకే శ్రీవాస్తవ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకొన్న కొన్ని అంశాలు సెంటిమెంట్‌ను క్రియేట్ చేశాయి. ఫ్యామిలీ డ్రామాలో కాన్ ఫ్లిక్ట్ ఇంకాస్త సీరియస్ ఉంటే బాగుండేదనిపిస్తుంది.

ఇక దర్శకుడు అనిరుధ్ రాయ్ చౌదరీ రాసుకొన్న కథ చూస్తే చాలా చిన్న పాయింట్. స్టోరీలో ఎమోషన్స్‌కు స్కోప్ ఉన్నప్పటికీ.. అటు క్రైమ్ డ్రామా, ఫ్యామిలీ డ్రామాకు మధ్య ఊగిసలాట కనిపిస్తుంది. కడక్ సింగ్ క్యారెక్టర్ చుట్టూ ఉన్న పాత్రలను కూడా బలంగా రాసుకోలేకోయాడనిపిస్తుంది. కానీ కొడుకు డ్రగ్స్‌కు అలవాటు కావడం, భార్యతో దూరంగా ఉండి మరో మహిళతో రిలేషన్ పెట్టుకోవడం లాంటి అంశాలు సినిమాలో కొంత ఎమోషనల్‌గా కనిపిస్తాయి. సూసైడ్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌ను దర్శకుడు బెటర్‌గా డీల్ చేశాడనిపిస్తుంది.

Kadak Singh Review and Rating: Pankaj Tripathi pulls off as Kadak Singh

ఇక నటీనటులు విషయానికి వస్తే.. ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో పంకజ్ త్రిపాఠి మరోసారి మంచి నటనను ప్రదర్శించాడు. సినిమా సెకండ్ హవర్‌లో తన పాత్ర ద్వారా వేరియేషన్స్ చూపించాడు. బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించాడు. కూతురు సాక్షిగా సంజనా సాంఘీ పర్వాలేదనిపించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి మిస్టర్ బేచారా సినిమా తర్వాత మరోసారి మంచి పాత్రలో కనిపించింది. మిస్ కన్నన్‌గా నర్సు పాత్రలో దూత ఫేమ్ పార్వతి తిరువోతు ఒకే అనిపించారు. పంకజ్, పార్వతి మధ్య సీన్లు బాగున్నాయి.మిగితా పాత్రల్లో కనిపించిన వారు ఫర్వాలేదనిపించారు.

ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ అంశాలతో రూపొందిన సినిమా కడక్ సింగ్. స్టోరీ లైన్ బాగుంది. కానీ ఎమోషన్స్ బలంగా లేకపోవడం వల్ల పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయిందనిపిస్తుంది. పంకజ్ త్రిపాఠి, పార్వతి, సంజనా ఫెర్ఫార్మెన్స్ కారణంగా సినిమా ఫీల్‌గుడ్‌గా అనిపిస్తుంది. అంచనాలు పెద్దగా పెట్టుకోకుండా చూస్తే కొన్ని చోట్ల మంచి అనుభూతితోపాటు టైంపాస్ మూవీ అనిపిస్తుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ లాంటి సినిమాలు ఇష్టపడేవారికి కడక్ సింగ్ నచ్చుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X