Kalamkaval Movie Review: కలాం కావల్ మలయాళ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

మూవీ: కలాం కావల్
నటీనటులు: మమ్ముట్టి, వినాయకన్, జిబిన్ గోపినాథ్, గాయత్రి అరుణ్, రజీషా విజయన్, శృతి రామచంద్రన్, మాళవిక మీనన్, ధన్య అనన్య తదితరులు
రచన, దర్శకత్వం: జితిన్ కే జోష్
నిర్మాత: మమ్ముట్టి కంపెనీ
సినిమాటోగ్రఫి: ఫైజల్ ఆలీ
ఎడిటింగ్: ప్రవీణ్ ప్రభాకర్
మ్యూజిక్: ముజీబ్ మజీద్
థియేట్రికల్ రిలీజ్: 2025-12-05
ఓటీటీ రిలీజ్: సోనీ లివ్
ఓటీటీ రిలీజ్ డేట్: 2026-01-16

పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసే స్టాన్లీ దాస్ (మమ్ముట్టి) గ్రామీణ మహిళలను ట్రాప్ చేసి వారితో తన కోరిక తీర్చుకొని నిర్ధాక్ష్యిణ్యంగా చంపేస్తుంటాడు. కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో వరుస హత్యలు సంచలనం రేపుతాయి. దాంతో ఈ కేసును దర్యాప్తు చేసేందుకు గుడ్లగూబ అనే ముద్దు పేరు ఉన్న పోలీస్ అధికారి జయకృష్ణన్ (జైలర్ ఫేమ్ వినాయకన్)కు అప్పగిస్తారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఉంటూనే స్టాన్లీ దాస్ మహిళలను అనుభవించి కూల్‌గా హత్య చేస్తుంటాడు.

స్టాన్లీ దాస్ ఒంటరి మహిళలను ఎందుకు చంపేస్తున్నాడు? ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించే స్టాన్లీ దాస్ ఎందుకు సీరియల్ కిల్లర్‌గా మారాడు? సీరియల్ కిల్లింగ్ కేసును జయకృష్ణన్ ఎలా దర్యాప్తు చేశాడు? కేసు దర్యాప్తు పసిగట్టి స్టాన్లీ దాస్ తన వ్యూహాలను ఎలా అమలు పరిచాడు? స్టాన్లీ దాస్ ఈ కేసు నుంచి తప్పించుకొనేందుకు ఎలాంటి ఎత్తులు వేశాడు? చివరకు స్టాన్లీ దాస్‌ను పోలీసులు ఎలా గుర్తించారు? చివరకు స్టాన్లీకి జయకృష్ణన్ ఎలాంటి శిక్షను విధించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

Kalamkaval Malayalam Movie Review

విభిన్నమైన కథ, విలక్షణ పాత్రలను పోషించడంలోను, తమ ఇమేజ్‌ను పట్టించుకోకుండా ఎలాంటి పాత్రలనైనా చేయడానికి మలయాళ నటులు ఎప్పుడూ ముందుంటామని నిరూపించిన చిత్రం కలాం కావల్. సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న మమ్ముట్టి ఇలాంటి కథను ఒకే చేసి.. ఆ పాత్రను పోషించడమే భారీ సక్సెస్. ఆ పాత్ర స్వభావాన్ని ఆకలింపు చేసుకొని.. చాలా కూల్‌గా సీరియల్ కిల్లర్ పాత్రను కూడా అభిమానించేంతగా పెర్ఫార్మెన్స్ చేయడం మమ్ముట్టికే చెల్లింది. ఇక స్టాన్లీ దాస్ మాత్రమే కనిపించేలా.. మమ్ముట్టి నటించడం ఈ సినిమాకు అత్యంత బలంగా మారిందని చెప్పవచ్చు.

కేరళ, తమిళనాడు సరిహద్దులో జరిగిన సైనెడ్ మోహన్ కేసులో వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని థదర్శకుడు జితిన్ జోష్ రాసుకొన్న కథ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. సెల్‌ఫోన్ టెక్నాలజీ అప్పుడప్పుడే ప్రజల్లోకి వస్తున్న సమయంలో కథ నడవడం, అప్పటి పరిస్థితులను హానెస్ట్‌గా చిత్రీకరించిన తీరు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. నటీనటుల పెర్ఫార్మెన్స్ చూస్తుంటే.. తెర మీద నుంచి చూపు తిప్పుకోలేని విధంగా ఈ సినిమా క్రేజీగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే, డైలాగ్స్, పాత్రల బిహేవియర్ అన్ని చక్కగా కుదిరాయి. ఎక్కడా ఆర్టిఫిషియల్‌గా లేకుండా నేచురల్‌గా ఉండటం వల్ల ఆడియన్ లీనమై చూసేలా చేస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే.. మమ్ముట్టి గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ తన పాపులారిటీని, స్టార్ ఇమేజ్‌ను కూడా పక్కన పెట్టి సీరియల్ కిల్లర్ పాత్రను చేయడం ఆయన గట్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. పాత్రలో జీవించిన విధానం, నెగిటివ్ పాత్రను కూడా ఇష్టపడే విధంగా నటించడం ఆయన ప్రతిభకు మచ్చు తునక. ఇక మమ్ముట్టితో పోటీ పడుతూ గుడ్లగూబ క్యారెక్టర్‌లో జయకృష్ణన్‌గా వినాయకన్ నటించాడు. ఈ కేసు దర్యాప్తును తెర మీద రియల్ పోలీస్‌గా మారి చేశాడా? అనిపిస్తుంది. రజీషా విజయన్ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. ఈ చిత్రంలో నటించిన వారంతా గుర్తుండిపోయేలా పెర్ఫార్మ్ చేశారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమా కంటెంట్‌ను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. ముజీబ్ మజీద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారిందని చెప్పవచ్చు. ఫైజల్ అలీ సినిమాటోగ్ఱఫి, ప్రవీణ్ ప్రభాకర్ ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. మమ్ముట్టి కంపెనీ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. తగినంత సమయాన్ని కేటాయించి ఈ సినిమాను ఒకేసారి చూసేయండి. మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ కలుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X