Kalamkaval Movie Twitter Review: కలాంకావల్ ట్విట్టర్ రివ్యూ

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నిర్మాతగా, తన మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం కలాంకావల్. జితిన్ కే జోస్ దర్శకత్వం వహించారు. మమ్ముట్టి, వినాయకన్, గిబిన్ గోపీనాథ్, రాజిషా విజయన్, గాయత్రి అరుణ్, శృతి రామచంద్రన్, బిజు పాప్పన్, ధన్య అనన్యలు కీలకపాత్రలు పోషించారు. జితిన్ జోస్, జిష్ణు శ్రీకుమార్‌లు కథను అందించారు. ఫైజల్ అలీ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రవీణ్ ప్రభాకర్ ఎడిటర్‌గా సేవలందించారు. ముజీవ్ మాజీద్ సంగీత దర్శకత్వం వహించారు.

సీబీఎఫ్‌సీ ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. మమ్ముట్టి లుక్, గెటప్, టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలాంకావల్ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. వరుస విజయాలతో మమ్ముట్టి ఫుల్ జోష్‌లో ఉండటతో కలాంకావల్ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. డిసెంబర్ 5వ తేదీన కలాంకావల్ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రమఖుల అభిప్రాయాల్లోకి వెళితే...

Kalamkaval Movie Twitter Review in Telugu  will Mammootty hits the bulls eye

కలాంకావల్ ఫస్టాఫ్ ఆసక్తికరంగా ఉంది. ముజీబ్ సంగీతం ఖచ్చితంగా ప్లస్. పాటల వేగం, రన్‌టైమ్ అద్భుతంగా పనిచేశాయి. ఇంటర్వెల్ బ్లాక్ అద్భుతం. వినాయకన్ x మమ్ముక్క. సెకండాఫ్ కోసం వెయిట్ చేస్తున్నా అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.

మమ్ముక్క పీక్ లెవల్ పర్ఫర్మాన్స్.. ఈ సినిమాతో ఆయన తొలిసారిగా 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం ఖాయం. ముఖ్యంగా మజీద్ బీజీఎం ఫైర్. తనను వీ- నాయకన్ అని ఎందుకంటారో వినాయకన్‌ ప్రూవ్ చేసుకున్నాడు. డైరెక్టర్ జితిన్ కెరీర్‌లో బెస్ట్ మూవీ.. ఈ ఏడాదిలో ఇది బెస్ట్ మూవీ. మమ్ముక్క పర్ఫార్మెన్స్ నుంచి బయటకు రాలేకపోతున్నానని ఓ అభిమాని రివ్యూ ఇచ్చాడు.

కథలో కథానాయకుడిని పరిచయం చేయడానికి జితిన్ కె జోస్ టైమ్ వేస్ట్ చేయడు. స్క్రీన్ ప్లేని సాగదీయకుండా క్యారెక్టర్‌ను డెవలప్‌ చేసుకుంటూ వెళ్లడం నాకు నచ్చింది. మమ్ముట్టి, వినాయకన్‌ల నటన అద్భుతం. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా వర్కవుట్ అయ్యింది. ఫస్టాఫ్ చాలా బాగుంది అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

కలాంకావల్ సూపర్బ్‌గా ఉంది. క్రైమ్, ఇన్వెస్టిగేషన్ డ్రామా. గ్రిప్పింగ్ నేరేషన్‌తో కథనాన్ని అద్భుతంగా రాశారు. మమ్ముట్టి, వినాయకన్ అద్భుతంగా నటించారు. క్లైమాక్స్ అయితే అద్భుతం. మాలీవుడ్ నుంచి మరో మంచి సినిమా అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

కలాంకావల్ సెకండాఫ్ రివ్యూ.. మంచి రచనతో చివరి వరకు మీ దృష్టిని నిలుపుకునే ఆసక్తికరమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. మమ్ముట్టి ఒక బ్రిలియంట్ విలన్‌గా అందరి దృష్టిని ఆకర్షించాడు. వినాయకన్ చాలా చక్కగా నటించాడు. క్లైమాక్స్‌లో అతని నటన అద్భుతంగా ఉంది. స్క్రీన్ ప్లే చాలా ఆకర్షణీయంగా ఉంది, మిమ్మల్ని కట్టిపడేసేలా థ్రిల్లింగ్‌ని కలిగిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా సపోర్ట్‌గా నిలిచింది.

దర్శకుడి నియంత్రణ.. మిమ్మల్ని కథలోకి బాగా తీసుకెళ్తుంది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎక్కడో చూసినట్లు అనిపించినా డైరెక్టర్ ప్రతిభ ఆ లోపాన్ని కనిపించనీయదు. మొత్తంగా కలాంకావల్ మంచి స్క్రీన్ ప్లే, థ్రిల్స్, ప్రదర్శనలతో కూడిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. మీకు ఇన్వెస్టిగేషన్ స్టోరీలు ఇష్టమైతే దీనిని ఖచ్చితంగా చూడొచ్చు. దీనికి నా రేటింగ్ 3.75/5 అంటూ ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.

కలాంకావల్.. మిమ్మల్ని సీటు అంచున నిలబెట్టే థ్రిల్లర్. మమ్ముట్టి మరో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. వినాయకన్ కొన్నిసార్లు కొంచెం గాడి తప్పినట్లుగా అనిపించగా.. అతను మమ్ముట్టితో స్క్రీన్‌ను షేర్ చేసుకున్నప్పుడు అతని నటన ఆశ్చర్యకరంగా మెరుగుపడుతూ వస్తుంది.

More from Filmibeat

Read more about: mammootty vinayakan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X