Kalinga Review: కళింగ సినిమా రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: ధ్రువ వాయు, ప్రగ్యా నయన్, ఆడుకాలమ్ నరేన్, లక్ష్మీణ్ మీసాల, తనికెళ్ల భరణి, మురళీధర్ గౌడ్, బలగం సుధాకర్ తదితరులు
దర్శకత్వం: ధ్రువ వాయు
నిర్మాతలు: దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్
మ్యూజిక్ డైరెక్టర్: విష్ణు శేఖర, అనంత నారాయణ్ ఏజీ
సినిమాటోగ్రఫి: అక్షయ్ రామ్ పొడిశెట్టి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: విష్ణు శేఖర
ఎడిటర్: నరేష్ వేణువంక
బ్యానర్: బిగ్‌హిట్ ప్రొడక్షన్స్, హానీ బ్యాడ్జర్
రిలీజ్ డేట్: 2024-09-13

కళింగ సంస్థానంలోని ఓ గ్రామ పొలిమేర దాటిన వ్యక్తులు ఎవరూ తిరిగి ఊర్లోకి రాని చరిత్ర ఉంటుంది. ఆ ఊరికి చెందిన లింగ (ధ్రువ వాయు) జలాయిగా తిరుగుతూ ఎలాంటి బాధ్యతలు లేకుండా మద్యం మత్తులో బతుకుంటాడు. పద్మావతి అలియాస్ పద్దు అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. లింగ కుటుంబానికి చెందిన భూమి ఆ గ్రామ పెద్ద (ఆడుకాలమ్ నరేన్) ఆధీనంలో ఉంటుంది. లింగకు వారి భూమికి బదులు సంస్థాన పొలిమేరలో భూమి కేటాయిస్తాడు. తన భూమి కోసం పొలిమేర దాటి వెళ్తాడు.

Kalinga Movie Review in Telugu  Dhruva Vaayu show is mark with Thriller elements

ఆ పొలిమేర దాటిన వారికి ప్రాణాలు ఎందుకు గాలిలో కలిసిపోతున్నాయి? కళింగ సామ్రాజ్యానికి చెందిన సంపద అక్కడే ఎందుకు పెట్టారు? ఆ సంపద కోసం ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి? పొలిమేర దాటిన లింగకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? సంస్థానంలోని సంపదను లింగ చేజిక్కించుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే కళింగ సినిమా కథ.

కళింగ సినిమా ఆరంభంలో హిరణ్య కశ్యపుడు, నరసింహ స్వామి ఎపిసోడ్‌తో మూవీ గ్రాండ్‌గా ఎలా ఉంటుందో చెప్పేందుకు చేసిన ప్రయత్నం బాగుంది. ఆ ఎపిసోడ్‌తో అంచనాల బార్‌ను భారీగా పెంచేశాడు. కానీ కథలో సన్నివేశాలను ఒక ఫ్లోగా చెప్పకుండా.. బిట్స్.. బిట్స్‌గా చెప్పడం వల్ల ఎమోషనల్ కనెక్టవిటీ మిస్ అయిందనే ఫీల్ కలుగుతుంది. కానీ ప్రతీ ఎపిసోడ్ దేనికదే బాగుంది.

దర్శకుడిగా, హీరోగా ధ్రువ వాయు సినిమా రూపొందించిన విధానం బాగుంది. యాక్టర్‌గా ఆకట్టుకొన్నాడు. అలాగే దర్శకుడిగా అతడి విజన్ ఎక్సలెంట్‌గా ఉంది. కానీ కథను పర్‌ఫెక్ట్‌గా చేసుకొని ఉంటే.. ఇలాంటి జోనర్‌లో ట్రెండ్ సెట్ చేసి ఉండేవాడేమో అనిపిస్తుంది. డైరెక్టర్, యాక్టర్‌గా తనకు తాను మంచి మార్కులు కొట్టేశారు.

ఈ మూవీలో నటించిన హీరోయిన్ ప్రగ్యా నయన్ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొన్నారనే చెప్పాలి. ఎమోషనల్, రొమాంటిక్ సీన్లలో ఫెర్ఫార్మెన్స్ బాగుంది. నరేన్, మీసాల లక్ష్మణ్, మురళీధర్ గౌడ్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

Kalinga Movie Review in Telugu  Dhruva Vaayu show is mark with Thriller elements

కళింగ సినిమా అత్యంత బలం సాంకేతిక అంశాలు. ముఖ్యంగా ఈ సినిమా లొకేషన్లు అద్బుతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని లొకేషన్లలో అద్బుతంగా చిత్రకీరించారు. అక్షయ్ రామ్ పొడిశెట్టి చిత్రీకరించిన సన్నివేశాలు చాలా రిచ్‌గా ఉన్నాయి. విష్ణు శేఖర్ అందించిన బీజీఎం సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేసింది. నరేష్ వేణువంక ఎడిటింగ్ సినిమాను పరుగులు పెట్టించింది. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.

హిస్టరీ, పురాణాల బ్యాక్ డ్రాప్‌తో ట్రెజర్ హంట్ నేపథ్యంగా సాగే థ్రిల్లర్ కళింగ. డైరెక్షన్, నటీనటుల పెర్ఫార్మెన్స్, టెక్నికల్ వ్యాల్యూస్ ఈ సినిమాకు పాజిటివ్. ఓ మంచి పాయింట్‌ను పూర్తిస్థాయి కథగా విస్తరించలేకపోవడం చిన్న లోపంగా కనిపిస్తుంది. హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ జోనర్లను ఇష్టపడేవారికి కళింగ నచ్చడానికి చాలా అంశాలు ఉన్నాయి. వీలుంటే ఈ వారం ఈ సినిమాపై ఓ లుక్కేయండి..

More from Filmibeat

Read more about: kalinga dhruva vaayu pragya nayan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X