Kalki 2898 AD First Review: ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్ అదుర్స్.. కల్కి 2898 AD క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్

రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందిన కల్కి 2898 AD చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27వ తేదీన రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది. ఈ మూవీ ప్రమోషన్స్ ఊపందుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా సెన్సార్ రిపోర్టు బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్ వివరాల్లోకి వెళితే..

కల్కి 2898 AD చిత్రాన్ని ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులకు ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన తర్వాత వారు సంతృప్తికరమైన ఫీడ్ బ్యాక్ అందించినట్టు తెలిసింది. అయితే ఈ సినిమా కథతోపాటు, సాంకేతిక విలువలు అత్యున్నతంగా ఉన్నట్టు సెన్సార్ బోర్డు అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది.

Kalki 2898 AD censor Board Review  censor board members Thums Up with UA Certificate

ప్రభాస్ నటించిన ఈ సినిమాలో దృశ్యాలు అద్బుతంగా ఉన్నాయి. హాలీవుడ్ ప్రమాణాలను తలదన్నేలా ఈ సినిమాను తెరకెక్కించారు. కొన్ని సీన్లు చూస్తే చప్పట్లు కొట్టకుండా.. ఈలలు వేయకుండా ఆపలేరు. ఇండియన్ సినిమా రంగంలో ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలోని సన్నివేశాలు ఉంటాయి అని సెన్సార్ రిపోర్ట్.

ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంచుకొన్నకథ, స్టోరీని నడిపించడానికి అనుసరించిన స్క్రీన్ ప్లే ఇంతకుముందు ఎన్నడూ చూసినట్టు అనిపించదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ సక్సెస్ సాధించడానికి అనేక అంశాలు ఉన్నాయి అని సెన్సార్ బోర్డు అధికారులు ఫీల్ అయినట్టు తెలిసింది.

Kalki 2898 AD censor Board Review  censor board members Thums Up with UA Certificate

కల్కి చిత్రంలో నటించిన ప్రతీ నటుడు ఉన్నతమైన నటనను ప్రదర్శించారు. భైరవగా ప్రభాస్ ఎవరూ ఊహించని విధంగా అద్బుతంగా ఫెర్పార్మ్ చేశారు. యాక్షన్ సీన్లలో అదరగొట్టారు. అశ్వత్తామగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తమ కెరీర్‌లో గుర్తుండిపోయే విధంగా ఎమోషనల్ పాత్రలో నటించారు అని చెప్పారు.

Kalki 2898 AD censor Board Review  censor board members Thums Up with UA Certificate

కల్కి 2898 ఏడీ చిత్రంలో దక్షిణాదిలోని పలువురు అగ్ర హీరోలు ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపిస్తారు. క్లైమాక్స్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి. మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమాకు సెన్సార్ అధికారులు U/A సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. సెన్సార్ బోర్డు రిపోర్టు మాత్రం సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది అనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X