Kalki 2898 AD First Review ఫస్టాఫ్ క్లాస్ సెకండాఫ్ మాస్.. ఈ క్రేజీ అప్ డేట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే!
ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా రిలీజ్ కి సమయం దగ్గర పడుతుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అందరి చూపు ఈ సినిమా మీదనే ఉంది, ఎప్పుడెప్పుడు థియేటర్ల లో ఈ సినిమా చూద్దామా అని ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిపోర్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే.
అందుకే కల్కి1 కన్నా కల్కి 2 సినిమా మీద ప్రేక్షకులు ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ప్రత్యేక వీడియోలు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇప్పుడు ట్రైలర్ వాటిని రెట్టింపు చేయడం ఖాయం అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఏపీలో ఎక్కువ థియేటర్లలో దీన్ని ప్రదర్శించాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీ స్థాయిలో నిర్వహించబోతున్నట్లు సమాచారం.
అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ని జూన్ 10వ తారీఖున థియేటర్లలో రెండు రాష్ట్రాలలోని రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. హైదరాబాద్ జంట నగరాలలో సింగిల్ స్క్రీన్ లో మాత్రమే తెల్లవారుజామున ఒంటిగంటకు స్పెషల్ షోలు వేసే అవకాశం ఉంది.

మల్టీప్లెక్స్ లో ఈ అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున ఒంటిగంటకు షో వేస్తే సమస్యలు ఉంటాయని ఆలోచిస్తున్నారు మూవీ టీం. అయితే కల్కి ట్రైలర్ కోసమే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మొదటి సగం క్లాస్ టచ్ తో ఉంటే మిగిలిన సగం మాస్ టచ్ తో ఉండబోతుందంట.

మొదటి సగం ప్రేక్షకులు కల్కి లోకంలో విహరిస్తే మలిసగంలో ఉర్రూతలూగించే మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది. కల్కి పార్ట్ వన్ లో కమల్ పాత్ర పరిచయం మాత్రమే ఉంటుంది కానీ కల్కి2 లో లోక నాయకుడి విశ్వరూపం ఉండబోతుందని సమాచారం.


Click it and Unblock the Notifications











