Kalki 2898 AD Movie Review: కల్కి 2898 ఏడీ సినిమా రివ్యూ
నటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్ తదితరులు
కథ, దర్శకత్వం: నాగ్ అశ్విన్
నిర్మాత: సీ అశ్వినీదత్
సహ నిర్మాత: స్వప్న దత్, ప్రియాంక దత్
డైలాగ్స్: నాగ్ అశ్వీన్, సాయి మాధవ్ బుర్రా, వివేక్ (తమిళ్)
సినిమాటోగ్రఫి: డోర్‌డ్జే స్టోజిల్‌కోవిక్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
మ్యూజిక్: సంతోష్ నారాయణ్
బ్యానర్: వైజయంతీ మూవీస్
రిలీజ్ డేట్: 2024-06-27
మహాభారత యుద్దంలో అశ్వత్తామ హత: కుంజర ఎపిసోడ్ తర్వాత జరిగిన మోసానికి తట్టుకోలేక అభిమన్యు భార్య, గర్భవతి శశిరేఖపై ఓ అస్త్రాన్ని అశ్వత్తామ ప్రయోగిస్తాడు. మహిళలపై నీ ప్రతాపమా అంటూ అశ్వత్తామకు శ్రీకృష్ణుడు శాపం పెడుతాడు. అయితే కలియుగంలో తనను రక్షించే సమయం వస్తుంది. నన్ను రక్షించిన తర్వాతే నీకు విమోచనం కలుగుతుంది అని శాప విమోచనం గురించి చెబుతాడు. ఆ తర్వాత 600 సంవత్సరాల అనంతరం కాశీ పరిసర ప్రాంతంలో అశ్వత్తామ (అమితాబ్ బచ్చన్) భైరవ (ప్రభాస్), సుమతి (దీపిక పదుకోన్), సుప్రీం యాస్కిన్ (కమల్ హాసన్) మధ్య భవిష్యత్ కోసం పోరాటం జరుగుతుంది.

జల్సాగా తన వాహనం బుజ్జితో తిరిగే భైరవ ఎవరు? సుప్రీం యాస్కిన్ ప్రాజెక్ట్ K లక్ష్యం ఏమిటి? ప్రాజెక్ట్ K కోసం సుమతితోపాటు అమ్మాయిలను ఎందుకు బలి ఇస్తుంటాడు? యాస్కిన్ సామ్రాజ్యం కాంప్లెక్స్, శంబాల ప్రాంతాల మధ్య పోరాటం ఏమిటి? కాశీలో భైరవ ఏం చేస్తుంటాడు? కట్టుదిట్టమైన కాంప్లెక్స్ నుంచి సుమతి ఎలా తప్పించుకొని అశ్వత్తామను కలుసుకొన్నది? ఇంతకు అశ్వత్తామ కోసం వచ్చిన భైరవ ఎవరు? అశ్వత్తామ శాప విమోచనం జరిగిందా? తప్పించుకొన్న సుమతి కోసం యాస్కిన్ వేటాడాలని ఎందుకు అనుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే కల్కి 2898 ఏడీ సినిమా కథ.
మహాభారతం యుద్దం నేపథ్యంగా కథ మొదలై.. ఆ తర్వాత 600 ఏళ్ల టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. అత్యాధునిక వాహనాలు, ఊహకు అందని వస్తువులు లాంటి వస్తువులు నిజంగానే థ్రిల్ చేస్తాయి. అయితే కథలో డెప్త్ ఉండటం పాత్రల పరిచయం కారణంగా సినిమా చాలా స్లోగా కదిలినట్టు అనిపిస్తుంది. అయితే కొన్ని పాత్రల్లో ఆర్జీవి, ఎస్ఎస్ రాజమౌళి, దుల్కర్ లాంటి పాత్రలు రావడం కొంత ఉపశమనంగా ఉంటుంది. అయితే అలా నీరసంగా సాగే సినిమాకు ఇంటర్వెల్ ముందు 20 నిమిషాలు సినిమా మరో రేంజ్‌కు వెళ్తుంది. మంచి ట్విస్ట్‌తో ఫస్టాఫ్ ముగిసి సెకండాఫ్‌పై అంచనాలు పెరుగుతాయి.

ఇక సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచుకొన్న ప్రేక్షకుడికి మూవీ కొంత మేరకు నిరాశకు గురిచేస్తుంది. స్లోగా కథ చెప్పడం వల్ల ఏం జరుగుతుందో అర్ధం కాదు. కానీ చివరి 30 నిమిషాల సినిమా ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురిచేయడమే కాకుండా సీట్లకు అత్తుకుపోయేలా చేస్తుంది. సెకండాఫ్‌లో అమితాబ్, ప్రభాస్ మధ్య ఫైట్ సినిమాకు ఎనర్జీని ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్, కమల్ (యాస్కిన్) ఎపిసోడ్ సినిమాను సంపూర్ణంగా మంచి సినిమాను చూశామనే సంతృప్తికి గురి చేస్తుంది. సెకండ్ పార్ట్‌పై అంచనాలు పెంచేలా చేసిందని చెప్పవచ్చు.

అయితే కల్కి 2898 ఏడీ సినిమాకు ఫుల్ క్రెడిట్ అంతా నాగ్ అశ్విన్, అమితాబ్‌కు ఇవ్వాల్సిందే. నాగ్ అశ్విన్ రాసుకొన్న కథ, పురాణాలకు, అడ్వాన్స్ టెక్నాలజీ వరల్డ్‌కు కనెక్ట్ చేసిన తీరు ఓ మ్యాజిక్ అనే చెప్పాలి. నాగీ రాసుకొన్న పాత్రలు, అనుసరించిన స్క్రీన్ ప్లే కొత్తగా, థ్రిల్లింగ్‌గా ఉంటుంది. పార్ట్ వన్‌లో కొంత ట్రిమ్ చేసి ఉంటే మూవీ స్పీడ్ పెరిగి ల్యాగ్ అనే ఫీలింగ్ వచ్చి ఉండేది కాదనిపిస్తుంది.
ఇక కల్కి మూవీకి అమితాబ్ బచ్చన్ నట విశ్వరూపమే చూసే అవకాశం ఈ తరం ప్రేక్షకులకు దక్కిందనే చెప్పాలి. ఇక ప్రభాస్ ఫన్నీ క్యారెక్టర్ సినిమాకు ఫీల్ గుడ్‌గా అనిపిస్తుంది. అలాగే ప్రభాస్ యాక్షన్ సీన్లు మాస్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దీపిక పదుకోన్ ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. కమల్ హసన్‌కు ఈ సినిమాలో చాలా చిన్న పాత్రే. కానీ ఉన్నంత సేపు అతడి పాత్ర ప్రజెన్స్ తెర మీద కనిపిస్తుంది. ఆర్జీవి, రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ పాత్రలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటాయి. సీనియర్ నటి శోభన మంచి పాత్రలో మెప్పించింది.

టెక్నికల్ విభాగాల పనితీరు విషయానికి వస్తే..ఈ సినిమాలో సినిమాటోగ్రఫి, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ విభాగాల పనితీరు ఎక్సలెంట్ అని చెప్పవచ్ు.స్టోజికో విక్ సినిమాటోగ్రఫి బాగుంది. అయితే సంతోష్ నారాయణ్ మ్యూజిక్ మైనస్. చాలా సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పేలవంగా ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. పాటలు చాలా బోరింగ్, అసలే ఆకట్టుకోలేవు. ఇక వైజయంతీ మూవీస్ బ్యానర్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. సీ అశ్వినీదత్, ప్రియాంక, స్వప్న దత్ అనుసరించిన నిర్మాణ విలువలు చూస్తే.. ఖర్చుకు వెనుకాడలేదనిపిస్తుంది. తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన ప్రయత్నాన్ని అభినందించాలి.
ఇక మహభారతం, నేటి టెక్నాలజీ యుగాన్ని కనెక్ట్ చేస్తూ విజువల్ వండర్‌గా రూపొందించిన చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ విజన్, అమితాబ్, కమల్, దీపిక టాలెంట్. ప్రభాస్ మాస్ అప్పీల్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఇక మ్యూజిక్, స్లో నేరేషన్ ఈ సినిమాకు మంచి భోజనంలో పంటి కింద రాయిలా ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్, మేకింగ్, స్క్రీన్ ప్లే సినిమాను ఓ రేంజ్ తీసుకెళ్లడమే కాకుండా మంచి అనుభూతిని క్రియేట్ చేస్తుంది. సినిమా ఆరంభం మిస్ చేసుకోకండి.. ఒకవేళ మిస్ అయితే సినిమా ఏంటో అర్ధం కాదు. కాబట్టి ముందే వెళ్లి సినిమాను ఆస్వాదించండి. మీ టికెట్‌కు ఫుల్ వాల్యూ ఇస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. కల్కి 2898 ఏడీ మూవీ మస్ట్ వాచ్ మూవీ. లెట్స్ సెలబ్రేట్ ది మూవీ.


Click it and Unblock the Notifications











