OTT Review: కల్కి మూవీ రివ్యూ.. టొవినో థామస్ మూవీ ఎక్కడ? ఎప్పుడు? చూడొచ్చంటే?
నటీనటులు: టోవినో థామస్, సంయుక్త మీనన్, అంజలి నాయర్, అనుపమ నాయర్ తదితరులు
దర్శకత్వం: ప్రవీణ్ ప్రభారాం
నిర్మాత: ప్రసోబ్ కృష్ణ, సువీన్ వార్కే
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
ఎడిటింగ్: రంజత్ కుజుర్
ఓటీటీ రిలీజ్: ఆహా
ఓటీటీ రిలీజ్ డేట్: 2024-06-07
ఈ మధ్యకాలంల థియేటర్లో వచ్చే సినిమాల కంటే ఓటిటీలో వచ్చే సినిమాలే బాగా హిట్ అవుతున్నాయి. అందులోనూ ఈ ఏడాది మొత్తం మలయాళ సినిమాల జోరు ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఏ మలయాళ సినిమా తెలుగులో రిలీజ్ అయినా కూడా ఫ్యాన్స్ ముందు దాని సంగతి ఏంటో చూద్దాం అన్నట్లు చూస్తున్నారు. తాజాగా ఓటిటీలో ఒక మలయాళ సినిమా రిలీజ్ అయ్యింది. అదే కల్కి. అంటే ప్రభాస్ నటించిన కల్కి కాదు. మలయాళ హీరో టోవినో థామస్ హీరోగా నటించిన సినిమా.

కథ విషయానికొస్తే.. నెంజన్‌కొట్ట అనే గ్రామంలో రెండు పొలిటికల్ పార్టీలు కొట్టుకుంటూ ఉంటాయి. అందులో అధికారంలో ఉన్న అమర్‌నాథ్ (శివజీత్ పద్మనాభన్) చెప్పిందే వేదం. అతనికి భయపడి ఆ ఊరి నుంచి చాలామంది బయటకు వెళ్ళిపోతారు. వారిని మళ్లీ ఊరిలోకి తీసుకురావడానికి మరొక రాజకీయ పార్టీ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఊర్లో ఎలాంటి అరాచకం చేయాలన్నా.. అమర్.. తన తమ్ముడు అప్పుతో పాటు ఉమర్ (హరీష్ ఉత్తమన్)తో చేయిస్తూ అధికారం చెలాయిస్తూ ఉంటాడు. వీరి అరాచకాలను చూస్తూ ఉండలేక.. అలా అని వారిని ఎదిరించలేక నెంజన్‌కొట్ట ఎస్ఐ వైశాఖ్ (ఇర్షాద్) పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. అతని స్థానంలోకి కల్కి( టోవినో థామస్) బాధ్యతలు తీసుకుంటాడు.

ఒక పవర్ ఫుల్ పోలీస్ గా ఊరిలో అడుగుపెట్టడమే అమర్ రౌడీలను చితకబాది.. వారి కంట్లో పడతాడు. ఎలక్షన్స్ సమయం కావడంతో అమర్ ఎవరిని ఏం చేయకూడదు అని చెప్పినా తమ్ముడు అప్పు ఊరుకోకుండా.. ఉమర్ తో పోలీసులకు వార్నింగ్ ఇప్పిస్తాడు. ఇక కల్కి.. వారి గ్యాంగ్ లో ఉన్న ఒక్కొక్కరిని ఏరిపారేస్తూ ఉంటాడు. తన తమ్ముడికి పోటీగా ఎన్నికల్లో నిలబడిన వారిని అమర్‌నాథ్ చంపేస్తుంటాడు. అమర్‌నాథ్ ఆధిపత్యాన్ని ఎదురించి నెంజన్‌కొట్టలో కల్కి ఎలా నిలబడ్డాడు..? అసలు కల్కి ఆ ఊరికి ఎందుకు వచ్చాడు.. ? మధ్యలో ఈ సంగీత( సంయుక్త మీనన్) ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఇదొక పాత రొట్ట సినిమా. తెలుగులో ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడో చూసి వదిలేశారు. కథ మాత్రమే కాదు.. మొత్తం ఒకేలా ఉండడంతో అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. హీరో, రౌడీ, ప్రజలు ఈ ముగ్గురు చుట్టూనే కథ తిరుగుతుంది. అన్యాయాన్ని అణచడానికి దేవుడు ఒక మనిషిని పంపుతాడు. అతడే కల్కి. ఒక చిన్న లైన్. అది కూడా సాగదీసే కథనంతో బోర్ కొట్టిస్తుంది.

రౌడీ ఒకరిని చంపడం.. అందుకు ప్రతీకారంగా పోలీస్ ఒకరిని చంపడం.. ఇలాగే సాగుతోంది. సినిమా మొత్తం ప్లస్ ఏదైనా ఉంది అంటే అది టోవినో మాత్రమే. పవర్ ఫుల్ పోలీస్ గా అదరగొట్టేశాడు. ఇలాంటి సినిమా నుంచి మాస్ ఆడియెన్స్ ఏం కోరుకుంటున్నారో దర్శకుడు అవన్నీ ఫుల్‌గా దట్టించేశాడు డైరెక్టర్. ప్రతి పది నిమిషాలకు ఓ ఎలివేషన్ సీన్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమా సాగుతుంది.ఎలాంటి సినిమాలు లేకపోయినా.. అన్ని సినిమాలు చూసి ఏ సినిమా చూడాలో తెలియకపోతే కల్కి మీద ఒక లుక్ వేయొచ్చు.


Click it and Unblock the Notifications











