twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కల్కి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Kalki Movie Review And Rating || కల్కి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ || Filmibeat Telugu

    Rating:
    2.5/5
    Star Cast: రాజశేఖర్, అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్
    Director: ప్రశాంత్ వర్మ.

    గురుడ వేగ హిట్ తర్వాత యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ జోరు పెంచారు. అ! చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి పోలీస్ కథతో ముందుకొచ్చాడు. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్, 'హార్న్ ఓకే ప్లీజ్', 'ఎవరో ఎవరో' పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం రాజశేఖర్‌కు ఎలాంటి ఫలితాన్ని అందించింది? ప్రశాంత్ వర్మకు ద్వితీయ విఘ్నాన్ని దాటేశాడా? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    కల్కి కథ

    కల్కి కథ

    కల్కి (రాజశేఖర్) పోలీస్ ఆఫీసర్. కొల్లపూర్ సంస్థానంలో గొడవలకు కారణమైన నర్సప్ప (అశుతోష్ రాణా) ఎమ్మేల్యేగా దారుణాలు చేస్తుంటాడు. ఆ క్రమంలో మతకలహాలు చెలరేగి శేఖర్ బాబు(సిద్ధు జొన్నలగడ్డ) అనే నర్సప్ప సోదరుడు హత్యకు గురవుతాడు. మత కలహాలపై దర్యాప్తు చేయడానికి కల్కిని ఆఫీసర్‌గా నియమిస్తారు. ఈ క్రమంలో ప్రేయసి పద్మ (ఆదా శర్మ)కు దూరవుతాడు. హసీనా (నందిత శ్వేత)కు చేరువ కావడం పద్మకు మరింత ఆగ్రహం కలుగుతుంది.

    కథలో ట్విస్టులు

    కథలో ట్విస్టులు

    కేసు దర్యాప్తులో కల్కి ఎలాంటి నిర్ణయాలు తీసుకొన్నారు. పద్మ ఎందుకు దూరమైంది. కల్కికి హసీనా ఎందుకు దగ్గరైంది. శేఖర్ బాబును ఎవరు హత్య చేశారు. మంచి వాడని పేరున్న శేఖర్ బాబు హత్యకు కారణమేమిటి? నర్సప్ఫ, అతని ప్రత్యర్థి పెరుమాండ్లు(శత్రు) వర్గాలను కల్కి ఎలా తుద ముట్టించారనేది మిగతా కథ..

    ఫస్టాప్ అనాలిసిస్

    ఫస్టాప్ అనాలిసిస్

    కొల్లాపూర్ సంస్థానంలో చోటుచేసుకొన్న గొడవలతో కథ ప్రారంభమవుతుంది. ఆ కథను బేస్ చేసుకొని 83లో జరిగిన సంఘటన ఆధారంగా కథ మొదలవుతుంది. కల్కి క్యారెక్టర్‌ అండర్ ప్లేగా సాగుతూ, కొన్ని సందర్భాల్లో ఎమోషనల్‌గా సాగుతుంది. కల్కి దర్యాప్తుతో, అలాగే జర్నలిస్టు దేవదత్తా పరిశోధన మధ్య కథ నిదానంగా సాగుతుంటుంది. కశ్మీర్‌లో రాజశేఖర్, ఆదాశర్మ మధ్య ఓ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఉంది. ఓ చక్కటి యాక్షన్ ఎపిసోడ్‌తో తొలి భాగం ముగుస్తుంది.

    సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక రెండో భాగంలో కూడా కథ నత్త నడక సాగుతుంటుంది. ఓ టిపికల్ స్క్రీన్ ప్లేతో ట్విస్టులు రివీల్ చేయడం కథపై ఆసక్తి పెరుగుతుంది. ఎక్కువ భాగం కష్టంగా అనిపించినా సినిమాకు చివరి 20 నిమిషాలు ప్రాణంగా నిలిచింది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సీన్లు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయి. అప్పటి వరకు సాదాసీదాగా నడిచిన సినిమా ఒక్కసారిగా మ్యాజిక్ చేసినట్టు అనిపిస్తుంది.

    డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

    డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

    కల్కికి ప్రధానమైన బలం దర్శకుడు ప్రశాంత్ వర్మ. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చేసిన ప్రయోగం సినిమాకు ఎసెట్‌గా మారిందని చెప్పవచ్చు. దర్శకుడు రాసుకొన్న సీన్లు, కథను నడిపించిన తీరు ఆకట్టుకొనేలా ఉంది. సాదా సీదా కథకు మంచి ట్రీట్ మెంట్‌ను జోడించడం దర్శకుడు ప్రతిభకు అద్దపట్టింది. చివరి భాగంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ రాసుకొన్న సీన్లు సినిమాకు బలంగా మారాయి. కాకపోతే సాధారణ ప్రేక్షకులకు కొంత కన్‌ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్‌గా కల్కిని ఓ డైరెక్టర్ సినిమాగా అని చెప్పుకోవడంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడనొచ్చు.

    రాజశేఖర్ గురించి

    రాజశేఖర్ గురించి

    కల్కిలో రాజశేఖర్ కొత్తగా కనిపిస్తాడు. ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్ భిన్నంగా తెరపైన కూల్‌గా, హై యాటిట్యూడ్‌తో ఆకట్టుకొంటాడు. సినిమా మొత్తంగా తాపీగా కనిపించిన రాజశేఖర్ చివరి 20 నిమిషంలో పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశాడనే ఫీలింగ్ కలుగుతుంది. రాజశేఖర్ యాటిట్యూడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. లుక్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందనే భావన కలుగుతుంది. కల్కిగా ఇంకాస్త జోష్‌ తెరపై కనిపించేలా ఉండాల్సింది.

    హీరోయిన్ల పెర్ఫార్మెన్స్

    హీరోయిన్ల పెర్ఫార్మెన్స్

    రాజశేఖర్ ప్రియురాలిగా, వైద్యురాలిగా అదా శర్మ పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలో నటించింది. ముస్లిం యువతిగా నటించిన నందితా శ్వేతా పాత్ర కథలో ప్రాధాన్యత కలిగి ఉన్నప్పటికీ సినిమాలో హైలెట్ కాలేదు. పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకుంది.

    టెక్నికల్ అంశాల పరంగా

    టెక్నికల్ అంశాల పరంగా

    ‘కల్కి’ సినిమాటోగ్రఫీ బావుంది.దాశరథి శివేంద్ర తన కెమెరాతో ప్రతీ సీన్ మరింత హైలెట్ అయ్యేలా చేశాడు.శ్రవణ్ భరద్వాజ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. పాటలు ఫర్వాలేదు. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బావుండేది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    1983 నేపథ్యంలో సాగే కథ కల్కి. పీరియడ్‌ సినిమా కంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందనే కాన్సెప్టుతో కల్కి తెరకెక్కింది. కల్కి పాత్రలో రాజశేఖర్ యాటిట్యూడ్, యాక్టింగ్ హైలైట్ అని చెప్పవచ్చు. యాక్షన్ సినిమా ఇష్టపడే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. రెండు రోజులు ఆగితే దర్శకుడు ద్వితీయ విఘ్నాన్ని అధిగమించాడా.. లేదా అనేది తెలుస్తుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చితే మరో గరుడవేగ లాంటి విజయాన్ని రాజశేఖర్ సొంతం చేసుకొనే అవకాశాలు ఉన్నాయి.

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    డైరెక్టర్ ప్రతిభ
    రాజశేఖర్ పెర్ఫార్మెన్స్
    స్క్రీన్ ప్లే
    సెకండాఫ్‌లో 20 నిమిషాలు

    మైనస్ పాయింట్స్
    ఫస్టాఫ్
    స్లో నేరేషన్

     నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: రాజశేఖర్, అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, 'వెన్నెల' రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

    సాంకేతిక వర్గం:

    ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర,
    సంగీతం: శ్రవణ్ భరద్వాజ్,
    స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విల్,
    ఆర్ట్: నాగేంద్ర,
    ఎడిటర్: గౌతమ్ నెరుసు,
    స్టిల్స్: మూర్తి,
    లిరిక్స్: కృష్ణకాంత్ (కె.కె),
    కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్,
    ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్ - సుబ్బు,
    ప్రొడక్షన్ కంట్రోలర్: సలన బాలగోపాల్ రావు,
    చీఫ్ కో-డైరెక్టర్: మాధవ సాయి,
    లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి,
    పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి,
    సమర్పణ: శివాని, శివాత్మిక,
    నిర్మాత: సి.కళ్యాణ్,
    దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.
    రిలీజ్: 2019-06-28

    English summary
    Kalki movie is getting ready for release on June 28th. Rajasekhar comedy timing become talk of industry. Directed by Prashanth Varma. Producer KK Radhamohan distributing this movie. This movie teaser released on June 24th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X