కలుసుకోవాలని లేదు..!

By Staff

Kaluskovalani
నటీనటులు: ఉదయ్‌ కిరణ్‌, గజాలా, ప్రత్యూష,
సత్యనారయణ, సునీల్‌
సంగీతం: దేవీశ్రీప్రసాద్‌
నిర్మాతలు: ఆర్‌.పి.జి ప్రోడక్షన్స్‌
కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ఆర్‌.రఘురాజ్‌

కొత్త దర్శకులు కొంతమంది కొత్తదనం తీసుకొస్తోంటే, ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన రఘురాజ్‌ - కొత్త అంతా మంచిది కాదని నిరూపించాడు. ఆయన అనుభవ రాహిత్యానికి ఈ చిత్రం ప్రయోగం. అతుకులబొంత సన్నివేశాలకు తోడు నటీనటుల నటన కానీ నటన ఈ సినిమాలో ముఖ్యమైన లోపాలు. అవే ప్రేక్షకుల్ని ఇబ్బందిపెట్టే అంశాలు. నటీనటుల నుంచి ఎలా నటన రాబట్టుకోవాలో కూడా ఆయనకు తెలియదేమో, అందుకే సీనియర్‌ నటుడు సత్యనారయణ నటన కూడా ఇందులో అనీజీగా అనిపిస్తుంది. దానికి తోడు, జన్మతః తమిళుడైన ఈ దర్శకుడు, 'చిన్న పాయింట్‌ ను చిత్రవిచిత్రంగా సాగదీసే తమిళ లక్షణాల'ను వదులుకోలేకపోయాడు.

ఇక ఈ చిత్రం ద్వారా ఉదయ్‌ కిరణ్‌ తన నిజమైన సత్తా ఎమిటో చూపించాడు. మాస్‌ కు దగ్గరవ్వాలనే ప్రయత్నాలు, కంటిన్యూస్‌ గా డైలాగ్‌ చెప్పలేని ఈ కుర్రాడి అశక్తత కలిసిపోయి, ఉదయ్‌ ఇంకా నటనలో ఓనమాలు కూడా నేర్చుకోలేదని తెలిసిపోతుంది. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన పాటలకు, దర్శకుడు సన్నివేశాలు అల్లుకుంటూ పోయాడు. కథ ఎలాగూ పాతదే కాబట్టి సన్నివేశాలను వాటికి అనుగుణంగా మలుచుకున్నాడు.

డైలాగ్‌ లు బాగుంటేనే సునీల్‌ కామెడీ పండించగలడు. రెండు, మూడు సందర్భాల్లో తప్ప సునీల్‌ ఇందులో నవ్వించలేకపోయాడు. ఇందుకు న్యూస్‌ రీడర్‌ నుంచి హీరోగా మారి ఇప్పుడు రచయితగా మారిన వక్కంతం వంశీనే తప్పుపట్టాలి.

ఉదయ్‌ కిరణ్‌ హోటల్‌ మేనేజ్‌ మెంట్‌ కోర్స్‌ చేసినా అతనికి ఉద్యోగం దొరకదు. కారణం ఉదయ్‌ కు నచ్చినది చేస్తాడు తప్ప ఇతరులకు నచ్చినది చేయడు. సో...ఇలాంటి ఉద్యోగ వేటలో ఉన్నప్పుడే, ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ యాజమాని సత్యనారయణ పరిచయం అవుతాడు. సత్యనారయణకు ఉదయ్‌ నచ్చుతాడు. స్విట్జర్లాండ్‌ లో ఏదో ఒక సంస్థ సత్యనారయణకు అవార్డు ప్రకటిస్తుంది. దాన్ని రిసీవ్‌ చేసుకునేందుకు ఉదయ్‌ ను తీసుకొని వెడుతాడు. మరోవైపు, గజాలా పెద్ద పారిశ్రామిక వేత్త కూతురు. అన్ని ఉన్నా, ఆమె ప్రేమ రాహిత్యంతో బాధపడుతుంటుంది.

సరదాగా స్విట్జర్లాండ్‌ కు వెళ్ళిన ఈ భామ, అక్కడ ఉదయ్‌, సత్యనారయణలను చూస్తుంది. వాళ్ళు, ఇద్దరూ తండ్రీకొడుకులనుకొని, వారి ప్రేమను చూసి, ఈ అమ్మాయి గారు ఉదయ్‌ ను ప్రేమిస్తుంది. ఒక సారి కేబుల్‌ కారులో గజాలా, ఉదయ్‌ ప్రయాణిస్తుంటే, కరెంట్‌ పోయి కారు ఆగిపోతుంది. కానీ వీరి ఒంట్లో కరెంట్‌ ప్రసారం బాగానే ఉండడంతో 'కమిట్‌ ' అవుతారు.

కమిట్‌ అయిన గంటకే, గజాలా ఇండియా తిరిగి వెళ్ళిపోతుంది. రెండు రోజులకు హీరోగారు వస్తారు. రాగానే సత్యనారయణ చనిపోతాడు. ఇక ఇక్కడ్నుంచీ కథ అంతా ఒక్కటే. వీరిద్దరూ ఎలా కలుసుకుంటారని.

ఎన్నో తప్పులు, సిల్లీ మిస్టేక్స్‌, అనుభవరాహిత్యంతో ఈ సాగుతుంది. పాటలన్నీ వినడానికి బాగున్నాయి. కానీ అన్ని దాదాపు ఇదివరకు ఇళయరాజా ఉపయోగించిన ట్యూన్సే. దేవీశ్రీప్రసాద్‌ కు ఇన్‌ స్ట్రూమెంటేషన్‌ లో మంచి పట్టు ఉంది మరోసారి ఈ పాటలు కన్‌ ఫర్మ్‌ చేశాయి. దేవా స్వరపరిచిన 'షకీలా..షకీలా...' పాట బాగుంది. కానీ ఆ పాట ఎందుకో అర్థం కాదు. అందునా ఆ పాటకు జ్యోతిలక్ష్మి ఎందుకో? - జలపతి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X