twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏంటిది కళ్యాణ్ రామ్ ... ( 'ఓం' 3D రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.5/5

    కళ్యాణ్ రామ్ ఇప్పుడొప్పుడే 'అతనొక్కడే' నుంచి బయిటకు వచ్చేటట్లు కనపడటం లేదు. ట్విస్ట్ లనే స్క్రీన్ ప్లే అనుకుని వండిన కథతో 'ఓం' అంటూ దిగాడు. హాలీవుడ్ చిత్రాలు క్రాంక్, వాంటెడ్ లను గుర్తు చేసే ఈ చిత్రంలో హీరో పూర్తిగా ప్యాసివ్ అవటం..ఎంటర్టైన్మెంట్ మచ్చుకైనా లేకపోవటం,ట్విస్ట్ లు అనుకున్నట్లు పేలకపోవటం తో పేలవంగా తయారైంది. అయితే కళ్యాణ్ రామ్ టెక్నికల్ గా బాగా రావటానికి పడ్డ కష్టం మాత్రం తెరపై కనిపిస్తుంది. అది ఒక్కటే ఈ చిత్రంలో ప్లస్ పాయింట్.

    'ఓం' కధ చెప్పాలంటే...ట్విస్ట్ లు రివిల్ అయిపోతాయి. పూర్తి ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా ఇది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించే ఓ యువకుడి కథ. అర్జున్(కళ్యాణ్ రామ్) కి తన తండ్రి హరిశ్చంద్రప్రసాద్ (కార్తీక్) అంటే ప్రాణం. ఆయన్ను నిరంతరం కాపాడుతూంటాడు. ఈ లోగా హరిశ్చంద్రప్రసాద్ వల్ల పదవి పోగొట్టుకున్న మినిస్టర్ బైర్రెడ్డి(రావు రమేష్) ఓ ప్లాన్ గీస్తాడు. అందుకోసం జైల్లో ఉన్న భవాని శంకర్(సంపత్ రాజ్)ని బయిటకు తీసుకు వస్తాడు. వారినుంచి తన తండ్రిని రక్షించుకునే క్రమంలో అర్జున్ కి కొన్ని నిజాలు తెలుస్తాయి. అక్కడ నుంచి అతని గమ్యం మారుతుంది. ఇంతకీ ఆ నిజాలు ఏమిటి...అలాగే.. హీరోయిన్స్ కృతి కర్బందా, నికీషా పటేల్‌ లు కూడా కథలో కీలకమైన మార్పులు తెస్తారు. వారి పాత్రలు ఏమిటి అనేది తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.


    ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లో నడిచే ఈ చిత్రంలోని కథనం... Crank (2006) చిత్రాన్ని గుర్తుకు తెస్తూ..కాస్సేపు లైవ్ లో..మరికాస్సేపు..ప్లాష్ బ్యాక్ లో సాగుతూంటుంది. లైవ్ లో శత్రు సంహారం చేస్తూ హీరో బైక్ పై వెళ్తూంటాడు. ప్లాష్ బ్యాక్ లో అసలు ఆ శత్రువులు ఎవరు..వాళ్లని ఎందుకు చంపాల్సి వచ్చిందనేది చూపించారు. అయితే సినిమాలో అతి ముఖ్యమైన ఎపిసోడ్స్ అయిన ..హీరో ...విలన్స్ ఎదుర్కొనే కార్యక్రమం మాత్రం సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. అది మొక్కుబడిగా హీరో ఓ రివాల్వర్ పట్టుకుని కాల్చేయటం గా చూపించారు. నిజానికి హీరోకి విలన్స్ ఎవరో తెలిసిపోయాక..అసలైన క్లాంప్లిక్ట్ మొదలవుతుంది. అప్పుడు మాత్రమే ప్రేక్షకుడు ఆ విలన్స్ ని ఎలా హీరో అంతమొందించాడో చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేయగలుగుతాడు. అంతేగాని హీరోకే సినిమా క్లైమాక్స్ సమయానికి విలన్స్ తెలిస్తే...ఇంక చేసేదేముంటుంది. అదే ఈ సినిమాకు మైనస్ గా మారింది.

    సినిమా మొత్తం రకరకాల ట్విస్ట్ లతో నింపేయటం వల్ల కూడా ఆ ట్విస్ట్ లకు వివరణ ఇచ్చుకోవటం కూడా స్క్రీన్ సమయం సరిపోయింది. లెక్కకు మించిన ట్విస్ట్ లలో హీరో...అతనికి ఉన్న లక్ష్యం కనపడకుండా పోయాయి. హీరో తన లక్ష్య సాధనలో ట్విస్ట్ లు వస్తే బాగుండేది కానీ లక్ష్యం మొదలుకాకుండానే ట్విస్ట్ లతో కథనం సాగుతుంది. ఓ రకంగా దాదాపు ప్రీ క్లైమాక్స్ దాక్ కథ సెటప్పే జరిగిందని చెప్పాలి. అప్పుడు కానీ హీరో కి అసలైన విలన్ ఎవరో రివిల్ కాదు. ఇక టెక్నికల్ గా చిత్రాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే తాపత్రయంలో తెలుగు కమర్షియల్ సినిమాకు కావాల్సిన మిగతా అంసాలైన ఎంటర్టైన్మెంట్, సంగీతం వంటి విషయాలు వదిలేసాడు.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

    టెక్నికల్ మీదే దృష్టి...

    టెక్నికల్ మీదే దృష్టి...

    కళ్యాణ్ రామ్ కి మొదటి నుంచి తన చిత్రాల్లో ఏదో కొత్తదనం చూపించాలనే తాపత్రయం. అలాగే ఈ చిత్రాన్ని 3డి టెక్నాలిజీలో పూర్తి యాక్షన్ ఎపిసోడ్స్ కూడిన చిత్రంగా రూపొందించాలనుకున్నాడు. అయితే కథని కేవలం ట్విస్ట్ లకే పరిమితం చేసాడు. హీరోని యాక్టివ్ చెయ్యలేకపోయాడు. హీరోయిన్స్ పాత్రలు కూడా ఏదో కటౌట్ లుగా కనపడతాయి కానీ ప్రాణమున్నట్లు కనపడవు.

    కళ్యాణ్ రామ్ ఫెరఫార్మెన్స్

    కళ్యాణ్ రామ్ ఫెరఫార్మెన్స్

    ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటనా పరంగా ఓ మెట్టు ఎక్కాడనే చెప్పాడు. అయితే అతని నటనలోని యాంగిల్స్ ని ఆవిష్కరించేలా కథని ఎన్నుకుంటే బాగుండేది. యాక్షన్,ఎమోషన్ సీన్స్ లో చాలా డీసెంట్ గా ఈజ్ కనపరిచాడు. కానీ రొమాంటిక్ సీన్స్ లోనే అతను తేలిపోయాడు. డైలాగు డెలివరీ కూడా పవర్ పేకెడ్ గా ఉంది.

    కృతి కర్భందా...

    కృతి కర్భందా...

    గ్లామర్ పాత్ర కాకపోయినా సినిమాకు ఇవ్వాల్సిన ఎమోషనల్ టచ్ ఇవ్వగలిగింది. కానీ నటన సరిగ్గా లేకపోవటంతో తేలిపోయింది. దాంతో ఆమెపై పెట్టిన ట్విస్టు కూడా పండలేదు. కానీ ఆమె పాత్ర కథకు ఎంతవరకూ ఉపయోగపడిందీ అంటే చెప్పటం కష్టమే.

    నిఖిషా పటేల్

    నిఖిషా పటేల్

    సినిమాకు ఉన్న ఏకైక గ్లామర్ టచ్ ఈమే. బికిని కూడా వేసుకుని సినిమాకు కిక్ ఇద్దామని ట్రై చేసింది. అయితే ఇన్ని సినిమాల తర్వాత కూడా ఆమె నటన కొంచెం కూడా నేర్చుకోలేదని అర్దమవుతూంటుంది. ఆమె కు సినిమాలో ఇచ్చిన పాత్ర మంచి ఇంపాక్ట్ కలగచేసేదేకానీ ఫలితం లేదు.

    సపోర్టింగ్ యాక్టర్స్

    సపోర్టింగ్ యాక్టర్స్

    రావు రమేష్ ఈ సినిమాలో విజృంభించాడనే చెప్పాలి. శ్రీకాకుళం యాసలో సీన్స్ బాగానే పండించాడు. అయితే క్యారెక్టర్ కి సరైన డెప్త్ ఇవ్వలేకపోయాడు దర్శకుడు. ఆహుతి ప్రసాద్, సితార, వంటి సీనియర్స్ బాగానే చేసారు. అయితే సురేష్,కార్తీక్ మరీ ఓవర్ చేసారు. దర్శకుడు వీళ్ళద్దరి చేత అరవ అతి చేయించాడనిపించింది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ఈ చిత్రంకోసం కళ్యాణ్ రామ్ నిర్మాతగా తన మార్కెట్ కు మించి ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టాడని అర్దమవుతుంది. ఏదో కొత్తదనం చూపాలనే ఆసక్తి ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ తీసుకు వచ్చి మరీ సినిమాని రిచ్ గా తీసాడు. మిగతా ఎలిమెంట్స్ కూడా కలిసి వస్తే బాగుండేది.

    సంగీతం

    సంగీతం

    పాటలు బాగోలేదు కానీ... బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సంగీత ద్వయం బాగా ఇచ్చారు. ఈ చిత్రానికి ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోటే ఓ లుక్ వచ్చింది. నేఫద్య సంగీతం తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివాశాల్లో ఇంటెన్సిటి కోసం ఈ స్కోరే బాగా ఉపయోగపడింది.

    సినిమాటోగ్రఫి, ఎడిటింగ్

    సినిమాటోగ్రఫి, ఎడిటింగ్


    దర్శకుడు బేసిక్ గా కెమెరామెన్ అవటంతో చాలా స్పష్టంగా షాట్ డివిజన్ పై శ్రద్ద పెట్టినట్లు అర్దమవుతుంది. అయితే షాట్స్ పై పెట్టిన శ్రద్ద సినిమాలోని మిగతా విభాగాలపై పెట్టలేకపోయాడు. ఇక కెమెరా వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది. అయితే VFX క్వాలిటి మాత్రం చాలా పూర్ గా ఉంది. ఎడిటింగ్ మాత్రం చాలా షార్ప్ గా బాగా చేసారు.

    ఓవరాల్ గా...

    ఓవరాల్ గా...

    ఈ చిత్రం ఫలించని ప్రయత్నంగా చెప్పాలి. మొదటి యాక్షన్ త్రీడి అని ప్రచారం చేసుకున్నా ఫలితం లేదు. పెద్దగా ఓపినింగ్స్ కూడా రాబట్టలేకపోయారు. యాక్షన్ 3డి చిత్రంలాగే కథ పరంగా..వీక్ గా ఉండటంతో అసలుకే మోసం వచ్చింది. ఈ సినిమాలో ఏకైక ప్లస్ పాయింట్..లెంగ్త్ తక్కువ చేయటమే.

    కళ్యాణ్ రామ్

    కళ్యాణ్ రామ్

    నటీనటులు:కళ్యాణ్ రామ్, కృతి కర్బందా, నికీషా పటేల్‌, కార్తీక్‌, సురేష్‌, రావు రమేష్‌, రఘు, సితార తదితరులు
    కెమెరా: అజయన్ జోసఫ్ విన్సెంట్,
    ఎడిటింగ్: గౌతంరాజు,
    కళ: కిరణ్‌,
    స్టీరియోగ్రాఫర్స్‌: డేవిడ్‌ మైక్‌టేలర్‌, మార్కస్‌, మజ జ్డోవిన్‌స్కీ
    ఫైట్స్‌: విజయ్‌, రవివర్మ
    సంగీతం: అచ్చు, సాయికార్తీక్‌.
    కథ,స్క్రీన్ ప్లే, దర్సకత్వం: సునీల్‌రెడ్డి
    నిర్మాణం: ఎన్టీఆర్ ఆర్ట్స్.

    ఫైనల్ గా ఈ చిత్రం నందమూరి అభిమానులను,యాక్షన్ అభిమానలను కూడ అలరించటం కష్టమే అనిపిస్తుంది. సాంకేతికంగా ఎంత ఉన్నతంగా ఉన్నా.. కథ,కథనం సరిగ్గా లేకపోతే ఉపయోగం లేదని మరో సారి తెలియచేస్తుంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    After three-year and half year long gap, Kalyan Ram, the third generation Nandamuri scion, has made his grand comeback with his much-delayed movie OM 3D, which has soared up the curiosity and expectations to sky high. It is a routine revenge drama with boring twists. But what makes it special is its well shot action scenes using 3D technology.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X