twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కన్ఫ్యూజన్‌ రాముడు

    By Staff
    |

    Kalyana Ramudu
    -జలపతి గూడెల్లి
    చిత్రం: కళ్యాణరాముడు
    నటీనటులు: వేణు, నిఖిత, ప్రభుదేవా,
    సుమన్‌, నాజర్‌ తదితరులు
    సంగీతం: మణిశర్మ
    నిర్మాత: వెంకటశ్యాంప్రసాద్‌
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: రాంప్రసాద్‌.జి

    ఇతర భాష చిత్రాల నుంచి రీమేక్‌ చేస్తున్నప్పుడు..కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా..మక్కీకి మక్కి కాపీ కొడితే తప్పకుండా బోల్తాపడుతారు. వేణు నటించిన 'కళ్యాణరాముడు' చిత్రం విషయంలో అదే జరిగింది. మలయాళంలో ఇటీవల కాలంలో వరుస హిట్లు సాధిస్తోన్న దిలీప్‌ నటించిన 'కళ్యాణ్‌ రామన్‌' ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. దిలీప్‌ మంచి నటుడు. అతను పొట్టిగా ఉంటాడు. ఈ చిత్రం కోసం లావు కూడా అయి, ఖద్దరు బట్టలు వేసుకొని కొన్ని విచిత్ర వేషాలు వేస్తూ ఆకట్టుకోవడం వల్ల సినిమా అక్కడ ఆకట్టుకొంది. దాన్ని వేణు లాంటి నటన అంత గొప్పగా రానీ వ్యక్తితో సినిమా తీయాలనకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

    ఈ సినిమా ప్రథమార్థం అంతా సరదాగా సాగుతుంది. ద్వితీయార్థం అంతా కన్ఫ్యూజనే. అటు జ్యోతిష్యాన్ని నమ్మవద్దు అని చెప్పలేక, ఇటు ప్రేమ గొప్పదని చెప్పలేక, ఎటూ తేల్చక..ముగించడంతో సినిమా బాగా ప్రారంభమై పేలవంగా ముగిసిన ఇన్నింగ్స్‌ లా నిరాశపరుస్తుంది. వేణుకు సాధారణంగానే దట్టంగా మేకప్‌ వేసుకొంటాడు. ఈ చిత్రంలో ముసలి వేషంలో మరింత దారుణంగా మేకప్‌ వేసుకొని..ఆ ముసలి గెటప్‌ లో కన్పించినంతసేపు..ఛీఫ్‌ నాటక పాత్రదారిని చూసినట్లు అన్పించింది. మనవాళ్ళు మేకప్‌ లో ప్రావీణ్యం ఎప్పుడు సంపాదిస్తారో?

    కథ చిన్నదే. కళ్యాణరాముడు అనే పేరున్న వేణు కేటరింగ్‌ పనులు చేస్తుంటాడు. ఓ పెళ్ళిలో హీరోయిన్‌ (నిఖిత)ను చూసి ప్రేమిస్తాడు. అనుకోకుండా..వేణు అన్నయ్యే ఆ పెళ్ళికూతురును పెళ్ళిచేసుకుంటాడు. దీంతో ఇద్దరికి వరస అవుతుంది. చివరికి వీళ్ళు పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో అన్ని అనర్థాలు జరుగుతూ ఉంటాయి వారి కుటుంబంలో. అప్పుడు జాతకాలు చూపిస్తే..వీరిద్దరి జాతకాలు కలవవని పండితుడు చెప్తాడు. వేణును చేసుకుంటే నిఖిత చనిపోతుందని చెప్తాడు. చివరికి వీళ్ళ ప్రేమయాణం సుఖాంతంగా ముగిసే..దృశ్యాలు అంతగా ఆకట్టుకోవు.

    వేణు కామెడీ దృశ్యాల్లో బాగానే నటించినా..ఎమోషనల్‌ దృశ్యాల్లో కెమెరా ఆయనపై పెడితే..ప్రేక్షకులు భయపడాల్సిందే. పల్లెటూళ్ళల్లో గట్టిగా పౌడర్‌ వేసుకొని తిరునాళ్ళకు వెళ్ళే యువతీయువకుల మాదిరిగా దారుణంగా మేకప్‌ వేసుకోవడం ఆయన మానుకోవాలి. 'హాయ్‌'లో నటించిన అమ్మాయినే అన్నంత స్లిమ్‌ గా అందంగా నిఖిత తయారైంది ఈ చిత్రంలో. సుమన్‌ పాత్రకు పరిపూర్ణత లేదు. మణిశర్మ సంగీతం అతి సాధారణం. ఫస్ట్‌ హాఫ్‌ కామెడీ కోసం ఈ సినిమా చూడాలనకుంటే చూడవచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X