twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kanabadutaledu movie review: ఆకట్టుకొన్న బిగ్‌బాస్ హిమజ.. నిరాశ పరిచిన సునీల్

    |

    Rating:
    2.0/5
    Star Cast: సునీల్, హిమజ, రవివర్మ, కిరిటీ దామరాజు, వైశాలి రాజ్
    Director: బాలరాజు ఎం

    టాలీవుడ్‌లో మంచి కంటెంట్‌తో వచ్చే సస్పెన్స్, థిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. గతంలో ఇలాంటి చిత్రాలకు ప్రేక్షకులు బాగా ఆదరించారు. సునీల్, హిమజ నటించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి అనుభూతిని పంచిందనే విషయంలోకి వెళితే..

     కథ ఏమిటంటే..

    కథ ఏమిటంటే..

    కొత్తగా పెళ్లైన శశిద (వైశాలి రాజ్) భర్తకు దూరంగా ఉంటూ ఫోన్‌లో ఏదో నంబర్‌కు ట్రై చేస్తుంటుంది. భార్యతో కాపురం చేయలేక ఆదిత్య (యుగ్ రామ్) ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలో తొలిసారి నోరు విప్పి భర్త ఆదిత్యను కోరిక కోరడంతో షాక్ తింటాడు. అలా పెళ్లికి ముందు ప్రేమను బయటపెడుతుంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లోని డంప్ యార్డ్‌లో గుర్తు తెలియని శవం లభిస్తుంది.

    కనబడుటలేదులో ట్విస్టులు

    కనబడుటలేదులో ట్విస్టులు

    భర్తతో శశిద ఎందుకు దూరం ఉంటుంది? పెళ్లికి ముందు బాయ్‌ఫ్రెండ్ (సుక్రాంత్) ప్రేమ వ్యవహారంలో ఏం జరిగింది? చెల్లెలు శశిద కోసం నిఖిల్ సిద్ధార్థ్ (రవివర్మ) ఏం చేశాడు? భర్త జీవితంలో జరిగిన సంఘటనతో నిఖిల్ సిద్దార్థ్ భార్య (హిమజ) ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది. విక్టర్ రాజ్ పోలీస్ ఆఫీసర్ ఎందుకు హత్యకు గురయ్యాడు? వైజాగ్‌లో జరిగిన హత్యల వెనుక గుట్టును డిటెక్టివ్ రామకృష్ణ (సునీల్) ఎలాంటి దర్యాప్తును చేపట్టారు? అనే ప్రశ్నలకు సమాధానం కనబడుటలేదు సినిమా కథ.

    కనబడుటలేదు ఎలా ఉందంటే..

    కనబడుటలేదు ఎలా ఉందంటే..

    వైజాగ్‌ డంప్ యార్డ్‌లో జరిగిన దారుణ హత్య ఘటనతో కథ థ్రిల్లింగ్‌గా ప్రారంభమవుతుంది. శశిద, ఆదిత్య దాంపత్య జీవితంలో కలతలు అంశాలతో కథలోకి వెళ్తుంది. కాకపోతే కథలోని సన్నివేశాలు కొత్త నటీనటుల సామర్థ్యానికి భారంగా మారడంతో పాత్రలకు కనెక్ట్ కావడానికి ఇబ్బందిగా మారుతుంది. అయితే నూతన నటీనటులు తమ పాత్రలను నిలబెట్టడానికి తమ శక్తిమేరకు నటించడమే కాకుండా మెప్పించేందుకు ప్రయత్నించడం ఆకట్టుకొంటుంది. కథలో అనేక ట్విస్టులతో మూవీ పలు మలుపులు తిరుగుతుంది. దాంతో ఫస్టాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్‌గానే ముగుస్తుంది.

    సెకండాఫ్‌ ఎలా ఉందంటే...

    సెకండాఫ్‌ ఎలా ఉందంటే...

    సెకండాఫ్‌లో సునీల్ ఎంట్రీ కాస్త ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కానీ అది ఎక్కువ సేపు నిలబడినట్టు కనిపించదు. సునీల్ పాత్ర కాస్త నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు. సునీల్ కాకుండా మరే నటుడైనా ఉంటే ఆ పాత్ర కొత్తగా ఉండేదనిపిస్తుంది. ఇక సునీల్ క్యారెక్టర్‌ను డామినేట్ చేసే విధంగా కథలోకి యాక్టర్ హిమ క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడం సినిమా మరో మలుపు తిరుగుతుంది. హిమ కారెక్టర్‌లోని కొత్త కోణం క్యూరియాసిటిని కలిగిస్తుంది. అయితే అప్పటికే సినిమాకు జరిగిపోవాల్సిన నష్టం జరిగిపోయేందనే అభిప్రాయం కలుగుతుంది. ఓవరాల్‌గా ఓ సాదాసీదా సినిమా చూశామనే అభిప్రాయం ఫిక్స్ అవుతుంది.

    ఆకట్టుకొన్న బిగ్‌బాస్ హిమజ

    ఆకట్టుకొన్న బిగ్‌బాస్ హిమజ

    కనబడుట లేదు మూవీలో చాలా మంది కొత్త నటీనటులు కనిపిస్తారు. కానీ ఎక్కువగా ఈ సినిమాలో హిమ, సునీల్ పాత్రలు బలంగా కనిపిస్తాయి. హిమ తొలిసారి ఓ ప్రత్యేకమైన పాత్రలో ఆకట్టుకొంటారు. డిటెక్టివ్ పాత్ర సునీల్‌కు వెరైటీ క్యారెక్టర్ అయినప్పటికీ.. ఆ పాత్రకు అవసరమైన బాడీ లాంగ్వేజ్ కనిపించకపోవడం మైనస్.

    నిఖిల్ సిద్దార్థ్‌గా రవివర్మ, మైఖేల్‌గా కిరిటీ దామరాజు పాత్రలు సినిమా కథకు కీలక అంశాలు. వాటి ఆధారంగానే హిమ క్యారెక్టర్ ఎలివేట్ అవ్వడానికి అవకాశం దక్కింది. వైశాలి రాజ్, సుక్రాంత్, యుగ్ రామ్, ఇన్స్‌పెక్టర్ విక్టర్ రాజ్‌గా కిషోర్ కుమార్ పొలిమెర పాత్రలకు సంబంధించిన నటీనటులు తమ రోల్స్‌కు న్యాయం చేశారనిచెప్పవచ్చు. కొత్తవాళ్లైనా పోటీపోటీగా తమ ప్రతిభను చాటుకొనేందుకు ప్రయత్నించారు.

    దర్శకత్వం, ఇతర సాంకేతిక విభాగాల పనితీరు

    దర్శకత్వం, ఇతర సాంకేతిక విభాగాల పనితీరు

    తెర వెనుక విషయాలకు వస్తే.. దర్శకుడు బాలరాజు ఎంచుకొన్న పాయింట్, రాసుకొన్న స్క్రిన్ ప్లే, డిజైన్ చేసుకొన్న క్యారెక్టర్లు బాగున్నాయి. అయితే కాస్త మంచి నటీనటులుతో ఈ సినిమా తీసి ఉంటే.. ఆయన తపనకు సరైన ఫలితం దక్కేది. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు బడ్జెట్, నటీనటులు ఎంపిక కొన్నిసార్లు అడ్డంకిగా మారుతాయి. దర్శకుడు బాలరాజుకు అలాంటి పరిస్థితులే ఎదురై ఉంటాయనే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమాకు డైలాగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి.

    చాలా చోట్ల పంచ్‌లు బాగా పేలాయి. అయితే ఆ స్థాయి, భారమైన డైలాగ్స్‌లను నటీనటులు మోయలేకపోయారనే ఫీలింగ్ కలుగుతుంది. సందీప్ బద్దుల సినిమాటోగ్రఫి బాగుంది. మధు పొన్నాస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకొనేలా ఉంది. నిర్మాత ప్రసాద్ మంచనూరు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

    Recommended Video

    Allu Arjun Gives Clarity On Bigg boss Rumours || Filmibeat Telugu
    ఫైనల్‌గా ఎలా ఉందంటే..

    ఫైనల్‌గా ఎలా ఉందంటే..

    మంచి ట్విస్టులు, హిమజ నటన, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో కనబడుటలేదు సినిమా రూపొందింది. కొత్త దర్శక, నిర్మాతలు, నటీనటులను ఆదరించాలనే అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాను చూడవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఈ సినిమా మెప్పించడానికి ఆస్కారం ఉంది. వీకెండ్‌లో క్రైమ్, థ్రిల్లర్ చూడాలనుకొనే వారు కనబడులేదు మూవీని చూడవచ్చు.

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: సునీల్, హిమజ, రవివర్మ, కిరిటీ దామరాజు, సుక్రాంత్ వీరేళ్ల, వైశాలిరాజ్, యుగ్ రాజ్ తదితరులు
    దర్శకత్వం: బాలరాజు ఎం
    నిర్మాతలు: ఎస్ఎస్ ఫిల్మ్స్, శ్రీపాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్
    మ్యూజిక్ డైరెక్టర్: మధు పొన్నాస్
    ఎడిటర్: రవితేజ కుర్మాన
    రిలీజ్ డేట్: 2021-08-19

    English summary
    Comedian, Actor Sunil, Bigg Boss fame Himaja's Kanabadutaledu hits the screens on August 19th. In this occassion, Telugu filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X