twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కాంచన-3’ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Kanchana 3 Movie Review And Rating || Filmibeat Telugu

    Rating:
    1.5/5
    Star Cast: రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, నిక్కి తంబోలి, కోవై సరళ
    Director: రాఘవ లారెన్స్

    కాంచన ఫ్రాంచైజీ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న రాఘవ లారెన్స్ తాజాగా 'కాంచన-3'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు ఈ సీరిస్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో గ్లామర్ డోస్ పెంచాడు. ఓవియా, వేదిక, నిక్కి తంబోలి హీరోయిన్లుగా నటించారు. హారర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఈ చిత్రం ఎప్పటిలాగే భయపెడుతూ నవ్వించిందా? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించగలిగింది? అనేది రివ్యూలో చూద్దాం.

    కథ విషయానికొస్తే..

    కథ విషయానికొస్తే..

    తాతయ్య షష్ఠిపూర్తి వేడుక కోసం రాఘవ(లారెన్స్) కుటుంబం అంతా కలిసి సిటీ నుంచి ఊరెళతారు. అక్కడికి మామయ్య కూతుళ్లు (ఓవియా, వేదిక, నిక్కి తంబోలి) కూడా రావడంతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటాడు. కానీ వెళ్లాక అందరికీ ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆ ఇంట్లో దెయ్యం ఉన్న విషయం తెలిసి అంతా కలిసి అఘోరాలను ఆశ్రయిస్తారు. దెయ్యాన్ని తరిమేయడానికి ఇంటికి వచ్చిన అఘోరా వాటిని తరిమేసినట్లు అబద్దం చెప్పి వెళ్లిపోతాడు. ఆ మర్నాడే ఇంట్లో ఉండే రెండు దెయ్యాలు (కాళి, జూలియా) రాఘవను ఆవహిస్తాయి. రాఘవ శరీరంలో చేరడం ద్వారా తమ పగ తీర్చుకోవాలనేది ఆ దెయ్యాల ప్లాన్. ట్విస్ట్ ఏమిటంటే రాఘవ ఫ్యామిలీ కూడా వాటిని రాఘవ శరీరంలో ఉండేందుకు అనుమతిస్తారు. ఇంతకీ కాళి, జూలియా ఎవరు? వారి పగ ఎవరిపై? అనేది థియేటర్లో చూడాల్సిందే.

    లారెన్స్ పెర్ఫార్మెన్స్

    లారెన్స్ పెర్ఫార్మెన్స్

    కాంచన మూవీలో మాదిరిగానే ఇందులో కూడా రాఘవ లారెన్స్ దెయ్యం అంటే భయపడి అమ్మ చంకెక్కడం, చెప్పు చీపురు పక్కన పెట్టుకుని పడుకునే భయస్తుడిగా కనిపించాడు. మరో వైపు కాళి పాత్రలో మాస్ లుక్‌తో, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. అయితే గత కాంచన సిరీస్ సినిమాలతో పోలిస్తే లారెన్స్ ఆ స్థాయిలో ఆకట్టుకోలేదు.

    ఓవియా, వేదిక, నిక్కి తంబోలి

    ఓవియా, వేదిక, నిక్కి తంబోలి

    రాఘవ మరదళ్ల పాత్రల్లో ఓవియా, వేదిక, నిక్కి తంబోలి కేవలం గ్లామర్‌ సీన్లకే పరిమితం అయ్యారు. వారు తెరపై కనిపించి తక్కువే అని చెప్పాలి. ఉన్నంతలో కామెడీ, రొమాంటిక్ సీన్లలో ఫర్వాలేదనిపించారు.

    ఇతర పాత్రల్లో..

    ఇతర పాత్రల్లో..

    రాఘవ తల్లి పాత్రలో కోవై సరళ, అన్న వదినల పాత్రల్లో శ్రీమాన్, దేవదర్శిన వారి పాత్రలకు న్యాయం చేశాడు. విలన్ పాత్రల్లో కబీర్ దుహన్ సింగ్ తదితరులు జస్ట్ ఓకే. ఇంతకు మించి సినిమాలో పెద్దగా చెప్పుకునే పాత్రలేమీ లేవు.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే...

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే...

    సినిమా మొదటి భాగం మొత్తం రాఘవ కుటుంబం, మరదళ్ల మధ్య జరిగే కామెడీ సన్నివేశాలు, ఇంట్లో దెయ్యం ఉందనే సంకేతాలు ఇస్తూ చూపించిన కొన్ని హారర్ సీన్లతో నడిపించారు. రాఘవ శరీరంలోకి కాళి, జూలియా అనే దెయ్యాలు చేరే ఘట్టంతో ఇంటర్వెల్ ఎపిసోడ్ డిజైన్ చేశారు.

    సెకండాఫ్ ఎలా ఉందంటే..

    సెకండాఫ్ ఎలా ఉందంటే..

    సెకండాఫ్ మొత్తం కూడా కాళి, జూలియా కథ నడిపిస్తూ... వారికి అన్యాయం జరిగిన సంఘటనలు, పగ తీర్చుకునే ఎపిసోడ్లతో సాగింది. వారి పగ తీరి రాఘవ శరీరాన్ని విడిచి వెళ్లడంతో శుభం కార్డ్ వేశారు.

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాలు

    హారర్, కామెడీ కథలు అంటే సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ కీలకంగా ఉండాలి. ఎస్ఎస్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ హారర్ సీన్లు మరింత ఎలివేట్ అయ్యేలా చేశాయి. వెట్రి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సినిమాలో కొన్ని అనవసర సీన్ల విషయంలో ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉంటే బావుండేది. నిర్మాణ విలువల పర్వాలేదు. ఇతర టెక్నికల్ విభాగాలు ఓకే.

    కథ, స్క్రీన్ ప్లే ఎలా ఉంది?

    కథ, స్క్రీన్ ప్లే ఎలా ఉంది?

    ఏ సినిమాకైనా కథ ఎంతో కీలకం. అయితే ‘కాంచన-3' విషయంలో అదే పెద్ద మైనస్ అయింది. కొన్ని చిన్న మార్పులు తప్ప ‘కాంచన' కథనే ఉన్నది ఉన్నట్లు దించారు. స్క్రీన్ ప్లే కూడా రోటీన్‌గా ఉంది. ఈ రెండు అంశాల్లో కొత్తదనం చూపించడంలో దర్శకుడు రాఘవ లారెన్స్ విఫలం అయ్యాడు.

    కామెడీ, హారర్ వర్కౌట్ అయిందా?

    కామెడీ, హారర్ వర్కౌట్ అయిందా?

    సినిమాలో కామెడీ వర్కౌట్ అయిందా? అంటే పెద్దగా లేదనే చెప్పాలి. కాంచన చిత్రంలోని కామెడీ సీన్లనే మళ్లీ రిపీట్ చేశారు. హారర్ సీన్లు కూడా అంత గొప్పగా లేవు. సస్పెన్స్ ఉన్నపుడే హారర్ సీన్లు పండుతాయి. ‘కాంచన-3'లో అలాంటి ఎలిమిమెంట్స్ ఏమీ లేవు.

    ప్లస్ పాయింట్స్

    ప్లస్ పాయింట్స్

    రాఘవ లారెన్స్
    బ్యాగ్రౌండ్ స్కోర్

    మైనస్ పాయింట్స్

    కథ, స్క్రీన్ ప్లే
    విలన్ క్యారెక్టర్ వీక్‌
    సంగీతం
    ఎడిటింగ్

    చివరగా..

    చివరగా..

    ‘కాంచన-3' ఔట్ డేటెడ్ హారర్ కామెడీ మూవీ. కొత్తదనం ఎక్కడా కనిపించదు. ‘కాంచన' సిరీస్‌ సినిమాల కథనే కొన్ని మార్పులు చేసి అవే సీన్లతో రిపీట్ చేశారు. సగటు ప్రేక్షకుడు సంతృప్తి చెందడం కష్టమే.

    కాంచన-3

    కాంచన-3

    న‌టీన‌టులు: రాఘ‌వ లారెన్స్‌, ఓవియా, వేదిక‌, కొవైస‌ర‌ళ‌, క‌భీర్ దుహ‌న్ సింగ్‌, శ్రీమ‌న్‌, దేవ‌ద‌ర్శిని, స‌త్య‌రాజ్‌, కిషోర్ త‌దిత‌రులు

    సినిమాటోగ్ర‌ఫి- వెట్రి
    మ్యూజిక్ - తమన్
    క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌కత్వం - రాఘ‌వ లారెన్స్‌
    విడుదల తేదీ: ఏప్రిల్ 19, 2019

    English summary
    Kanchana 3 movie review. Kanchana 3 written and directed by Raghava Lawrence, starring himself, Oviya and Vedhika in the leading roles. Produced by Sun Pictures, the fourth installment in the Muni series and third installment in Kanchana series.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X