Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య నట విశ్వరూపం
ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువ. తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన ఈ సినిమాను కనీవినీ ఎరుగని రీతిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ తదితరులు నటించారు.
ఈ క్రమంలో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన లభిస్తున్నది. ఈ సినిమా నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అయింది. అమెరికా, ఇతర దేశాల్లో ఈ సినిమా ప్రీమియర్లు ఒక రోజు ముందే ప్రారంభమయ్యాయి. ఈ సినిమా ప్రీమియర్ షో తర్వాత నెటిజన్ల కామెంట్స్ వివరాల్లోకి వెళితే..

కంగువ సినిమా ప్రీమియర్స్ చూశాను. ఈ సినిమాలోని సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్. ఓవరాల్‌గా పెట్టిన టికెట్‌కు పక్కా పైసా వసూల్. హిందీలో బాహుబలి, కేజీఎఫ్ 2 రికార్డులు బ్రేక్ అవుతాయి. సినిమా సూపర్బ్‌గా ఉంది అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
కంగువా సినిమా ఫస్టాఫ్ మైండ్ బ్లోయింగ్. సూర్య యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాుగంది. ఈ మూవీకి నా రేటింగ్ 4/5 అని ఓ నెటిజన్ తన రివ్యూను అందించారు.
కంగువా ఫస్టాఫ్ చాలా బాగుంది. రెండు తరాల్లో కథలో సూర్య క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. వినోదంతోపాటు ప్రజెంట్ జనరేషన్ కథను బాగా చెప్పాడు. ఫ్లాష్ బ్యాక్ స్టోరి కొంత స్టోగా అనిపిస్తుంది. విజువల్స్ అద్బుతంగా ఉన్నాయి. క్లైమాక్స్ ఇంకా చాలా బాగుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.
కంగువ ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది. సినిమాలోని ప్రారంభంలో వచ్చే కొన్ని బ్లాక్స్ బాగున్నాయి. పిరియాడిక్ సీన్లను బాగా చూపించారు.సినిమా కొంత భాగం నడిచిన తర్వాత ఓవర్ ది టాప్, ఇరిటేటింగ్‌గా ఉన్నాయనిపిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కొన్నిసార్లు బాగుంది. మరికొన్ని సార్లు ఎక్కువగా కొట్టాడా? అనిపిస్తుంది. కంగువ పాత్రలో సూర్య బాగున్నాడు.
కంగువ సినిమా బాగుంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్యాక్ బోన్. సూర్య యాక్టింగ్‌తో మరోసారి అదరగొట్టారు. శివ రాసిన స్క్రిప్ట్,డైలాగ్స్ టాప్ లెవెల్‌లో ఉన్నాయి. ఈ మూవీకి నేను ఇచ్చే నా రేటింగ్ 4/5 అని నెటిజన్ ట్వీట్ చేశారు.
కంగువ సినిమా బ్లాక్ బస్టర్ అనే వైబ్స్ ఉన్నాయి. సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్ యాక్టింగ్ బాగుంది. నటీనటుల ఎంపిక, డీవోపీ, ఎడిటింగ్, స్టంట్స్, డైలాగ్స్, స్క్రీన్ ప్లేతో ఇరుగదీశారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
కంగువ సినిమా స్క్రీన్‌పైన బాగుంది.డ్రామా,స్టోరీ బాగున్నాయి. కానీ లెంగ్త్ ఎక్కువగా ఉంది. యాక్షన్ పార్ట్ ఫుల్లుగా ఉంది. కొన్నిసార్లు ఫైట్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఓవరాల్ మూవీ చాలా బాగుంది. నా రేటింగ్ 4/5 అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
కంగువ గుడ్ అటెంప్ట్. సూర్య డైలాగ్ డెలివరీ, అప్పీయరెన్స్ బాగుంది. యాక్షన్ సీన్లు గ్రాండ్‌గా తెరకెక్కించారు. ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ప్రజెంట్ కనెక్షన్ ఇంకా బెటర్‌గా ఉండాల్సిందని నెటిజన్ ట్వీట్ చేశారు.
కంగువ మూవీ రిలీజ్ సమయంలో హీరో సందీప్ కిషన్ సూర్యకు చిత్ర యూనిట్‌కు విషెస్ చెప్పారు. ప్రతీష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా విడుదల అవుతున్నది. మీ అందరికీ గొప్ప అనుభూతిని అందిస్తుంది. అన్ని భాషల ప్రేక్షకులకు గొప్ప సినిమాను అందించబోతున్నారు అని ట్వీట్ చేశారు.
కంగువ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో కార్తీ ట్వీట్ చేస్తూ.. సినిమా అంటే గొప్ప తపన ఉన్న వారంతా పర్వతాలను అధిరోహించి కంగువను గొప్ప సినిమాగా రూపొందించారు. సినీ ప్రేక్షకుల గొప్ప గౌరవాన్ని అందించేందుకు, వారికి వినోదాన్ని పంచేందుకు ఈ చిత్ర యూనిట్ చాలా కష్టపడ్డారు. వారు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని భావిస్తున్నాను. అంబన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ మెసేజ్ ఇచ్చారు.
దర్శకుడు పా రంజిత్ నిర్మాత రాజా, హీరో సూర్యకు విషెస్ అందించారు. డైరెక్టర్ శివ, చిత్ర యూనిట్‌కు విజయం దక్కాలని ఆశించారు. ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా కేవీజీ రాజా తన విజన్‌తో గొప్ప సినిమాను థ్రిల్లింగ్‌గా అందించబోతున్నారు అని అన్నారు.


Click it and Unblock the Notifications











