Kannappa Critics Reviews: కన్నప్ప మూవీ క్రిటిక్స్ రివ్యూ అండ్ రేటింగ్

టాలీవుడ్‌లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మించిన చిత్రం కన్నప్ప. టాలెంటెడ్ హీరో విష్ణు మంచు కథ, స్క్రీన్ అందించగా, ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విష్ణు మంచు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, ఆక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు నటించారు. మహ భారతం సీరియల్‌కు వర్క్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. షెల్డాన్ ఛావు సినిమాటోగ్రఫిని, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్, ఆంథోని గన్సాల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమా జూన్ 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది.

శివ భక్తి ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా పలు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొన్నది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమాపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా సెన్సార్ పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేసినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాను రజనీకాంత్ కూడా చూసి మోహన్ బాబు, విష్ణు మంచు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్‌ను ప్రశంసించారు.

Kannappa Critics Reviews

కన్నప్ప రిలీజ్‌కు ముందు హైదరాబాద్‌లోను, అలాగే ముంబైలోను స్పెషల్ ప్రీమియర్లు ప్రదర్శించారు. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు కొందరు క్రిటిక్స్ హాజరయ్యారు. అనంతరం ఈ సినిమా గురించి తమదైన శైలిలో రివ్యూలు ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వాటి ప్రకారం వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే?

కన్నప్ప సినిమా ప్రీమియర్ చూడటం జరిగింది. ఈ మూవీలోని చివరి 30 నిమిషాలు కథ, కథనాలు నా మైండ్ నుంచి తొలగిపోవడం లేదు. కాంతారా క్లైమాక్స్ చూసినప్పుడు కలిగిన ఇంటెన్స్ ఫీలింగే నాకు కలిగింది. ఆడియెన్స్ ముఖ్యంగా శివ భక్తుల క్లైమాక్స్ చూసిన తర్వాత కంటతడి పెట్టుకోవడం ఖాయం. కన్నప్ప సినిమా వాస్తవ కథ. దేవుడిపై నమ్మకం లేని వ్యక్తి తన తెగ, ప్రాంతం కోసం పోరాటం చేసిన యోధుడి కథ. ఫస్టాఫ్ సినిమా స్టోగా అనిపిస్తుంది. మోహన్ లాల్ సీక్వెన్స్ టెర్రిఫిక్. ప్రభాస్ అతిథి పాత్ర ఫెంటాస్టిక్. ఇవన్నీ పక్కన పెడితే. క్లైమాక్స్ అదిరిపోయేలా ఉంది అని క్రిటిక్ సుమిత్ కడెల్ తన సుదీర్ఘమైన రివ్యూలో పేర్కొన్నారు.

కన్నప్ప మూవీ గురించి క్రిటిక్ రోహిత్ జైస్వాల్ తన వీడియో రివ్యూలో.. ఈ సినిమా వాస్తవ కథ. గతంలో జన్మించిన మహాపురుషుడు మళ్లీ జన్మలో భగవంతుడిని నమ్మడు. అలాంటి వ్యక్తి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే సినిమా కథ. ఈ సినిమా స్క్రిప్టులో కొన్ని లోపాలు ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ ఇంకా బాగా చేసి ఉండాల్సింది. రొమాన్స్ తగ్గించి ఉండాలి. ఈ సినిమా నిడివి కనీసం 15 నిమిషాలు తగ్గించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే.. ఈ సినిమా చివరి 40 నిమిషాలు అంటే క్లైమాక్స్ మామూలుగా ఉండదు. నా మాట నమ్మండి. శివ భక్తులు ఊగిపోతారు అని తన కామెంట్ చేశాడు.

కన్నప్ప సినిమా ఇన్‌సైడ్ టాక్. వీఎఫ్ఎక్స్ అంత గొప్పగా లేవు. కానీ కథలోని భక్తిసారం డిఫరెంట్‌గా ఉంది. ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్ చేసినా.. పోస్టులు చేసినా.. శివ భగవానుడు ఆగ్రహానికి గురి కావాల్సిందే. రివ్యూ నిజాయితీగా ఇవ్వడం. ఖర్మ అనేది వాస్తవం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X