Rajinikanth's Kannappa Review: కన్నప్పపై రజనీకాంత్ రివ్యూ.. 35 ఏళ్లుగా అంటూ విష్ణు ఎమోషనల్
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మించిన చిత్రం కన్నప్ప. టాలెంటెడ్ హీరో విష్ణు మంచు కథ, స్క్రీన్ అందించగా, ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. దాంతో ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన వెల్లడించిన అభిప్రాయం వివరాల్లోకి వెళితే..
భారతీయ పౌరాణిక చరిత్రలో గొప్ప కథగా ప్రజల మనసులో నిలిచిన ఈ స్టోరీని కన్నప్ప చిత్రాన్ని రూపొందించారు. ఈ తరం వారికి ఈ కథను చాటి చెప్పాలనే ఉద్దేశంతో విజువల్ వండర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో విష్ణు మంచు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, ఆక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు నటించారు.మహ భారతం సీరియల్‌కు వర్క్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. షెల్డాన్ ఛావు సినిమాటోగ్రఫిని, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్, ఆంథోని గన్సాల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

భక్తి ప్రధానంగా సాగే పౌరాణిక చిత్రం కన్నప్ప చిత్రాన్ని భారీ తారాగణంతో రూపొందించారు. ఈ సినిమా శివుడిగా అక్షయ్ కుమార్, మరో కీలక పాత్రల్లో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు తదితరులు నటించారు. ఈ సినిమా ప్రస్తుతం భారీగా ప్రమోట్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలోను, సౌత్ ఇండియాలో కేరళ, కన్నడ, తమిళ భాషల్లో విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలోనే చెన్నైలో మీడియా ప్రమోషన్స్‌తో బిజీగా మారిపోాయరు.
అందమైన లొకేషన్లు, భారీ బడ్జెట్‌తో రూపొందిన కన్నప్ప సినిమాను రజనీకాంత్‌కు చూపించాలని మోహన్ బాబు, విష్ణు మంచు సంకల్పించారు. ఈ క్రమంలో చెన్నైలోని ప్రముఖ స్టూడియోలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ ప్రీమియర్ షోకు రజనీకాంత్, ఆయన సతీమణి లత, వారి కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు. ఈ సినిమా అనంతరం మంచు ఫ్యామిలీని అభినందిస్తూ.. గొప్ప సినిమాను తీశారు. మంచి అనుభూతిని అందించారు అని చెప్పినట్టు తెలిసింది.
కన్నప్ప సినిమాను వీక్షించిన అనంతరం మోహన్ బాబును రజనీకాంత్ ఆలింగనం చేసుకొన్నారు. వెంటనే కంగ్రాట్స్ చెప్పి .. మంచి సినిమాను తీశారు అని కితాబిచ్చారు. అలాగే రజనీ, లత దంపతులు కూడా విష్ణు మంచును ప్రశంసించారు. గొప్ప సినిమాను తీశావు అంటూ విష్ణును కౌగిలించుకొని అభినందించారు. ఇంకా ఈ షోను చూసిన వారందరూ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ నటన, వారి పాత్రల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు అని తెలిసింది.

కన్నప్ప మూవీని చూసిన అనంతరం రజనీకాంత్, మోహన్ బాబు మధ్య జరిగిన సంభాషణ చూస్తే.. వారి మధ్య ఎంత గొప్ప స్నేహం ఉంది అనే విషయం స్పష్టమైంది. అనంతరం మోహన్ బాబు, రజనీకాంత్ ఇద్దరు కలిసి కేక్ కట్ చేసి తమ స్నేహాన్ని గుర్తు చేసుకొన్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తనను కౌగిలించుకొని అభినందించారు. ఆ కౌగిలి, ఆ ప్రశంస కోసం 35 ఏళ్లు వెయిట్ చేశాను అని విష్ణు మంచు అన్నారు.


Click it and Unblock the Notifications











