Kannappa First Review: కన్నప్ప మూవీ ఫస్ట్ రివ్యూ
టాలీవుడ్‌లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మించిన చిత్రం కన్నప్ప. టాలెంటెడ్ హీరో విష్ణు మంచు కథ, స్క్రీన్ అందించగా, ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది.
భారతీయ పౌరాణిక చరిత్రలో గొప్ప కథగా ప్రజల మనసులో నిలిచిన ఈ స్టోరీని కన్నప్ప సినిమాలో విష్ణు మంచు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, ఆక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు నటించారు.మహ భారతం సీరియల్‌కు వర్క్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. షెల్డాన్ ఛావు సినిమాటోగ్రఫిని, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్, ఆంథోని గన్సాల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

భక్తి ప్రధానంగా సాగే పౌరాణిక చిత్రం కన్నప్ప చిత్రంలో శివుడిగా అక్షయ్ కుమార్, మరో కీలక పాత్రల్లో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు తదితరులు నటించారు. ఈ సినిమా ప్రస్తుతం భారీగా ప్రమోట్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలోను, సౌత్ ఇండియాలో కేరళ, కన్నడ, తమిళ భాషల్లో విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) అధికారులు, సభ్యులు వీక్షించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫీడ్ బ్యాక్, రివ్యూ వివరాల్లోకి వెళితే..
కన్నప్ప సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన ప్రభాస్‌కు కథ డిమాండ్ మేరకు భారీగానే స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. రెబల్ స్టార్ రోల్ సుమారుగా 30 నిమిషాల నిడివి ఉంటుంది. ఆ తర్వాత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పాత్ర నిడివి సుమారుగా 15 నిమిషాలు ఉంటుంది. అక్షయ్ కుమార్ క్యారెక్టర్‌కు ఓ పాటతోపాటు సుమారుగా 18 నిమిషాల నిడివి ఉంటుంది. కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే.. పార్వతి పాత్రలో ఆమె సుమారుగా 15 నిమిషాలపాటు సినిమాలో కనిపిస్తారు అనే విషయం సెన్సార్ అనంతరం బయటకు వచ్చింది.
కన్నప్ప సినిమా ప్రదర్శన అనంతరం చిత్ర యూనిట్‌ను సెన్సార్ అధికారులు ప్రశంసించారు. పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది. స్టార్ హీరోల క్రేజ్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి పాత్రలను కథలో జొప్పించిన తీరు సినీ అభిమానులను ఆకట్టుకొనేలా చేస్తుంది. ఈ సినిమాకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక కన్నప్ప సినిమా నిడివి విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రన్ టైమ్‌తో వస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీలోని కథ, పాత్రలకు ఉన్న ప్రాధాన్యం వల్ల సినిమా లెంగ్త్ పెరిగింది. అయితే ప్రేక్షకుడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా గొప్ప కథను ఆవిష్కరింప జేసే క్రమంలో ఈ సినిమాను 3 గంటల 15 నిమిషాలకు ఫిక్స్ చేశారు. అంటే ఈ సినిమా మొత్తంగా 195 నిమిషాల రన్ టైమ్‌తో విజువల్ వండర్‌గా ఉంటుంది అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











