Kannappa Twitter Review: కన్నప్ప మూవీ ట్విట్టర్ రివ్యూ
టాలీవుడ్‌లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మించిన చిత్రం కన్నప్ప. టాలెంటెడ్ హీరో విష్ణు మంచు కథ, స్క్రీన్ అందించగా, ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విష్ణు మంచు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, ఆక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు నటించారు. మహ భారతం సీరియల్‌కు వర్క్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. షెల్డాన్ ఛావు సినిమాటోగ్రఫిని, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్, ఆంథోని గన్సాల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమా జూన్ 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది.
శివ భక్తి ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా పలు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొన్నది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమాపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా సెన్సార్ పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేసినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాను రజనీకాంత్ కూడా చూసి మోహన్ బాబు, విష్ణు మంచు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్‌ను ప్రశంసించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్, స్టార్ ఎలాంటి అభిప్రాయాలను, రివ్యూలను వెల్లడించారనే వివరాల్లోకి వెళితే..

కన్నప్ప సినిమాలో విష్ణు మంచు తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అతిథి పాత్రలో ప్రభాస్ ఎంట్రీ రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. మోహన్‌లాల్ క్యారెక్టర్ పెద్ద సర్‌ప్రైజ్. బీజీఎం, సినిమాలోని ఎలివేషన్స్ టాప్ క్లాస్‌గా ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఎమోషన్స్ కట్టిపడేస్తాయి. చివరి సీన్లు కంటతడి పెట్టిస్తాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం గ్యారెంటీ. ఈ మూవీకి నా రేటింగ్ 3.5/5 అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
కన్నప్ప సినిమాలో స్టార్స్ చూస్తే కన్నులకు పండువగా అనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్ బాగున్నాయి. కన్నప్ప పాత్రను విష్ణు మంచు చాలా సింపుల్‌గా చేసేశాడు. ఆ క్యారెక్టర్‌లో జీవించాడు. ఆయన కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ చిత్రం. ప్రభాస్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్. రుద్ర పాత్ర గూస్ బంప్స్ తెస్తాయి. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ వారి పాత్రలతో ఆకట్టుకొన్నారు. డైరెక్టర్ ముఖేష్ ఆడియెన్స్ తనదైన శైలిలో ఆకట్టుకొన్నాడు. స్క్రీన్ ప్లే డీసెంట్‌గా ఉంది అని ఓ నెటిజన్ తన రివ్యూను ఇచ్చాడు.
కన్నప్ప సినిమా క్లైమాక్స్‌లో విష్ణు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ప్రభాస్ కేమియో అదిరిపోయింది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది. మోహన్ బాబు పాత్ర మరీ బాగుంది. కాళహస్తి, కన్నప్ప పాత్రను బాగా చిత్రీకరించారు. ఈ సినిమాకు నా రేటింగ్ 3.5 అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
కన్నప్ప సినిమాను కేవలం ప్రభాస్ కోసం చూసేయొర్చు. ప్రభాస్ సీన్లు చాలా బాగున్నాయి. ఆయన గెస్ట్ రోల్ పైసా వసూలు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ప్రభాస్ పోషించిన రుద్ర పాత్రను ఈ రోజుల్లో ఏదైనా యంగ్ హీరోకు ఆఫర్ చేస్తే వారు రిస్క్, అభద్రతాభావంతో చేసి ఉండేవారు కాదు. ప్రభాస్ పాత్ర ఈ సినిమాకు ప్రాణం పోసింది. బాహుబలి తర్వాత మరో మంచి పాత్రను ఆయన చేశాడు. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యాడు అని నెటిజన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
శివ భగవానుడు పరమ భక్తుడి డ్రామాగా రూపొందిన హిస్టరికల్ యాక్షన్ ఫిల్మ్ కన్నప్ప. కాళహస్తి ఆలయం నేపథ్యంగా ఈ కథ సాగుతుంది. డివోషనల్ అంశాలు బాగా చిత్రీకరించాడు. అయితే కథలోకి వెళ్లడం కాస్త లేట్ అయింది. ఫిక్షనల్ స్టోరి ఫ్లాట్‌గా సాగడం మైనస్. శివ శివ శంకర సాంగ్, చివరి 20 నిమిషాలు సినిమా గుండెను పిండేస్తుంది. భక్తిరస ప్రధాన అంశాలు బాగా ఉన్నాయి. మోహన్ బాబు ప్రభాస్ పాత్రలు చాలా బాగున్నాయి. వారికి రాసిన డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. విష్ణు మంచు డీసెంట్ ఫెర్పార్మెన్స్ చేశాడు. గ్రాఫిక్ వర్క్ బాగాలేదు. కొన్ని సీన్లను ఇంకా బాగా తీయడానికి ఛాన్స్ ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఫస్టాఫ్ చాలా బాగుంది. అయితే గ్రీన్ మ్యాట్ షూట్ విషయంలో కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్ బాగాలేదు. ఫైట్స్ ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ అంతగా బాగాలేదు. ఇంటర్వెల్ సీన్ కేక పుట్టించింది. టీవీ సీరియల్ డైరెక్టర్‌ను కాకుండా వేరే డైరెక్టర్‌ను ఎంచుకొని ఉంటే బాగుండేది. ఆయన కరెక్ట్ కాదనిపిస్తుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
కన్నప్ప లాంటి లెజెండరీ కథను తెరకెక్కించిన తీరుకు, మీరు పడ్డ కృష్టి, కష్టం, విజన్‌కు ధన్యవాదాలు. విష్ణు మంచు అన్నకు భారీ విజయం దక్కాలని కోరుకొంటున్నాను. అద్బుతమైన నటీనటులతో రూపొందిన ఈ సినిమాను ఆడియెన్స్ ప్రేమ కురిపిస్తారని భావిస్తున్నాను. తన మూడో జనరేషన్‌ను వెండితెర మీద చూసుకొని మోహన్ బాబు మురిసిపోవడం ఖాయం అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.
ఓ యోధుడు, గొప్ప భక్తుడు, భక్తిరసంతో కూడుకొన్న కథ కన్నప్ప. జూన్ 27న థియేటర్లలో సునామీ సృష్టించడానికి సిద్దమైంది. జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప భక్తుడు, దేవుడి కోసం కళ్లను కూడా అర్పించిన లెజెండ్ సినిమాను థియేటర్‌లోనే చూడండి అని హీరో మోహన్ లాల్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











