For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kantara Telugu Movie Review రిషబ్ శెట్టికి పెర్ఫార్మెన్స్ పూనకం.. క్లైమాక్స్‌లో ఊహించని థ్రిల్సింగ్

  |

  Rating:
  3.5/5
  Star Cast: రిషబ్ షెట్టి, సప్తమీ గౌడ, అచ్యుత్ కుమార్, కిషోర్ కుమార్, సుచాన్ శెట్టి
  Director: రిషబ్ షెట్టి

  కేజీఎఫ్‌ చిత్రంతో హోంబలే ఫిల్మ్స్ జాతీయ స్థాయిలో మంచి ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకొన్నది. ఇక కంటెంట్, క్వాలిటీతో అద్బుతమైన చిత్రాల రిషబ్ షెట్టి ఆలరిస్తున్నారు. తాజాగా హోంబలే ఫిల్మ్స్, రిషబ్ షెట్టి కాంబినేషన్‌తో వచ్చిన చిత్రం Kantara. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట భారీ రెస్పాన్స్‌ను అందుకొన్నట్టున్నది. ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతున్న ఈ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

  Kantara కథ ఏమిటంటే?

  Kantara కథ ఏమిటంటే?


  కర్ణాటకలోని కోస్టల్ ఏరియాలోని దట్టమైన అడవిలో జీవనం సాగించే సాధారణ యువకుడు శివ (రిషబ్ శెట్టి). ప్రకృతి ప్రసాదించిన అడవి తల్లి ఒడిలో పుట్టి పెరుగుతాడు. అక్కడే పుట్టి పెరిగి ఫారెస్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించిన లీలా (సప్తమి గౌడ)ను ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తుంటాడు? అనాది కాలంగా తాము జీవించే అటవీ ప్రాంతాన్ని కబలించేందుకు రాజకీయ నేత భూస్వామి (అచ్యుత్ కుమార్), ఫారెస్ట్ అధికారి మురళి (కిషోర్ కుమార్) కుట్రలు పన్నుతారు. అలాంటి కుట్రలను ఎదురించేందుకు తన ప్రాణాలను అర్పించడానికి కూడా శివ సిద్ధపడుతాడు.

   Kantara చిత్రంలో ట్విస్టులు

  Kantara చిత్రంలో ట్విస్టులు


  18 శతాబ్దంలో అడవి తల్లిని కాపాడుకొనేందుకు శివ కుటుంబ ఎలాంటి త్యాగాలకు పాల్పడింది? అటవీ ప్రాంతాన్ని కబలించి.. మన్నెంలో నివసించే కుటుంబాలను బయటకు పంపించాలనే కుట్రలు ఎలా సాగాయి? ఆ కుట్రల్లో భాగమైన ఫారెస్ట్ ఆఫీసర్‌తో శివ ఎలాంటి పోరాటం చేశాడు? తమ ప్రాంతంలోనే ఉంటూ పక్కలో బల్లెంగా మారిన భూస్వామిని శివ ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు ఫారెస్ట్ అధికారులకు, రాజకీయ నేతకు ఎలా గుణపాఠం నేర్పాడు అనేది ఈ సినిమా కథ.

   Kantara ఎలా ఉందంటే?

  Kantara ఎలా ఉందంటే?


  Kantara మూవీ కథ, చెప్పడానికి, వినడానికి చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ ఆ కథలో అగ్నిపర్వతం బద్దలయ్యేంత భావోద్వేగం కనిపిస్తుంది. పల్లెవాసులు, అటవీ ప్రాంతంలో ఉండే ప్రజల ప్రేమ, అభిమానం, అమాయకత్వం అన్నీ గుండెను తాకాతాయి. అటవీ ప్రాంతంలో నివసించే ప్రజల భావోద్వేగాలను నటుడిగానే కాకుండా దర్శకుడిగా రిషబ్ షెట్టి అద్బుతంగా డిజైన్ చేశాడు. పాత్రల తీరు తెన్నులు, క్యారెక్టర్ల చుట్టూ దైవభక్తితో కూడిన ఓ నమ్మకం సినిమాకు ఫుల్ ఎనర్జీగా మారింది. ఫస్టాఫ్‌లో ఆరంభంలో 20 నిమిషాలు, క్లైమాక్స్‌లో 30 నిమిషాల సినిమా ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురి చేయడమే కాకుండా.. కొత్త అనుభూతిని అందజేస్తుంది.

  Kantara రిషబ్ షెట్టి పెర్ఫార్మెన్స్

  Kantara రిషబ్ షెట్టి పెర్ఫార్మెన్స్


  Kantara మూవీలో సరదాగా జీవితాన్ని ఆస్వాదించే శివ పాత్రలో రిషబ్ శెట్టి పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. శివ క్యారెక్టర్ తప్ప.. రిషబ్ శెట్టి ఎక్కడా మచ్చుకు కూడా కనిపించడు. ఇమేజ్ గొడవలోపడి తన స్వభావానికి విరుద్దంగా క్యారెక్టర్‌ను మార్చుకొనే ప్రయత్నం చేసినట్టు కనిపించదు. సినిమాలోని ప్రతీ క్యారెక్టర్‌లో అడవిలో ఉండే స్వచ్ఛత, నిజాయితీ కనిపిస్తుంది. లీలాగా సప్తమీ గౌడ కూడా తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటుంది. రొమాన్స్‌, చిలిపితో కూడిన శృంగార సన్నివేశాల్లో రిషబ్, సప్తమీ కెమిస్ట్రీ బాగా పండింది.

  మిగితా పాత్రల్లో నటీనటులు

  మిగితా పాత్రల్లో నటీనటులు


  Kantara మూవీలో ఇతర పాత్రల విషయానికి వస్తే.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన కిషోర్ కుమార్ ఫారెస్ట్ ఆఫీసర్ మురళిగా నటించాడు. కరుకుతనం, మొండితనం ఉన్న అధికారిగా ఆకట్టుకొన్నాడు. ఇక అచ్యుత్ కుమార్ సాఫ్ట్ విలనిజంతో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్‌గా మారాడు. బుల్లా, ఇతర పాత్రల్లో నటించిన వారు నూటికి నూరు శాతం న్యాయం చేశారు.

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల పనితీరు


  Kantara మూవీలో సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ విభాగాలు సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టాయి. అరవింద్ కశ్యప్ అందించిన సినిమాటోగ్రఫి ప్రతీ సన్నివేశాన్ని హైలెట్‌గా మార్చింది. అజనీష్ లోక్‌నాథ్ అందించిన మ్యూజిక్ ప్రతీ దృశ్యాన్ని ఎమోషనల్‌గా మార్చింది. ప్రతీక్ శెట్టి ఎడిటింగ్ సినిమాను పరుగులు పెట్టించింది. ఆర్ట్స్, యాక్షన్ విభాగాలు అద్బుతమైన అవుట్‌పుట్‌ను అందించాయి.

   హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్

  హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్


  ఇక హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ విషయానికి వస్తే..కేజీఎఫ్ సినిమాతో వారి ప్రొఫెషనలిజం ఏమిటో తెలిసింది. కంటెంట్ విషయంలో ఎంత పక్కాగా ఉంటారో మరోసారి Kantara సినిమాతో చెప్పారు. కంటెంట్‌ను ఎలివేట్ చేయడానికి రాజీ పడలేరనే విషయం సినిమా చూస్తే ప్రతీ ఫ్రేమ్ చెబుతుంది. టాప్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాపై వారికి ఉన్న అభిరుచిని తెలియజేసిందని చెప్పవచ్చు.

  ఫైనల్‌గా Kantara ఎలా ఉందంటే?

  ఫైనల్‌గా Kantara ఎలా ఉందంటే?


  Kantara అంటే సంస్కృత భాషలో అడవి. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, కన్నడ నేటివిటిని, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లదకరంగా అందించే చిత్రంగా కంటారా రూపొందింది. పాత్రల్లో నిజాయితీ, నటీనటుల పెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల పనితీరు ఈ సినిమాను టాప్ క్లాస్‌గా మారేలా చేసింది. గ్రామీణ నేపథ్యం, రూరల్ నేటివిటీ చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చడమే కాదు.. గుండెలో నిలిచిపోతుంది.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు


  ప్లస్ పాయింట్
  కథ, కథనాలు
  రిషబ్ శెట్టి ఫెర్ఫార్మెన్స్, డైరెక్షన్
  సప్తమీ గౌడ యాక్టింగ్
  మ్యూజిక్, సినిమాటోగ్రఫి

  మైనస్ పాయింట్
  స్లో నేరేషన్
  పరిచయం ఉన్న నటులు లేకపోవడం

   నటీనటులు

  నటీనటులు


  నటీనటులు: రిషబ్ షెట్టి, సప్తమీ గౌడ, అచ్యుత్ కుమార్, కిషోర్ కుమార్, సుచాన్ శెట్టి, ప్రమోద్ శెట్టి తదితరులు
  రచన, దర్శకత్వం: రిషబ్ షెట్టి
  నిర్మాత: విజయ్ కిరగందూర్
  సినిమాటోగ్రఫి: అరవింద్ కశ్యప్
  ఎడిటింగ్: ప్రతీక్ శెట్టి
  మ్యూజిక్: అజనీష్ లోక్‌నాథ్
  బ్యానర్: హోంబలే ఫిల్మ్స్
  రిలీజ్ డేట్: 2022-09-30

  English summary
  Rishab Shetty's Kantara Movie has come to theatres on September 30th, 2022. Here is the exclusive review from Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X