Kapata Nataka Sutradhari review: క్రైమ్ డ్రామాగా 200 కేజీల గోల్డ్ స్కామ్

Rating: 2.5/5

నటీనటులు: విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు
దర్శకుడు: క్రాంతి సైన
నిర్మాత: మనీష్ (హలీమ్)
సహా నిర్మాతలు: ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్
సినిమాటోగ్రఫి: సుభాష్ దొంతి
సంగీతం: రామ్ తవ్వా
నేపథ్య సంగీతం: వికాస్ బడిస
మాటలు: రామకృష్ణ
ఎడిటర్: ఛోటా కే ప్రసాద్
డాన్స్ : జిత్తు మాస్టర్
బ్యాన‌ర్‌: ఫ్రెండ్స్ అడ్డా

జీవితంలో గొప్ప లక్ష్యాలను అందుకోవాలని ఓ బస్తీకి చెందిన గ్యాంగ్ విజయ్ శంకర్ (యాదగిరి), సంపత్ కుమార్ (సెంథిల్,) చందులాల్ (పూర్ణ), అమీక్ష (పుష్ప), సునీత (కల్పన) కలలు కంటుంటారు. స్వశక్తితో ఎదగాలని అనుకొంటున్న ఈ ఐదుగురికి లోన్ ఇప్పిస్తామని బ్యాంక్‌ ఉద్యోగి చెప్పడంతో రుణం కోసం దరఖాస్తు చేసుకొంటారు. ఈ క్రమంలో బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారానికి బదులు ఖాతాదారులకు నకిలీ బంగారం ఇస్తున్నారనే విషయం బయటకు వస్తుంది. భారీ స్కామ్ బయటకు రావడంతో పోలీస్ ఆఫీసర్ అరవింద్ (రుద్ర) రంగంలోకి దర్యాప్తు చేపడుతారు. అయితే ఈ స్కామ్ నుంచి బయటపడటానికి నేరాన్ని బ్యాంక్ అధికారులు ఈ ఐదుగురిపై తోస్తారు.

బంగారం స్కామ్ దర్యాప్తులో సునీత ఎందుకు చనిపోయింది? పోలీస్ ఆఫీసర్ దర్యాప్తులో ఏం తేలింది? స్కామ్ గుట్టురట్టు అవుతున్న సమయంలో బ్యాంక్ మేనేజర్‌తో సహా మిగితా వారందరూ అనూహ్యమైన పరిస్థితుల్లో ఎలా చనిపోయారు? పోలీస్ ఆఫీసర్ రుద్ర దర్యాప్తు ఎలా సాగింది? ఈ కేసు నుంచి బస్తీ గ్యాంగ్ బయటపడిందా? భారీగా జరిగిన నకిలీ బంగారం స్కామ్‌లో సూత్రధారులు ఎవరు? ఈ కుట్ర వెనుక కపట నాటక సూత్రధారి ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే కపట నాటక సూత్రధారి సినిమా కథ.

Kapata Nataka Sutradhari movie review and Rating

బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారానికి బదులు ఖాతాదారులకు నకిలీ బంగారం ఇవ్వడమనే కొత్త పాయింట్‌ సినిమాకు పాజిటివ్‌గా అనిపిస్తుంది. దాదాపు 200 కేజీల మేర బంగారం కుంభకోణం అంశం అనేక మలుపులు తిరుగుతూ ప్రేక్షకుడిలో ఆకట్టుకొనే విధంగా దర్శకుడు క్రాంతి సైన తెరకెక్కించారు. కొత్త వారితో ఈ పాయింట్‌ను ఎగ్జిక్యూట్ చేసిన తీరు అభినందనీయం. కాస్త పేరున్న నటీనటులతో చేసి ఉంటే ఈ సినిమాకు మంచి ఎలివేషన్ వచ్చే అవకాశం ఉండేది. అయితే నూతన నటీనటులు కూడా అనుభవం ఉన్న యాక్టర్ల మాదిరిగా తన టాలెంట్‌ను ప్రదర్శించి సినిమాను ఆసక్తికరంగా మార్చారు. ఈ సినిమాను ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా మార్చడానికి చేసిన దర్శకుడి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. గతంలో బుల్లితెర మీద పలు సీరియల్స్‌కు పనిచేసిన క్రాంతి తొలిసారి వెండితెరపై దర్శకుడిగా పరిచయమై ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం.

నటీనటులు ప్రతిభ విషయానికి వస్తే.. యాదగిరిగా విజయ్ శంకర్, సెంథిల్‌గా కమెడియన్ శివారెడ్డి సోదరుడు సంపత్ కుమార్, చందూలాల్‌గా పూర్ణ, అమీక్షగా పుష్ప ట్రాన్స్ జెండర్‌గా సునీత, ఇన్స్‌పెక్టర్ రుద్రగా అరవింద్, బ్యాంక్ మేనేజర్‌గా భాను ప్రసాద్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాకు కొత్తవారైనా నటనపరంగా ఎక్కడా తడబాటు కనిపించదు. కీలక సన్నివేశాల్లో నటీనటులు పోటీ పడి నటించారు. మేక రామకృష్ణ, విజయ్,మాస్టర్ బాబా ఆహిల్, రవిప్రకాష్ తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.

Kapata Nataka Sutradhari movie review and Rating

టెక్నికల్ విషయాలకు వస్తే... సంగీత దర్శకుడు రామ్ తవ్వా అందించిన పాటలు సందర్బోచితంగా బాగున్నాయి. వికాస్ బడిన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాలను ఫీల్‌గుడ్‌గా మార్చాయి. సుభాష్ దొంతి సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్. క్రైమ్, సస్పెన్స్ థ్రిలర్ చిత్రంలోని సన్నివేశాలకు సంబంధించిన మూడ్‌ ఎలివేట్ అయ్యేలా వాడుకొన్న లైటింగ్ బాగుంది. ఎప్పటి మాదిరిగానే ఎడిటర్ చోటా కే ప్రసాద్ కత్తెరకు పదును చూపించారు. రామకృష్ణ అందించిన డైలాగ్స్ కూడా బాగున్నాయి. మనీష్ (హలీమ్), ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్ పాటించిన నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. కొత్తవారితో చేసిన ప్రయత్నం ఆకట్టుకొనేలా ఉంది. ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదనే విషయం ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది.

క్రైమ్ ఆధారిత స్కామ్ నేపథ్యంగా తెరకెక్కిన కపట నాట సూత్రధారి మూవీలో మంచి ఎమోషన్స్‌ కనిపిస్తాయి. ఫ్రెష్ కంటెంట్‌తో రూపొందిన క్రైమ్ డ్రామా ఇది. బంగారం అంటే సెంటిమెంట్‌గా భావించే భారతీయుల మనోభావాలను దెబ్బ తీసేలా ఎలా మోసానికి పాల్పడుతున్నారనే విషయాన్ని దర్శకుడు క్రాంతి సైన చెప్పిన విధంగా బాగుంది. సస్పెన్స్, క్రైమ్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. కాబట్టి ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్తే మంచి అనుభూతి పొందడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X