twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కపటధారి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.0/5

    కన్నడలో ఘనవిజయం సాధించిన కావలుధారి చిత్రానికి రీమేక్‌గా రూపొందిన చిత్రం కపటధారి. సుమంత్, నందితా శ్వేత జంటగా, నాజర్, జయప్రకాశ్, వెన్నెల కిషోర్, సుమన్ రంగనాథన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్‌తో అంచనాలు పెంచిన కపటధారి సుమంత్‌కు ఎలాంటి ఫలితాన్ని అందించిందనే విషయాన్ని తెలుసుకొందాం..

    కపటధారి కథ

    కపటధారి కథ

    గౌతమ్ (సుమంత్) ట్రాఫిక్ పోలీస్ అధికారి. దాదాపు 40 ఏళ్ల క్రితం జరిగిన ముగ్గురి హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేయాలనుకొంటాడు. తన దర్యాప్తులో భాగంగా లాకప్ దిన పత్రిక ఎడిటర్ జేకే (జయప్రకాశ్) రిటైర్డ్ పోలీస్ అధికారి రంజిత్ (నాజర్), రమ్య (సుమన్ రంగనాథ్)ను కలుసుకొంటాడు. దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా రకరకాల ట్విస్టులు గౌతమ్‌ను కన్‌ఫ్యూజ్ చేస్తాయి.

    కపటధారి మూవీలో ట్విస్టులు

    కపటధారి మూవీలో ట్విస్టులు


    గౌతమ్‌ మర్డర్ మిస్టరీని ఎలా చేధించాడు? తన దర్యాప్తులో ముఖ్యమంత్రి అభ్యర్థి ఆలేరు శ్రీనివాస్‌కు ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు? ట్రాఫిక్‌లో ఉండే గౌతమ్ క్రైమ్ సంఘటనను ఎందుకు దర్యాప్తు చేయాలనుకొంటాడు? తన అధికారులకు తెలియకుండా చేసే ఇన్వెస్టిగేషన్‌లో కలిసిన రంజిత్ ఏ విధంగా సహాయం అందించాడు? సినీనటి రమ్యకు హత్యలతో ఎలాంటి సంబంధం ఉంది? లాకప్ దిన పత్రిక ఎడిటర్ జేకేకు ఈ హత్యలకు సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే కపటధారి కథ

    సుమంత్ పెర్ఫార్మెన్స్

    సుమంత్ పెర్ఫార్మెన్స్

    పోలీస్ ఆఫీసర్‌గా గౌతమ్‌ పాత్రలో సుమంత్ విభిన్నంగా కనిపించారు. తనదైన నటనతో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. తన రోల్ చుట్టు ఉన్న ఇతర పాత్రల్లో డెప్త్ లేకపోవడం వల్ల పూర్తిస్థాయిలో తన సత్తాను చాటుకోలేకపోయారు. కథలో వేగం లేకపోవడం, కథనంలో పస లేకపోవడంతో సుమంత్ ఆకట్టుకోలేకపోయాడని చెప్పవచ్చు.

    ఇతర నటీనటుల గురించి

    ఇతర నటీనటుల గురించి

    రంజిత్‌గా నాజర్, జీకేగా జయప్రకాశ్ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారే తప్ప.. సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లలేకపోయారు. ఇక నందితా శ్వేత ఈ సినిమాలో పాత్రను ఎందుకు ఒప్పుకొన్నారనే విషయం ఓ పట్టాన అర్థం కాదు. ఎలాంటి ప్రాముఖ్యత లేని పాత్రలో నందిత కనిపించారు. విలన్‌గా ఆలేరు శ్రీనివాస్‌గా నటించిన వ్యక్తి కూడా అంతగా ప్రభావం చూపలేకపోయారు.

    టెక్నికల్ విభాగాల పనితీరు

    టెక్నికల్ విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సైమన్ కే కింగ్ రీరికార్డింగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. రాసమతి అందించిన సినిమాటోగ్రఫి ఓకేలా ఉంది. దర్శకుడు ఎంచుకొన్న స్క్రీన్ ప్లే కారణంగా ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ విషయంలో ప్రతిభను చాటుకోలేకపోయారు. ఇంకా ఆయనకు చేతినిండా పని ఉంది.

    దర్శకుడి ప్రతిభ

    దర్శకుడి ప్రతిభ

    కపటధారి చిత్రాన్ని దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి తెలుగు నేటివిటిగా తగినట్టుగా పూర్తిగా తెరకెక్కించలేకపోయారు. సపోర్టింగ్ క్యారెక్టర్‌లో పాపులర్ యాక్టర్లు కాకుండా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని నటులు ఉండటంతో సినిమాతో పెద్దగా కనెక్ట్ కాలేకపోయారని చెప్పవచ్చు. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టాల్సి ఉండాల్సింది. స్క్రిన్ ప్లే టిపికల్‌గా ఉండటం కూడా కథ గమనానికి అడ్డుగా మారిందనే చెప్పాలి. దాంతో కపటధారి సాధారణ చిత్రంగానే ఉన్నట్టు కనిపిస్తుంది.

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: సుమంత్, నందితా శ్వేత, నాజర్, జయప్రకాశ్, వెన్నెల కిషోర్, సుమన్ రంగనాథ్ తదితరులు
    దర్శకుడు: ప్రదీప్ కృష్ణమూర్తి
    నిర్మాతలు: జీ ధనుంజయన్, లతా ధనుంజయన్
    కథ: హేమంత్ రావు
    మ్యూజిక్: సైమన్ కే కింగ్
    సినిమాటోగ్రఫి: రసమతి
    ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్
    బ్యానర్: క్రియేటివ్ ఎంటర్‌టైనర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్
    రిలీజ్ డేట్: 2021-02+19

    English summary
    Kapatadhaari film directed by Pradeep Krishnamoorthy, and produced by G. Dhananjayan. This movie is remake of the 2019 Kannada film Kavaludaari, it stars Sumanth and Nandhita, with Nassar and Jayaprakash in supporting roles. This movie hits the theatres on Feb 19th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X