Kara Movie Twitter Review: ‘కర' మూవీ ట్విట్టర్ రివ్యూ .. ధనుష్‌ మూవీ ఎలా ఉందంటే?

Kara Movie Twitter Review: తమిళ స్టార్ హీరో ధనుష్ చివరగా కుబేరతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఇడ్లీ కొట్టుతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 'కర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మమిత బైజు నటించగా, దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై ఐషరి కే.గణేష్ తమిళంలో నిర్మించగా, ఈ మూవీని తెలుగులో C. H.సతీష్ కుమార్ విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే టీజర్, పాటలతో బారీ కొంత బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా గురువారం(ఏప్రిల్ 30న) ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన ట్వీట్లు, వారి అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

Kara Movie Twitter Review in telugu  Dhanush Shines in Vignesh Raja s Thriller

'కర' సినిమాలో ధనుష్ 'కరస్వామి' అనే దొంగ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో, ఒకప్పుడు దొంగగా జీవించిన అతడు ఆ జీవితాన్ని వదిలేసి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. కానీ కొన్ని అనివార్య పరిస్థితులు అతడిని మళ్లీ అదే మార్గంలోకి నెట్టేస్తాయి. ఆ తర్వాత అతడు బ్యాంక్ దోపిడీలకు పాల్పడటం కథలో కీలకంగా మారుతుంది. ఈ పరిణామాలకు కారణాలేంటి? ఒక సాధారణ మనిషి తిరిగి నేరజీవితంలోకి ఎందుకు అడుగుపెట్టాడు? అనే అంశాల చుట్టూనే సినిమా తిరుగుతుంది.

ముఖ్యంగా 1991 ఇంధన సంక్షోభం నేపథ్యంలో జరిగిన సంఘటనలను బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుని, మనుగడ కోసం పోరాడే వ్యక్తి లోపల జరిగే సంఘర్షణను దర్శకుడు చూపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మమిత బైజు ధనుష్ భార్యగా కనిపించనుండగా, ఆమె పాత్ర కథలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న ఈ కథలో, వారి మధ్య సంబంధమే కథను ముందుకు నడిపించే ప్రధాన బలం అవుతుందట. అలాగే నటుడు సూరజ్‌ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మొత్తం మీద 90ల బ్యాక్‌డ్రాప్, ఎమోషనల్ డ్రామా, యాక్షన్ అంశాలతో కూడిన సినిమా అని తెలుస్తోంది.

ఒక ప్రేక్షకుడు 'కర' సినిమా చూసిన తర్వాత తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో ఇలా పంచుకున్నాడు. ధనుష్ ఈసారి పూర్తిగా మెప్పించలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డాడు. కథలో ఆయన పాత్రకు ఉన్న బలం స్క్రీన్‌పై అంతగా కనిపించలేదని పేర్కొన్నాడు. హీరోయిన్ మమిత బైజు నటన కూడా కొంచెం ఓవర్‌గా, సహజత్వం లేకుండా అనిపించిందని చెప్పాడు. అయితే సీనియర్ నటులు కె.ఎస్. రవికుమార్, ఎం.ఎస్. భాస్కర్ మాత్రం తమ పాత్రల్లో బాగా నటించి ఆకట్టుకున్నారని ప్రశంసించాడు. సినిమా మొదటి భాగం సరాసరిగా అనిపించిందని, కానీ రెండో భాగం మాత్రం చాలా నెమ్మదిగా, బోర్‌గా సాగిందని పేర్కొన్నాడు. క్లైమాక్స్ వరకు ఆసక్తిని నిలబెట్టలేకపోయిందని కూడా అభిప్రాయం వ్యక్తం చేశాడు.
మొత్తంగా చూస్తే.. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పిన ఆ నెటిజన్, సినిమాకు 5లో 1.5 రేటింగ్ ఇస్తూ తన రివ్యూ ముగించాడు.

మరో ప్రేక్షకుడు కర సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో తెలియజేస్తూ. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, మమిత బైజు నటన ఓకే అనిపించినా, పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదని పేర్కొన్నాడు. ధనుష్ పాత్ర కూడా ఆయన గతంలో చేసిన 'కర్ణన్' తరహాలోనే కనిపించిందని, కొత్తదనం లేకపోయిందని అభిప్రాయపడ్డాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ముందే ఊహించగలిగే విధంగా ఉందని చెప్పాడు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, జి.వి. ప్రకాష్ సంగీతమే సినిమాకు కొంత బలం ఇచ్చిందని పేర్కొన్నాడు. కానీ కథ మాత్రం పూర్తిగా ప్రిడిక్టబుల్‌గా మారిపోయిందని, సన్నివేశాలు చాలా లెంగ్తీగా ఉండటంతో బోర్ ఫీలింగ్ వచ్చిందని చెప్పాడు. మొత్తంగా సినిమా నిరాశపరిచిందని, "కంప్లీట్లీ డిజాస్టర్" అని ట్విట్ చేశారు.

మరో ప్రేక్షకుడు కర సినిమా ఫస్ట్ హాఫ్‌పై ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఇది స్లో-బర్న్ థ్రిల్లర్‌గా మొదటి నుంచి ఆకట్టుకుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ధనుష్ నటన చాలా నేచురల్‌గా, ఇంటెన్స్‌గా ఉందని ప్రశంసించాడు. అలాగే కె.ఎస్. రవికుమార్‌తో ఉన్న ఎమోషనల్ సీన్స్ బాగా హిట్ అయ్యాయని, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం టెన్షన్‌ను మరింత ఎలివేట్ చేసిందని తెలిపాడు. దర్శకుడు విష్నేష్ రాజా కథను సస్పెన్స్‌తో నెమ్మదిగా బిల్డ్ చేస్తూ, ఇంటర్వెల్ బ్లాక్‌ను హైలైట్‌గా తీర్చిదిద్దాడని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉందని పేర్కొన్నాడు.

ఇంకో సినీ అభిమాని కర సినిమాపై స్పందిస్తూ.. ధనుష్ నటనను ప్రశంసించాడు. ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ లేకుండా, పూర్తిగా నేచురల్‌గా, రియలిస్టిక్‌గా నటించాడని పేర్కొన్నాడు. ప్రత్యేకంగా కె.ఎస్. రవికుమార్‌తో ఉన్న ఎమోషనల్ సీన్స్ చాలా బలంగా హృదయాన్ని తాకాయని చెప్పాడు. మొత్తంగా ధనుష్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలం అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

మరో నెటిజన్ఈ సినిమాపై ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఫస్ట్ హాఫ్ చాలా స్ట్రాంగ్‌గా ఉందని పేర్కొన్నాడు. ధనుష్ తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకోగా, మమితా జైజు కూడా ఇంప్రెస్ చేసిందని చెప్పాడు. ఇంటర్వెల్ బ్లాక్ ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ అనుభూతిని ఇచ్చిందని, మ్యూజిక్ , స్క్రీన్‌ప్లే బాగా వర్క్ అయ్యాయని తెలిపాడు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ బ్లాక్‌బస్టర్ ఫీలింగ్ ఇచ్చిందని వెల్లడించాడు.

మరో సినీ అభిమాని కర ఫస్ట్ హాఫ్‌పై ట్విట్టర్‌లో స్పందిస్తూ.. సినిమా డీసెంట్‌గా ఉందని పేర్కొన్నాడు. కొన్ని థెఫ్ట్ సీన్స్ ఆసక్తికరంగా ఉండి ఎంగేజ్ చేశాయని, రెండో భాగానికి మంచి క్యాట్-అండ్-మౌస్ గేమ్‌ను సెట్ చేసిందని చెప్పాడు. ఇంటర్వెల్ బ్లాక్ హైలైట్‌గా నిలిచి, ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ అనుభూతిని ఇచ్చిందని అభిప్రాయపడ్డాడు. ధనుష్ దొంగ పాత్రలో కన్విన్సింగ్‌గా కనిపించాడని, మమితా బైజు కు ఫస్ట్ హాఫ్‌లో స్క్రీన్ టైమ్ తక్కువగా ఉందని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Read more about: mamita baiju dhanush
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X