Karate Kid: Legends Review: కరాటే కిడ్: లెజెండ్స్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: జాకీ చాన్, రాల్ఫ్ మాకియో, బెన్ వాంగ్, జోషువా జాక్సన్, సాడీ స్టాన్లీ, మింగ్ నా వెన్, ఆరామిస్ నైట్, వైట్ ఓలెఫ్,శానెట్టె రీనీ విల్సన్ తదితరులు
దర్శకత్వం: జోనాథన్ ఎంట్‌విజిల్
నిర్మాత: కారెన్ రాసెన్‌ఫెల్ట్
సినిమాటోగ్రఫి: జస్టిన్ బ్రౌన్
ఎడిటింగ్: డానా ఈ గ్లాబెర్మన్
మ్యూజిక్: డామినిక్ లెవిస్
ప్రొడక్షన్ బ్యానర్: కొలంబియా పిక్చర్స్, సన్‌సెఫ్ట్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2025-05-30
బీజింగ్‌లో నివసించే తన తల్లి డాక్టర్ ఫాంగ్ (మింగ్ నా వెన్)తో లీ ఫాంగ్ (బెన్ వాంగ్) జీవనోపాధి కోసం న్యూయార్క్ వెళ్తారు. న్యూయార్క్‌కు వెళ్లడానికి ముందే తాను ప్రాక్టీస్ చేసే కుంగ్‌ఫూ విద్యను పూర్తిగా వదిలిపెట్టాలని ఓట్టు వేయించుకొంటుంది. న్యూయార్క్‌కు వెళ్లిన తర్వాత విక్టర్ లిపానీ అనే మాజీ బాక్సర్ కూతురు మియా లిపానీతో పరిచయం ఏర్పడుతుంది. ఆ క్రమంలో కరాటే చాంఫియన్, మియా బాయ్‌ఫ్రెండ్ కానర్ డే (ఆరామిస్ నైట్)తో గొడవ జరుగుతుంది. దాంతో తన తల్లికి తెలియకుండా కరాటే, కుంగ్ ఫూ ప్రాక్టీస్ చేయడం మొదలుపెడుతాడు.

లీ ఫాంగ్‌ను కుంగ్ ఫూ విద్యను వదిలిపెట్టాలని తల్లి ఎందుకు కండిషన్ పెట్టింది? బీజింగ్ నుంచి న్యూయార్క్‌కు వలస పోవాల్సిన అవసరం లీ ఫాంగ్ ఫ్యామిలీకి ఎందుకు వచ్చింది? మియా లిపానీతో పరిచయం ఎలా ప్రేమగా మారింది? మియా బాయ్‌ఫ్రెండ్‌తో లీ పాంగ్‌కు శత్రుత్వం ఏర్పడింది? మిస్టర్ హాన్ (జాకీ చాన్) న్యూయార్క్‌కు ఎలా? ఎందుకు వచ్చి లీ పాంగ్‌తో చేతులు కలిపాడు? లీ పాంగ్‌ను ఛాంపియన్‌గా చేయడానికి మియాగీ డూ శిష్యుడిని సహాయం ఎందుకు తీసుకొన్నాడు? అసలు మియాగీ ఎవరు? చాంఫియన్ కానర్ డే ను లీ ఓడించాడా? మియాతో తన ప్రేమ ఫలించిందా? అనే ప్రశ్నలకు సమాధానమే కరాటే కిండ్ లెజెండ్స్ సినిమా కథ.
ప్రముఖ రచయిత రాబర్ట్ మార్క్ కామెన్ రాసిన ది కరాటే కిడ్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను జోనాథన్ రూపొందించారు. అయితే బలమైన కథ, కథనాలు లేకుండానే పగ, ప్రతీకారం, ప్రేమ, కొంత ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమాను అత్యంత సులభమైన, సరళమైన, రెగ్యులర్ పాయింట్‌తో సినిమాను రూపొందించాడు. ఫస్టాఫ్‌లో బలమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల రొటీన్ తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా ఫస్టాఫ్ నిడివి కూడా తక్కువగా ఉండటం సరిగా కంటెంట్ లేకపోవడం వల్ల సెకండాఫ్‌ను ఎలా డీల్ చేశాడో అనే క్యూరియాసిటీ కలుగుతుంది.

ఇక సెకండాఫ్‌లో బ్రదర్ సెంటిమెంట్ తెరపైకి తెచ్చి.. కథలో కొంత కదలిక తెచ్చే ప్రయత్నం చేశాడు. అయితే స్టోరీలో లీ ఫాంగ్‌ను చాంఫియన్‌గా చేయడమే టార్గెట్ కథ సాగుతుంది. దాంతో అనూహ్యంగా జాకీ చాన్, రాల్ఫ్ మాకియో పాత్రలు రావడంతో వారి వల్ల కథ యాక్షన్ పార్ట్‌తో ముందుకు సాగుతుంది. అయితే లీ పాంగ్ ఐదు బారోస్ ఎలా గెలిచాడనేది ఆసక్తిగా ఉండటంతో సినిమా ఫీల్‌గుడ్‌గా ముగుస్తుంది. అయితే కథలో గొప్పగా ట్విస్టులు లేకపోవడం, క్లైమాక్స్ ఊహించదగినదిగా ఉండటం వల్ల జాకీ ఛాన్ నటించిన గొప్ప సినిమాను చూసిన అనుభూతి ఏ మాత్రం కలుగదు.
కరాటే కిడ్ లెజెండ్ సినిమా భారమంతా లీ ఫాంగ్ భుజాలపై మోశాడు. యాక్టింగ్ పరంగా మెచ్యురిటీతో ఫెర్ఫార్మ్ చేశాడు. యాక్షన్ పార్ట్‌లో తన వయసుకు మించిన పరిణతిని ప్రదర్శించడమే కాకుండా అద్బుతంగా ఫైట్స్, మార్షల్ ఆర్ట్ విన్యాసాలను ప్రదర్శించాడు. ఇక జాకీ చాన్, రాల్ఫ్ మాకియో అతిథి పాత్రలతో అలరించారు. ఈ ఇద్దరు లేకపోతే సినిమా పరిస్థితి ఊహించడమే కష్టంగా ఉండేదనిపిస్తుంది.విలన్ పాత్రలో కానర్ డే గా అరామిస్ నైట్ కూడా తన వంతుగా బాగా నటించాడు. మియా లిపానీగా సాడీ స్టాన్లీ గ్లామర్‌ను నింపింది. లీ తల్లి పాత్రను పోషించిన మింగ్ నా వెన్ తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించారు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు.

ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. గొప్పగా చెప్పుకొనేంత లేవు. డామినిక్ లెవిస్ మ్యూజిక్, జస్టిన్ డానా ఈ గ్లాబెర్‌మెన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. జస్టిన్ బ్రౌన్ సినిమాటోగ్రఫి బాగుంది. న్యూయార్క్ సిటీని అందంగా తెర మీద చూపించే ప్రయత్నం చేశాడు.అలాగే మార్షల్ ఆర్ట్ పోటీలను చాలా ఇంట్రెస్టింగ్‌గా చిత్రీకరించారు. డానా ఇంటర్ కట్ షాట్స్‌తో సినిమాను ఆసక్తికరంగా మలిచాడు. కొలంబియా పిక్చర్స్, సన్ స్వెప్ట్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.
కరాటే కిడ్ లెజెండ్స్ సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. గత జాకీ చాన్ నటించిన సినిమాలతో పోల్చుకొని చూస్తే కిక్ ఇవ్వదు. కానీ లీ పాంగ్ మాత్రం తన ప్రతిభతో మెప్పిస్తాడు. ఈ జనరేషన్ పిల్లలకు బాగా నచ్చుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే సినిమాను ఎంజాయ్ చేసే అంశాలు చాలా ఉన్నాయి. అలాగే మార్షల్ ఆర్ట్స్ బేస్‌గా రూపొందించే సినిమాలను, జాకీ చాన్ మూవీస్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా పైసా వసూల్.


Click it and Unblock the Notifications











