Karate Kid: Legends Pre Release Review: కరాటే కిడ్: లెజెండ్స్ ప్రీ రిలీజ్ రివ్యూ.. జాకీ చాన్, అజయ్ కలయికతో

వరల్డ్ సినిమాలో లెజెండరీ యాక్షన్ హీరో జాకీ చాన్ నటించిన అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ డ్రామా సినిమా కరాటే కిడ్: లెజెండ్స్. జోనాథన్ ఎంట్‌విజిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రాబ్ లీబర్ కథను అందించారు. రాబర్ట్ మార్క్ కెమెన్ రాసిన ది కరాటే కిడ్ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. కరెన్ రోసెన్‌ఫిట్ నిర్మించిన ఈ చిత్రం మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు, ఇతర అంశాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

జాకీ చాన్ నటించిన కరాటే కిడ్ సినిమా తొలిసారి 2010 సంవత్సరంలో రిలీజైంది. ఈ సినిమాకు ఫ్రాంచైజీగా ఇప్పటి వరకు అదే పేరుతో మూడు సీక్వెల్స్ వచ్చాయి. తాజాగా కరాటే కిడ్: లెజెండ్ పేరుతో నాలుగో సీక్వెల్‌గా రిలీజ్ కానున్నది. ఈ సినిమా మే 8 తేదీన మెక్సికోలో రిలీజ్ చేయగా భారీ స్పందన వ్యక్తమవ్వడమే కాకుండా రికార్డు కలెక్షన్లు కూడా రాబడుతున్నది. 45 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే 13.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Karate Kid  Legends Pre Release Review

కరాటే కిడ్: లెజెండ్ సినిమా కథ విషయానికి వస్తే.. మిస్టర్ హాన్ (జాకీ చాన్) బీజింగ్‌లో ప్రాచీన కుంగ్ ఫూ మార్షల్ ఆర్ట్స్‌ను నేర్పించే కోచ్‌. ఆయన వద్ద ఈ విద్యను నేర్చుకొనే వారిలో లీ ఫాంగ్ (బెన్ వాంగ్) ఒకరు. ఈ అబ్బాయి తల్లి బతుకు తెరువు కోసం న్యూయార్క్‌కు వెళ్లాల్సి రావడంతో తనతోపాటు లీ ఫాంగ్ కూడా వెళ్లాల్సి వస్తుంది. అయితే తాను ప్రాణంగా ప్రేమించిన కుంగ్ ఫూ విద్యను వదిలివేయాల్సిన పరిస్థితి వస్తుంది. తల్లికి ఇచ్చిన మాట కోసం మార్షల్ ఆర్ట్‌ను వదిలి వేసిన తర్వాత ఏం జరిగింది? ఎందుకు వదిలివేశాడు అనేది ఈ సినిమా కథ.

కరాటే కిడ్: లెజెండ్ సినిమా 94 నిమిషాలు నిడివితో ఉంటుంది. ఈ సినిమాలో లీ ఫాంగ్ పాత్రలో బాల నటుడు బెన్ వాంగ్ హీరోగా కనిపిస్తాడు. లీ ఫాంగ్‌కు మెంటర్‌గా మిస్టర్ హాన్‌గా జాకీ చాన్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇతర పాత్రల్లో రాల్ఫ్ మాచియో, జాషువా జాక్సన్, సాడీ స్టాన్లీ, మింగ్ నా వెన్ తదితరులు నటించారు. ఈ సినిమాకు డానా ఈ గ్లాబెర్‌మెన్ ఎడిటింగ్, జస్టిన్ బ్రౌన్ సినిమాటోగ్రఫి అందించారు. ఈ సినిమాను కొలంబియా పిక్చర్స్ నిర్మించగా, సోని పిక్చర్స్ ద్వారా రిలీజ్ అవుతున్నది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన హిందీ వెర్షన్‌కు స్టార్ హీరో అజయ్ దేవగన్, ఆయన కుమారుడు యుగ్ దేవగన్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ సినిమాకు తండ్రి కొడుకులు పనిచేయడం విశేషంగా మారింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జాకీ చాన్, బెన్ వాంగ్, అజయ్ దేవగణ్, యుగ్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ అనుభూతులను పంచుకొన్నారు. తన తండ్రి అజయ్ హీరో. ఆయన లేనిదే నేను లేను అంటూ యుగ్ ఎమోషనల్ అయ్యాడు.

ఈవెంట్‌లో అజయ్ దేవగన్ మాట్లాడుతూ.. తన తండ్రి వీరు దేవగణ్, అలాగే మిస్టర్ మియాగీలా నాకు స్పూర్తి. వారే నాకు తొలి గురువులు. నా తండ్రి కోరికే నన్ను యాక్టర్ చేసింది. ప్రస్తుతం కేబుల్స్, గ్రాఫిక్స్ యాక్షన్ సీన్ల కోసం వాడుతున్నారు. వాటి వల్ల ఫైట్స్ చేయడం తేలికైంది. కానీ కష్టపడటం కంటే తృప్తి మరోటి ఉండదు అని అన్నారు. అనంతరం జాకీ చాన్ మాట్లాడుతూ.. మిస్టర్ మియాగీ మాత్రమే కాదు. నాకు ఎందరో గురువులు ఉన్నారు. ఈ వేదికను అజయ్‌తో పంచుకోవడం హ్యాపీగా ఉంది. అందుకు ధన్యవాదాలు. బాలీవుడ్‌లో డ్యాన్స్‌లో టైమింగ్, గ్రేస్, రిథమ్ ఉంటాయి. నాకు ఫుల్ డ్యాన్స్ సీక్వెన్స్ చేయాలని ఉంది. డ్యాన్స్‌ను యాక్షన్‌గా చూస్తాను. వీలైతే అజయ్ దేవగన్‌తో కలిసి ఓ సినిమాలో నటించాలని ఉంది అని అన్నారు. జాకీ, అజయ్ కలిసే క్షణాల కోసం ఇండియన్ ఆడియెన్స్ వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: jackie chan ajay devgn
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X