Karimnagar's Most Wanted Review ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ డ్రామా.. ఫస్ట్ తెలంగాణ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Rating: 2.75/5

నటీనటులు: అమర్ సూరిపల్లి, సాయి సూరిపల్లి, అనిరుధ్ తూకుంట్ల, మేడారం గోపాల్, కట్కూరి గోవర్ధన్, తేజా కోదాటి, రాహుల్ మహేష్, వేణు పొల్సాని, శ్రీ వర్షన్ తదితరులు
దర్శకత్వం: బాలాజీ భువనగిరి
నిర్మాత: స్ట్రీట్ బీట్జ్ సినిమా
రచన: రమేష్ ఎలిగేటి
సినిమాటోగ్రఫి: సంకీర్త్ రాహుల్ మాచినేని
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అనంత్ శ్రీకర్ ఎస్
మ్యూజిక్: సాహిత్య సాగర్
ఎడిటర్: విజయ్ వర్ధన్
రిలీజ్ డేట్: 22-12-2023

కరీంనగర్ పట్టణానికి చెందిన గని (సాయి సూరేపల్లి) మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. తన సోదరుడు టింకూ (అమన్ సూరేపల్లి), స్నేహితులు బిట్టు (అనిరుధ్), సత్తి (గోపాల్ మాదారం)తో కలిసి వ్యాపారం చేయాలని అనుకొంటారు. బిజినెస్ చేయడానికి డబ్బు లేకపోవడంతో బ్యాంక్ రికవరీ ఏజెంట్లుగా మారుతారు. ఆ సమయంలోనే కేంద్రం నోట్ల రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో నోట్ల మార్పిడి కోసం వెళ్లి.. 5 కోట్ల కుంభకోణంలో చిక్కుకొని జైలుకు వెళ్తారు

5 కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణం ఏమిటి? ఆ స్కామ్‌కు గని బ్యాచ్‌కు ఏమైనా సంబంధం ఉందా? ఊహించిన రీతిలో జైలుకు వెళ్లిన వీళ్లకు గట్టు శ్రీను‌ (మహేష్ రావుల్)‌తో వైరం ఎందుకు ఏర్పడింది? జైలులో మాఫియా వ్యక్తులతో గొడవల తర్వాత గని బ్యాచ్ ఎలాంటి మలుపు తీసుకొన్నది? రాజకీయ నేత పురుషోత్తం (శ్రీవర్ధన్) పొలిటికల్ స్ట్రాటెజీ వర్క్ అయిందా? చివరకు గని బ్యాచ్ లైఫ్‌ ఎటువైపు టర్న్ తీసుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ కథ.

Karimnagars Most Wanted OTT Review: Telagana based Intense Gangster Drama

సులభంగా ఉన్నట్టుండి కోట్లు సంపాదించాలనే నేటితరం యువకుల ఆలోచనలకు అనుగుణంగా ఉండే కథతో ఈ వెబ్ సిరీస్ మొదలవుతుంది. బెట్టింగ్, ఇతర జూదం లాంటి వ్యవసనాలకు లోనైన యువకులు 5 కోట్ల బ్యాంక్ స్కామ్‌లో ఇరుక్కుపోవడం లాంటి అంశాలతో ఎక్కువ సమయం తీసుకోకుండా కథలోకి వెళ్లడం దర్శకుడు బాలాజీ ప్రతిభకు అద్దం పట్టిందనే చెప్పాలి. అయితే నటించిన వారందరూ కొత్తవారైనప్పటికీ.. ప్రొఫెషనల్‌ యాక్టర్ల మాదిరిగా స్క్రీన్ పై చూపించిన తీరు బాగుంది. సాధారణ యువకులు ఎలాంటి పరిస్థితుల్లో గ్యాంగ్‌స్టర్స్‌గా మారరనే పాయింట్ కొత్తగా లేకపోయినప్పటికీ.. కథ, కథనాల పరంగా కొత్తదనం కనిపిస్తుంది.

నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. లీడ్ రోల్ పోషించిన సాయి తన పాత్రలో ఒదిగిపోవడంతోపాటు మెచ్యుర్డ్ ఫెర్ఫార్మెన్స్ చూపించారు. అలాగే అమన్, అనిరుధ్, గోపాల్ మాదారం మంచి అనుభవం ఉన్న యాక్టర్లుగా నటించారు. అలాగే శ్రీవర్ధన్ పొలిటిషన్‌గా కథకు బలంగా నిలిచారు. ఇక బిట్టు తండ్రిగా నటించిన థియేటర్ ఆర్టిస్టు వేణు పొల్సాని మరోసారి ఎమోషనల్ పాత్రలో ఆకట్టుకొన్నాడు. భారమైన పాత్రలో ఒదిగిపోయాడు.

Karimnagars Most Wanted OTT Review: Telagana based Intense Gangster Drama

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అనంత్ శ్రీకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంకీర్త్ రాహుల్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు హైలెట్. ఇక తెలంగాణ యాసలో రాసిన డైలాగ్స్ చాలా యాప్ట్‌గా అనిపించాయి. తెలంగాణ డైలాగ్స్ రాయడంలో ప్రొఫెషనలిజం కనిపించింది. కరీంనగర్ పట్టణ వాతావరణం, అందాలను సంకీర్త్ చక్కగా తెరకెక్కించారు. సాహిత్య సాగర్ మ్యూజిక్ బాగుంది. బలగం రైటర్ రమేష్ ఎలిగేటి అందించిన కథ బాగుంది.

దర్శకుడు బాలాజీ తాను నూతన దర్శకుడు అనే భావనను ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. తక్కువ బడ్జెట్‌తో రియలిస్టిక్‌గా హై క్వాలిటీ ఉన్న వెబ్ సిరీస్‌ను ప్రజెంట్ చేశారనే చెప్పాలి. స్ట్రీట్ బీట్జ్ సినిమా బ్యానర్ అనుసరించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. హై స్టాండర్డ్స్‌తో మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ వ్యాల్సూస్ ఉండేలా ప్రతీ సన్నివేశాన్ని ఫీల్‌ ఉండేలా డిజైన్ చేశారు.

మధ్య తరగతి యువకులు దారి తప్పితే వారి జీవితాలు ఎలాంటి మార్గంలోకి నెట్టబడుతాయి అనే పాయింట్‌తో కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. పక్కా తెలంగాణ యాస, భాషతో రూపొందించిన తొలి వెబ్ సిరీస్ అని చెప్పవచ్చు. కొత్త నటులు, కొత్త దర్శకులు టాలెంట్ ఈ వెబ్ సిరీస్‌కు బ్యూటీగా చెప్పవచ్చు. గ్యాంగ్‌స్టర్ డ్రామాను, తెలంగాణ నేటివిటి ఉన్న సినిమాలను ఇష్టపడే వారికి ఈ వెబ్ సిరీస్ నచ్చుతుంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ మిమ్మల్ని నిరాశపరచదు. తీరిక సమయాన్ని కేటాయించుకొని.. ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X