Karna Review కర్ణ తెలుగు మూవీ రివ్యూ.. యాక్షన్, క్రైమ్ డ్రామా ఆకట్టుకొందా?
నటీనటులు: కళాధర్ కొక్కొండ, మోనా ఠాకూర్, ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, అజయ్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు తదితరులు
నిర్మాణ సంస్థ: సనాతన క్రియేషన్స్
నిర్మాత: కళాధర్ కొక్కొండ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కళాధర్ కొక్కొండ
స్టంట్స్: కళాధర్ కొక్కొండ
సంగీతం: ప్రశాంత్ బీజే
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: శ్రవణ్ జి కుమార్
రిలీజ్ డేట్: 2023-06-23
జైలు జీవితాన్ని గడిపి బయటకు వచ్చిన నేరస్థుడు కర్ణ (కళాధర్ కొక్కొండ). ఫాతిమా (మోనా ఠాకూర్) అనే తన స్నేహితురాలిని ప్రాణం కంటే ప్రేమిస్తాడు. తన జీవితానికి బలంగా ఉండే పండు అనే స్నేహితుడిని కోల్పోతాడు. జైలు జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొందర్ని టార్గెట్ చేసి హత్యలు చేస్తుంటాడు. తన ప్లాన్‌లో భాగంగా ఏకంగా మంత్రి కుమారుడిని మర్డర్ చేస్తాడు. మంత్రి కుమారుడి మర్డర్ సంచలనం రేపడంతో కర్ణను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెతుకుతుంటారు.

కర్ణ ఎందుకు జైలుకు వెళ్లాడు? జైలు జీవితం తర్వాత కూడా ఎందుకు కర్ణ హత్యలు చేశాడు? మంత్రి కొడుకును ఎందుకు చంపాడు? కర్ణ హత్యలు చేయడం వెనుక కారణం ఏమిటి? కర్ణ స్నేహితుడు పండుకు ఏమైంది. తాను ప్రాణం కన్న మిన్నగా ప్రేమించిన ఫాతిమాతో కర్ణ వివాహం జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే కర్ణ సినిమా కథ.
సినిమా రంగంలో రాణించాలనే తపన, కోరికతో ఎంతో మంది తమను తాము నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందులో అలాంటి తపన ఉన్న ప్రతిభావంతుడు కళాధర్ కొక్కొండ. రెగ్యులర్ క్రిమినల్, యాక్షన్ డ్రామా పాయింట్‌తో రాసుకొన్న కథను తెర మీద కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. నటుడిగానే కాకుండా, దర్శకత్వం, నిర్మాతగా పలు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించే ప్రయత్నం చేశారు. ఫాతిమాగా మోనా ఠాకూర్, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

కర్ణ మూవీ సాంకేతిక విభాగాల విషయాలకు వస్తే ప్రశాంత్ బీజే సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసే విధంగా ఉంది. శ్రవణ్ జీ కుమార్ సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించిన విధానం బాగుంది. యమపాశం ఎదురు చూస్తుంది.. ఉరికంబం ఉరకలేస్తుంది. ఇది అంతమయ్యే కథ అంటూ రాసిన గుమ్మ విజయ్ కుమార్, సంతోష్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకొంటాయి. స్టోరి డిమాండ్ చేసినంత మేరకు ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
కర్ణ మూవీ విషయానికి వస్తే.. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులు తమను తాము నిరూపించుకొనేందుకు చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. కొంత అనుభవలేమి, మరికొంతగా చిన్న సినిమాలకు ఉండే బడ్జెట్ పరిమితులు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. పక్కా క్రైమ్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఉన్న రివేంజ్ డ్రామా. క్రైమ్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











