twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అరుంధతి'కి తమ్ముడు,'బాహుబలి'కి బావమరిదేరా!! ( కార్తి 'కాష్మోరా' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5

    --సూర్య ప్రకాష్ జోశ్యుల

    సినిమా తీసినట్లుండాలి..డబ్బులు ఖర్చు అవ్వకూడదు. సినిమా చూసినట్లుండాలి ...కానీ ఆడియన్స్ కు ఆ సాటిస్ ఫేక్షన్ మిగలకూడదు...అనే అద్బుతమైన కాన్సెప్టుతో తెలుగులో చెలరేగిపోయింది హర్రర్ సినిమా. హర్రర్ సినిమాకు కావాల్సిన దినుసులు...ఓ గెస్ట్ హౌస్, రేప్ కు గురైనట్లుగా నటించే అమ్మాయి...నలుగురు కుర్రాళ్లు.

    ఈ అమోఘమైన స్కీమ్ తో మనవాళ్లు హర్రర్ సినిమా అంటే ధియోటర్ కి వెళ్లకుండానే కేవలం పోస్టర్ చూసి భయంతో వణికిపోయే స్దితికి జనాలని తెచ్చారు. ఇలాంటి విపత్కర సమంయలో ఈ సమస్యను అధిగమించటానికి ఈ తరహా సినిమాలకు కామెడీ కలిపి,ప్రేమ కథా చిత్రమ్,గీతాంజలి అంటూ హర్రర్ కామెడీలు రావటం మొదలయ్యి సక్సెస్ అయ్యాయి.

    అయితే ఈ దెయ్యాలు ,కామెడీలు సీజన్ అయ్యిపోయిందనుకున్న టైమ్ లో కార్తీ ... వీటికి పీరియాడ్ ప్లాష్ బ్యాక్ అంటూ మరో ఎలిమెంట్ ని మిక్స్ చేసి మనముందుకు వచ్చాడు. అక్కడితో ఆగాడా...నయనతారను వెంటబెట్టుకు వచ్చాడు. కొన్ని నవ్వులనూ వెంటేసుకొచ్చాడు. బాహుబలిని గుర్తు చేసే గ్రాఫిక్స్ ని ఓ గంపెండు మోసుకొచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది, కథ ఏంటి..హైలెట్స్ ఏమిటి..ఏ మేరకు సక్సెస్ అవుతుంది వంటి ఎనాలిసిస్ తెలియాలంటే మీరు ఈ క్రింద రివ్యూ చదవాల్సిందే.

    దయ్యమే జీవితం..దయ్యమే...శాస్వతం

    దయ్యమే జీవితం..దయ్యమే...శాస్వతం

    దయ్యమే జీవితం..దయ్యమే శాశ్వతం అంటూ , అవి ఉన్నాయంటూ నమ్మిస్తూ..డబ్బు చేసుకుంటూ హ్యాపీగా బ్రతికేస్తూంటాడు క్యాష్‌ అలియాస్‌ కాష్మోరా(కార్తీ). కాశ్మోరాకు ప్లస్ పాయింట్ ఏమిటి అంటే అతని తండ్రి (వివేక్), నాయనమ్మ, అమ్మ, చెల్లి అంతా అదే బాపతు. అదే స్కూల్. అంతా కలిసి హ్యాపీగా తనకి శక్తులేవీ లేకపోయినా ఉన్నట్టు అందరినీ నమ్మిస్తుంటారు. ప్రేతాత్మల నుంచి ప్రజలకి విముక్తి కల్పిస్తానంటూ మేజిక్కులు చేస్తూ బతికేస్తుంటారు.

    టీవిల్లో సైతం ఓ రేంజిలో

    టీవిల్లో సైతం ఓ రేంజిలో

    కాశ్మోరాకి సొంత కుటుంబం కూడా తోడుంటంతో ఇంకా రెచ్చిపోయి.... ఆత్మల పేరుతో చేతివాటం ప్రదర్శిస్తూ.. కాష్మోరా ఒకసారి టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ తమ కుటుంబ సభ్యులంతా రోహిణి నక్షత్రంలో పుట్టామని, అందుకే తమకి ఈ శక్తులు అబ్బాయని చెబుతాడు. అదే విషయాన్ని పత్రికల్లోనూ ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేసుకొంటుంటాడు. అయితే అదే కొంపముంచుతుందని తెలియదు.

    కోటలోకి వెళ్లి దెయ్యాలను తోలుతాననని

    కోటలోకి వెళ్లి దెయ్యాలను తోలుతాననని

    అలా హ్యాపీగా జనాల మనస్సుల్లో ఉన్న భయాలతో ఆడుకుంటూ..పూటతో దెయ్యాన్ని పోగుడతూ డబ్బు వెనకేసుకుంటున్న అనితికి ఒకరోజు ఒక వ్యక్తి తన కోటలో ఉన్న దెయ్యాల్ని బయటికి పంపమని, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని అంటాడు. దాంతో కాష్మోరా ఆ కోటలోకి వెళ్లి తన కుటుంబంతో సహా ఇరుక్కుపోతాడు.

    కాశ్మోరాకే స్కెచ్

    కాశ్మోరాకే స్కెచ్

    అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే...కాశ్మోరా అక్కడికి వెళ్లలేదు. నిజంగానే ప్రేతాత్మ అయిన రాజ్‌నాయక్‌ (కార్తీ) రప్పించాడు. తమకి విముక్తి కోసం కాశ్మోరాని వాడుకోవాలనుకున్నాడు. ఇంతకి రాజ్ నాయక్ కు ఆ ప్రకటన గురించి ఎలా తెలుస్తుంది? రాజ్‌నాయక్‌ ప్రేతాత్మలా మారిపోవడానికి కారణమేమిటి?

    రాజనాయక్ కథ ఇదీ

    రాజనాయక్ కథ ఇదీ

    700 ఏళ్ల క్రితం మహాసామ్రాజ్యంగా విలసిల్లింది విక్రాంత రాజ్యం. సైన్యాధ్యక్షుడైన రాజనాయక్(కార్తీ) శౌర్య పరాక్రమాల కారణంగా రాజ్యం సువిశాలంగా విస్తరిస్తుంది. అయితే కథనరంగంలో అరివీర భయంకరుడైన రాజనాయక్ స్త్రీలోలుడు. ఆ కారణంగానే విక్రాంత రాజ్య యువరాణి రత్నమహాదేవి(నయనతార)ని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. .

    అనుష్క..అరుంధతి టైప్ కథే

    అనుష్క..అరుంధతి టైప్ కథే

    తను ఇష్టపడ్డ రత్నమహాదేవి కోసం మహారాజు, యువరాజుతో పాటు యువరాణి ప్రేమించిన వ్యక్తిని కూడా చంపేస్తాడు. మహా పరాక్రమవంతురాలైన యువరాణి రత్నమహాదేవి పథకం ప్రకారం రాజనాయక్ ను అంతమొందిస్తుంది. కానీ ఆ పోరాటంలో ఆమె కూడా ప్రాణాలు విడుస్తుంది. చనిపోతూ రాజనాయక్ ఆత్మకు శాంతి కలగకుండా ఎప్పటికీ భూలోకంలోనే ప్రేతాత్మగా ఉండిపోవాలని శపిస్తుంది. అప్పటి నుంచి తన శాప విముక్తి కోసం ఆత్మగా ఎదురు చూస్తుంటాడు రాజనాయక్. అరుంధతి గుర్తుకు వస్తోంది కదూ

    సరే..హీరోయిన్ కథేంటి

    సరే..హీరోయిన్ కథేంటి

    దెయ్యల మీద రిసెర్చ్ చేస్తున్న యామిని(శ్రీదివ్య) తన రిసెర్చ్ కు సాయం చేయమంటూ కాష్మోరా దగ్గర చేరుతుంది. దెయ్యాలతో ఎప్పుడూ టచ్ లో ఉండే కాశ్మోరాతో కలిసి పనిచేస్తానంటుంది. అయితే ఆమెకు కాశ్మోరా మీద డౌట్ ఉంటుంది. అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలనుకుంటుంది.

    సరిసరే..మరి విలన్ ఎవరూ

    సరిసరే..మరి విలన్ ఎవరూ

    ఈ కథలో ప్రేతాత్మ కాకుండా మరో విలన్ ఉంటాడు. వాడో పొలిటీషన్. వాడు కూడా మన హీరో కాశ్మోరా దగ్గర నిజంగానే శక్తులున్నాయని నమ్ముతాడు. అతను మన హీరోని చేరదీసి, నమ్మి ఇన్ కమ్ టాక్స్ వాళ్లు దాడి చేస్తున్నారంటే తన దగ్గర ఉన్న ఐదు వందల కోట్లు దాస్తాడు. అయితే మన హీరో, అతని తండ్రి తక్కువ వాళ్లా..ఆ విలన్ మోసం చేసి అతని అక్రమ సంపదనంతా తీసుకొని కుటుంబంతో సహా విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేస్తాడు కాష్మోరా. మరి అనుకున్నట్టుగా కాష్మోరా విదేశాలకు పారిపోయాడా..?

    కాశ్మోరానే రప్పించటానికి అసలు కారణం

    కాశ్మోరానే రప్పించటానికి అసలు కారణం

    నిజానకి కాశ్మోరా ద్వారా...విముక్తి అవ్వాలని రాజ్ నాయక్ ప్రేతాత్మ పిలవలేదు. దానికి వేరే మోటివ్ ఉంది. అయితే ఇక్కడ ఈ కథకి, రోహిణి నక్షత్రంలో పుట్టిన కాష్మోరా కుటుంబాన్ని రాజ్‌నాయక్‌ ఆత్మ తన దగ్గరికి రప్పించుకొని ఏం చేసింది? ఈ కథతో యామిని (శ్రీదివ్య) అనే పరిశోధక విద్యార్థినికీ, రత్నమహాదేవి (నయనతార)కీ మధ్య సంబంధమేమిటి? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.

    కాన్సెప్టు కొత్తది కాదు కానీ

    కాన్సెప్టు కొత్తది కాదు కానీ

    దయ్యాలు అనేవి లేవని నమ్ముతూ..వాటిని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తూ బ్రతికేవాడికి ఆ దెయ్యాలే కనపడితే పరిస్దితి ఎలా ఉంటుందనే స్టోరీలైన్ తో ఈ కథ అల్లారు. అయితే ఆ దెయ్యమే మరీ క్రూరమైన దెయ్యం. అలాగే ఆ విలనీ దెయ్యం ప్లాష్ బ్యాక్ మనకు తెలియాలి కాబట్టి చెప్పినట్లు ఉంటుంది, కానీ కథతో ఎక్కడా కనెక్టు కాదు.

    అరవ అతి ఎక్కవైంది

    అరవ అతి ఎక్కవైంది

    గొంగలిలో అన్నం తింటూ వెంట్రుకలు వచ్చాయని కంప్లైంట్ చేయకూడదన్నట్లు ఈ తమిళ డబ్బింగ్ సినిమా చూస్తూ తమిళ ప్లేవర్ ఎక్కువైంది అనకూడదు కానీ తెలుగువాడిగా ఈ సినిమా చూసినప్పుడు అదే ఫీలింగ్ వచ్చింది. అయితే అది ప్రక్కన పెడితే ఈ సినిమా ఓవరాల్ గా బాగుంది.

    అటు ఫన్, ఇటు విలనీ

    అటు ఫన్, ఇటు విలనీ

    ఇక ఈ సినిమా కార్తి వన్ మ్యాన్ షో అనే చెప్పాలి...ఫస్టాఫ్ అంతా కామెడీతో ఊపిరి పోసి నిలబెడితే, సెకండాఫ్ లో రాజ్ నాయక్ క్యారక్టర్ లో విలనీని అద్బుతంగా చూపెట్టాడు. కాకపోతే ఆ కామెడీ సీన్లే కాస్త లెంగ్త్ ఎక్కువై డ్రాగ్ అయినట్లు ఫీల్ అనిపించింది. తమిళం వాళ్లకు ఏదైనా కాస్త ఎక్కువ కావాలి కాబట్టి దర్శకుడు అలా డిజైన్ చేసినట్లున్నాడు.

    అరుంధతికి తమ్ముడు వీడు

    అరుంధతికి తమ్ముడు వీడు

    అలాగే మన తెలుగు సూపర్ హిట్స్ అరుంధతి, బాహుబలి నే రిఫెరెన్స్ గా తీసుకుని కథ అల్లుకున్నాడు కాబట్టి ఇది మనం గర్వపడుతూ చూడాల్సిన సినిమా కూడాను. మ‌గ‌ధీర ప్లాష్ బ్యాక్ ఫైట్‌, అరుంధ‌తిలో అనుష్క‌ను పోలిన న‌య‌న‌తార క్లైమాక్స్ ఫైట్ ఇవ‌న్నీప్రేక్ష‌కుడికి సినిమా చూసేట‌ప్పుడు గుర్తుకు వ‌స్తాయి. అలాగే క్లైమాక్స్ సైతం...అరుంధతినే గుర్తు చేసేలా ముగించాడు

    సినిమాలో ఇవి అదిరిపోయాయి

    సినిమాలో ఇవి అదిరిపోయాయి

    ఈ సినిమాలో కాశ్మోరా పాత్ర నిజంగా...దెయ్యాల గురించి ఏమీ తెలియదని, డూప్ మాంత్రికుడు అని తెలిసిన దగ్గరనుంచి ఫన్ ప్రారంభమవుతుంది. అలాగే ఇంట్రవెల్ కు ముందు కార్తీ సీన్ అయితి అదిరిపోతుంది. అలాగే సెంకడాఫ్ లో కార్తి తనలో ఆత్మ ఉందని బిల్డప్ ఇచ్చే సీన్ కూడా సూపర్బ్. దర్శకుడు కామెడీమీద మంచి గ్రిప్ ఉన్నట్లుంది. చక్కటి సెటైర్ కామెడీతో చాలా చోట్ల అదరకొట్టాడు.

    ఇంకొంచెం శ్రద్ద పెట్టి ఉండాల్సింది

    ఇంకొంచెం శ్రద్ద పెట్టి ఉండాల్సింది

    ఈ సినిమా ట్రైవర్ వదిలిన దగ్గర నుంచి బాహుబలిని గుర్తు చేస్తున్నారు. అప్పటికీ మనం ఎక్కడ మర్చిపోతామో అని..బాహుబలితో పోల్చద్దు అని మరీ కార్తి పదే పదే చెప్పి..బాహుబలితో పోల్చమని చెప్పాడు. అయితే బాహుబలి ని,మగధీరను గుర్తు చేసిన మాట వాస్తవమే. అయితే ఆ రేంజిలో గ్రాఫిక్స్ లేవు. బడ్జెట్ లేకో, టైమ్ లేకో గ్రాఫిక్స్ తేలిపోయాయి. అయితే కీ సీన్స్ లో మాత్రం విఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్ లను బాగా వాడారు.

    ఫుల్ కామెడీ ఆ సీన్స్ అన్నీ

    ఫుల్ కామెడీ ఆ సీన్స్ అన్నీ

    ఫస్టాఫ్ లో ఎక్కువ భాగం కామెడీమీదే ఆధారపడ్డారు డైరక్టర్. ఆత్మల్ని పైకి పంపిస్తానంటూ కాష్మోరా పాత్రలో కార్తీ, ఆయన తండ్రి పాత్రలో వివేక్‌ చేసే మేజిక్కుల కూడిన నవ్వులతో నీట్ గా సాగిపోతుంది. ఆ సన్నివేశాలన్నీ బాగా నవ్వించేలా తీర్చిదిద్దారు. దెయ్యం ఉందంటూ నమ్మించేందుకు రిమోట్‌ కంట్రోల్‌తో కూడిన పరికరాలతో కాష్మోరా ఫ్యామిలీ చేసే పనులు బాగున్నాయి.

    పూర్తిగా ప్రేతాత్మ ఫ్లాష్ బ్యాక్ కే వాడారు

    పూర్తిగా ప్రేతాత్మ ఫ్లాష్ బ్యాక్ కే వాడారు

    సెంకడాఫ్ ని మొత్తం ఫ్లాష్ బ్యాక్ వివరించటానికే ఎక్కువ టైమ్ తీసుకున్నారు. అది తగ్గించినా బాగుండేది. అయితే రాజ్‌నాయక్‌ ఎందుకు ప్రేతాత్మగా మారాడో, అతనికి పునరుజ్జీవం రావడానికి తమ కుటుంబం ఎలా కీలకమో కాష్మోరాకి తెలిసే క్రమం అరుందతిని గుర్తు చేసినా ఇంట్రస్టింగ్ గానే సాగింది. 700 ఏళ్ల క్రితం నాటి రాజ్యాన్ని, అప్పటి యుద్ధాన్ని, రాజ్‌నాయక్‌ యుద్ద నైపుణ్యాన్ని చాలా బాగా తీర్చిదిద్దారు.

    అలా మధ్యలో వదిలేస్తే ఎలా..

    అలా మధ్యలో వదిలేస్తే ఎలా..

    ఒక ప్రేతాత్మ కథని... ఫాంటసీతో ముడిపెట్టి ఈ కాలం కథతో కలిపిన విధానం చాలా బాగుంది. దర్శకుడు కథని అల్లుకొన్నవిధానం, ఆ సీన్స్ బాగారాసుకున్నారు. అయితే సెకండాఫ్ లో కామెడీనీ పూర్తిగా మర్చిపోయాడు. అదే మైనస్ గా కనపడుతుంది. అప్పటిదాకా కామెడీ ఎంటర్టైనర్ గా నడిచిన సినిమా హఠాత్తుగా రూపం మార్చుకోవటం ఒప్పదు. కామెడీ ని కూడా సెకండాఫ్ లో కలుపుకుంటూ వెల్తే బాగుండేది.

    అది వదేలిసాడు..అదే మైనస్ అయ్యింది

    అది వదేలిసాడు..అదే మైనస్ అయ్యింది

    సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ మరింత ఎమోషనల్ గా,బలంగా ఉండాల్సింది. కేవలం అరుంధతిని ప్రక్కన పెట్టుకుని సీన్స్ రాసుకుంటూ వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది తప్ప..ఆ పార్ట్ ని ప్రతిభావంతంగా తీర్చిదిద్దలేదు. రాజ్ నాయక్ క్యారక్టరైషన్ ని అరుంధతిలో నిన్ను వదల బొమ్మాళి అంటూ రెచ్చిపోయే అఘోరా స్దాయిలో తీర్చిదిద్దితో అద్బుతంగా ఉండేది. అది వదిలేసాడు.

    పాటలు, సాంకేతికంగానూు

    పాటలు, సాంకేతికంగానూు

    సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.కానీ పాటలు అసలు బాగోలేవు. అసులు సినిమాలో పాటలు తీసేసినా బాగుంటుంది. పాటలు పట్టేటంత సందర్బం కూడా లేవు. పాటలు సినిమాకు రిలీఫ్ లా లేవు. పాటలు రాగానే పారిపోయేలా ఉన్నాయి. సెకండాఫ్ ఫాంటసీ ఎపిసోడ్ లో విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ అందించిన ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాబు జోసెఫ్ ఎడిటింగ్ బాగుంది కానీ...మరింత ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. రాజ్ నాయక్ పాత్ర డిజైన్ లో ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతిభ మెచ్చుకోదగిన స్దాయిలో ఉంది. ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మాణ విలువలు బాగున్నాయి.

    టీమ్ అంతా ఇదే..

    టీమ్ అంతా ఇదే..

    బ్యానర్: డ్రీమ్‌ వారియర్స్‌
    నటీనటులు: కార్తి, నయనతార, శ్రీదివ్య, మనీషా యాదవ్‌, వివేక్‌, సిద్ధార్థ్‌ విపిన్‌, మధుమిత, వడివేలు తదితరులు
    సంగీతం: సంతోష్‌ నారాయణ్‌,
    సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్‌
    ఆర్ట్‌: రాజీవన్‌,
    ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌,
    డాన్స్‌: రాజు సుందరం, బృంద, సతీష్‌,
    కాస్ట్యూమ్స్‌: నిఖార్‌ ధావన్‌,
    ఫైట్స్‌: అన్‌బారివ్‌,
    ప్రోస్తెటిక్స్‌: రోషన్‌,
    విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: స్టాలిన్‌ శరవణన్‌, ఇజెనె,
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్
    విడుదల తేదీ: శుక్రవారం, (28-10-2016)
    నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, ప్రసాద్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు

    నిడివి: 2 గంటల 38 నిమిషాలు

    ఫైనల్ గా ఈ సినిమా మన తెలుగు హిట్ సినిమాలని చూసి రాసుకున్న స్క్రిప్టే అయినా కలగూర గంపలా కాకుండా కొత్తగా ఉంది. సరదాగా నవ్వుకుంటూ..అక్కడక్కడ ధ్రిల్ అవుతూ చూసేసే ఈ సినిమా లెంగ్త్ ట్రిమ్ చేస్తే రిజల్ట్ మరింత బాగుంటుంది. అలాగే నిజానికి ఇది హర్రర్ కాదు..హర్రర్ కామెడీ అని ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం తగ్గిస్తే ...ప్యామిలీలు కూడా వెళ్లి చూసి వచ్చే అరుంధతిలాంటి సినిమా.

    English summary
    Kaashmora the most awaited film of this year is released today i.e on 28 October 2016 acorss world wide. Kaashmora means Deadly Spirit in english and this is complete dark fantasy film. Kaashmora is a multi-genre movie, but the main theme is heavy influenced from 2009 super hit film Arundhati. War theme in the flashback reminds us of epic scenes in Bahubali movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X