twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాచిక పారలేదు(‘శకుని’రివ్యూ)

    By Srikanya
    |

    --జోస్యుల సూర్య ప్రకాష్

    సంస్థ: శ్రీ సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌
    నటీనటులు: కార్తి, ప్రణీత, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, రాధిక, నాజర్‌, రోజా, సంతానం తదితరులు ఈ మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి
    పాటలు: సాహితి
    సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌
    ఛాయాగ్రహణం: పి.జి.ముత్తయ్య
    ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్
    ఆర్ట్‌: రాజీవన్‌
    ఫైట్స్‌: అనల్‌ అరసు
    డాన్స్‌: ప్రేమ్‌రక్షిత్‌, బాబా భాస్కర్‌
    నిర్మాత: బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు
    దర్శకత్వం: శంకర్‌ దయాళ్‌
    విడుదల: 22,జూన్,2012.

    తెలుగులో స్ట్రెయిట్ సినిమా తో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సెటిలవ్వాలనే తమిళ హీరో కార్తీ పాచిక 'శకుని'చిత్రంతో పారేటట్లు కనపడటం లేదు. అతని గత చిత్రాలు 'యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ'తరహాలో ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ కూడా యావరేజ్ మూవీ గా సెటిల్ అయ్యేటట్లు కనపడుతోంది. ఫస్టాఫ్ బాగానే నడిచినా కీలకమైన సెకండాఫ్ పూర్తిగా పొలిటికల్ సీన్స్ తో నిండిపోయి...హీరోయిన్ కి ఒక్క సీన్ కూడా లేకుండా పోవటం పెద్ద మైనస్ గా మారింది. అయినా హీరో సైడి కిక్ సంతానం పంచ్ లు,కార్తీ నటన సినిమాను చివరి వరకూ కూర్చో బెడతాయి. అలాగే మహేష్ బిజినెస్ మ్యాన్ కథనం ని కూడా ఈ సినిమా గుర్తు చేయటం మరో విశేషం.

    ప్రాణంగా భావించే ఇల్లు మెట్రో రైలు సబ్ వే కానస్ట్రక్షన్ లో అక్రమంగా పోతోందని ఆపటానికి హైదరాబాద్ వస్తాడు కాకినాడ కుర్రాడు కమల్‌ (కార్తి). అయితే ముఖ్యమంత్రి (ప్రకాష్‌రాజ్‌)స్వయంగా కాంట్రాక్ట్ తీసుకున్నాడని తెలుసుకుని షాక్ అవతాడు. దాంతో ఏం చెయ్యలేని పరిస్ధితుల్లో ముఖ్యమంత్రితో తగువుపడతాడు. అక్కడ నుంచి తన దైన శైలిలో పాచికలు కదిపి రాజకీయ చదరంగం ఆడతాడు. ఆ క్రమంలో అతను ఏ విధమైన పరిస్దితులుని ఎదుర్కున్నాడు. ఎలా ఎత్తుకు పై ఎత్తులు వేసి తలపండిన రాజకీయనాయకులను సైతం మట్టికరిపించాడు అనేది మిగతా కథ. అలాగే ఈ జర్నీలో అతని మరదలు శ్రీదేవి (ప్రణీత)తో ప్రేమ ప్రయాణం పెట్టుకుంటాడు. అది ఏమైంది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    కార్తీకి తెలుగు నాట ఉన్న క్రేజ్ ఏమిటన్నది ఈ చిత్రం హౌస్ ఫుల్ ఓపినింగ్స్ మరో సారి తెలియచేసాయి. అయితే కథలో గ్రిప్ లేకుండా కేవలం సీన్స్ తో కాలక్షేపం చేయటం ఈ సినిమాకు ముప్పు తెచ్చి పెట్టింది. ముఖ్యంగా అసలు కథలోకి ఇంటర్వెల్ దాకా రాడు. ఫస్టాఫ్ మొత్తం కథకు కొద్దిగా కూడా సంభందం లేని హీరోయిన్ తో లవ్ సీన్స్ నడిపి...సెకండాఫ్ లో అసలు హీరోయిన్ ప్రస్దావన లేకుండా చేసారు. అలాగే సెకండాఫ్ లో రిలీఫ్ కోసమన్నా ఆమెను తీసుకురాలేదు. ఈ విభజన సరిగ్గా ఉంటే బాగుండేది. సెంకండాఫ్ మొత్తం మహేష్ బిజినెస్ మ్యాన్ చిత్రాన్ని గుర్తు చేస్తూ కధనం నడుస్తుంది. ఎక్కడో ఫైనల్ ట్విస్ట్ దాకా రాష్ట్రాన్ని శాసింతే దుర్మాడైన ముఖ్యమంత్రి ఓ సామాన్యడుని ఏమీ చేయలేక కేవలం తలపట్టుకు కూర్చుంటం విచిత్రమనిపిస్తుంది.

    ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కమిడియన్ సంతానం తన పంచ్ లతో చిత్రాన్ని నిలబెట్టాడని చెప్పాలి. అలాగే కార్తీ ఎప్పటిలాగే చాలా ఈజ్ తో పాత్రలో పరకాయప్రవేశం చేసి ఆకట్టుకుంటాడు. హీరోయిన్ ప్రణీత చేయటానికి ఏమీలేదు. ఉన్న కాసేపు పెద్దగా ఆకట్టుకోలేదు. సీనియర్స్ రాధిక,కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్,నాజర్ తమ తమ పరిధుల్లో బాగా చేసారు. అయితే రాదిక,నాజర్ ఎపిసోడ్స్ స్క్రీన్ టైమ్ ఫిలప్ చెయ్యటానకి తప్ప కథను ముందుకు నడపవు. కెమెరా,ఎడిటింగ్ చాలా బాగున్నాయి. సంగీతం యావరేజ్ గా ఉంది.

    ఫైనల్ గా ప్రతీ డబ్బింగ్ చిత్రం గొప్పగా ఉండదు అనే పాఠం మరోసారి ఈ చిత్రం చెబుతుంది. అలాగే మంచి కాన్సెప్టు సరైన కథనం లేకపోతే ఎలా డెల్యూట్ అవుతుందో ఈ సినిమా నిరూపిస్తుంది. ఓవరాల్ గా ఎక్కువ ఎక్సపెకేషన్స్ పెట్టుకోకుండా వెళితే ఫరవాలేదనిపిస్తుంది.

    English summary
    Karthi's Sakuni, billed as a political-satire, sets an example for an ordinary screenplay born out of a weakest story. What was expected to be as the edge-of-the-seat entertainer has merely turned out to be a loosely-made film with no logics whatsoever
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X