90ML మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

ఆర్‌ఎక్స్ 100 లాంటి చిత్రంతో యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు హీరో కార్తికేయ. ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్‌ను పెంచుకున్న ఈ యంగ్ హీరో.. హిప్పీ, గుణ 369 అంటూ విభిన్న కథా చిత్రాలతో పలకరించి విజయాలు అందుకున్నాడు. మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ 90ML అంటూ ఈ వారం థియేటర్స్‌లోకి వచ్చేశాడు. మరి ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.

కథ

కథ

పుట్టుకతోనే ఓ అరుదైన వ్యాధికి గురవుతాడు దేవదాస్ (కార్తికేయ). అతని మూడు పూటల మూడు పెగ్గు (90 ml)ల మందే అతనికి మెడిసిన్ అంటూ డాక్లర్లు తేల్చి చెబుతారు. అలాంటి దేవదాస్‌కు సువాసన (నేహా సోలంకి) పరిచయమవుతుంది. సువాసన ఫ్యామిలీకి మందు వాసన అంటే నచ్చదు. అలాంటి కుటుంబానికి చెందిన సువాసన.. ఒక్క పూట మందు లేకపోతే చనిపోయే దేవదాస్‌ మధ్య జరిగే కథే 90 ML.

కథలో ట్విస్టులు..

కథలో ట్విస్టులు..

దేవదాస్‌ తనకు ఉన్న జబ్బు గురించి సువాసనకు తెలుస్తుందా? ఆ నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టడంతో ఎలాంటి పరిణామాలు జరిగాయి? ఈ కథలో జాన్‌విక్‌ (రవి కిషన్)కు ఉన్న సంబంధం ఏంటి? తన కూతురు సువాసనను క్షున్నాకర్ (రావు రమేష్) జాన్‌విక్‌కు ఇచ్చి చేసేందుకు ఎందుకు ఒప్పుకున్నాడు. సువాసన కోసం ఒక్క రోజు మందు తాగకుండా ఉండే కండీషన్‌కు ఒప్పుకున్న దేవదాస్‌కు ఏమైంది? అనే అంశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి.

 ఫస్టాఫ్ అనాలిసిస్..

ఫస్టాఫ్ అనాలిసిస్..

అరుదైన వ్యాధితో కొడుకు పుట్టడం, వాడు బతకాలంటే మూడు పూటల మందు తాగించాలని చెప్పడం.. పాలు తాగించాల్సిన తల్లే.. మద్యాన్ని పట్టించడం లాంటి సీన్లతో ప్రేక్షకులను కనెక్ట్ చేశాడు. ఇలాంటి ఎమోషనల్ సీన్స్‌‌తో ప్రేక్షకులను కథలోకి లీనం చేశాడు. ఓ పిల్లాడిని కాపాడే ప్రయత్నంలో హీరో అనిపించుకున్న దేవదాస్‌ను.. సువాసన ఇష్టపడటం లాంటి సీన్లు రొటీన్‌గా అనిపిస్తాయి. మందు వాసన తగలకుండా బతికే ట్రాఫిక్ పోలీస్ క్షుణ్నాకర్ రావు (రావు రమేష్), అతని ఫ్యామిలీకి సంబంధించిన సీన్లు, జాన్‌విక్‌తో కామెడీ సీన్లను బాగానే ఉపయోగించుకుని ఫస్టాఫ్‌ను ఆకట్టుకునేలా నడిపించాడు. సువాసన దగ్గర తన అలవాటు గురించి బయట పడకుండా ఉండేందుకు చేసే ప్రయత్నాలు ఫర్వాలేదనిపిస్తాయి. దేవదాస్ మందు తాగుతాడన్న విషయాన్ని తెలుసుకున్న సువాసన బ్రేకప్ చెప్పడంతో ప్రథమార్థం ముగుస్తుంది. కామెడీ సీన్లు, కాసిన్ని ఎమోషనల్ సీన్లు, ప్రేమ సన్నివేశాలతో మాస్‌ను ఎంటర్‌టైన్ చేసే అవకాశం ఉంది.

సెకండాఫ్ అనాలిసిస్..

సెకండాఫ్ అనాలిసిస్..

ఫస్టాఫ్‌ను ఎంటర్‌టైన్‌గా సాగగా.. ద్వితీయార్థం కాస్త ఎమోషనల్‌గా సాగుతూనే మరోవైపు కామెడీ ట్రాక్‌ను నడపడం ఆకట్టుకునే విధంగానే ఉంది. కామెడీ ట్రాక్ కోసం తీసుకున్న జాన్ విక్ (రవి కిషన్), ఆముదం (రోలర్ రఘు), బోజ్జా( ప్రభాకర్‌)ల సీన్లు వర్కౌట్ అయినట్టు కనిపిస్తుంది. దేవదాస్, సువాసన మధ్యలో జాన్‌విక్ రావడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. జాన్‌విక్ సువాసన ఇంటికి వెళ్లడం, అతని గ్యాంగ్‌ను కర్రసాముతో క్షుణ్ణ్నారావ్ (రావు రమేష్) కుటుంబం చితక్కొట్టడం హైలెట్ అనిపిస్తుంది. అయితే చివరకు జాన్‌విక్‌కు తన కూతురిని ఇచ్చి చేసేందుకు క్షుణ్ణ్నారావ్ ఒప్పుకోవడం దానికోసం దేవదాస్‌కు రోజంతా మద్యం తాగకూడదని కండీషన్ పెట్టడం బాగానే అనిపిస్తుంది. చివరకు సువాసనే మద్యం తాగించడం, దేవదాస్ విలన్ల పనిట్టడం లాంటి సీన్లు మాస్‌ను మెప్పించేలా ఉంటుంది. ప్రథమార్థాన్ని మించిన కామెడీ సీన్లు, ఎమోషనల్ సీన్లతో నిండిన సెకండాఫ్‌ అందరిని మెప్పించే అవకాశం ఉంది.

నటీనటులు

నటీనటులు

దేవదాస్ పాత్రలో కార్తికేయ నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. ఇంతవరకు చూడని కార్తికేయను 90 MLలో చూస్తారు. యాక్షన్స్ సీన్స్‌లో, ఎమోషనల్ సీన్స్‌లోనే కాకుండా డ్యాన్సులతోనూ మెప్పించాడు. దేవదాస్ పాత్రలో కార్తికేయ అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించి సినిమా మొత్తాన్ని తన భుజాలపైనే మోశాడు. ఈ విషయంలో కార్తికేయ విజయం సాధించాడనే చెప్పవచ్చు. సువాసనగా నటించిన నేహా సోలంకి లుక్స్ పరంగానే కాకుండా, నటన పరంగానూ అందర్నీ మెప్పించేలా ఉంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ నేహా చక్కగా నటించింది. రావు రమేష్ మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. కొడుక్కు మందు పట్టించే స్థితి వస్తే ఆ తల్లి పడే బాధను ప్రగతి తన నటనలో చూపించింది. ఇన్నాళ్లు విలన్ రోల్స్ చేసిన సత్య ప్రకాశ్‌కు ఇదొక మంచి పాత్ర అని చెప్పవచ్చు. దేవదాస్ తండ్రిగా సత్య ప్రకాశ్ చక్కగా నటించాడు. రేసు గుర్రం తరువాత ఆ రేంజ్‌లో నటించాడు రవి కిషన్. విలనిజమే కాకుండా కామెడీ కూడా పండించాడు. ఇక మిగతా పాత్రల్లో నటించిన రోల్ రైడా, రోలర్ రఘు, పోసాని, అలీ, ప్రభాకర్ అందరూ తమ పరిధి మేరకు మెప్పించారు.

దర్శకుడి పనితీరు

దర్శకుడి పనితీరు

ఓ సినిమా ప్రేక్షకుల మదిలోకి నేరుగా వెళ్లాలంటే.. సరికొత్త పాయింట్‌తో వారి ముందుకు వెళ్లాలి. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. మూడు పూటల మందు లేనిదే బతకని కుర్రాడు.. మందు అంటేనే పడని ఫ్యామిలీకి లింక్ పెట్టిన రాసుకున్న పాయింట్ ఈ సినిమాను ముందుకు నడిపించింది. ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. ఆ అంచనాలు అందుకోవడంలో దర్శకుడు కూడా విజయం సాధించాడనే చెప్పవచ్చు. అయితే ఈ కొత్త పాయింట్‌కు పాత కథనాన్ని ఎంచుకోవడం కాస్త నిరాశ కలిగించే విషయం. అయినా సరే ప్రేక్షకుడిని ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా కథ నడపడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తోంది. దర్శకుడిగానే కాకుండా తన మాటలతో కూడా ఆకట్టుకున్నాడు. ‘నా అలవాటు చెడ్డదేమో కానీ నేను చెడ్డవాన్ని కాదు', ‘కొడితే చచ్చే ప్రేమ కాదు.. చంపినా చావని ప్రేమ' లాంటి డైలాగ్‌లో ఉన్న ఎమోషన్ ఆకట్టుకుంది. ఈ రకంగా మొదటి ప్రయత్నంలోనే శేఖర్ రెడ్డి యెర్రా దర్శకుడిగా, రచయితగా విజయం సాధించాడని చెప్పవచ్చు.

తెర ముందు, తెర వెనుక

తెర ముందు, తెర వెనుక

నటీనటులు : కార్తికేయ, నేహా సోలంకి, రావు రమేష్, రవి కిషన్ తదితరులు
దర్శకత్వం : శేఖర్ రెడ్డి యెర్రా
నిర్మాత : అశోక్ రెడ్డి గుమ్మకొండ
బ్యానర్ : కార్తికేయ క్రియేటివ్ వర్క్స్
మ్యూజిక్ : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫి : జె యువరాజ్
ఎడిటింగ్ : ఎస్ ఆర్ శేఖర్

బలం బలహీనతలు

బలం బలహీనతలు

ప్లస్ పాయింట్స్

కార్తికేయ
కథ
కామెడీ
సంగీతం

మైనస్ పాయింట్స్
రొటీన్ కథనం

ఫైనల్..

ఫైనల్..

కొత్త పాయింట్‌ను చెప్పడానికి పాత కథనాన్ని ఎంచుకున్న దర్శకుడు మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే అవకాశముంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువైతే 90ML చిత్రం కమర్షియల్‌గా మెరుగైన ఫలితాన్ని సాధించే అవకాశం ఉంది.

Recommended Video

#CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
సాంకేతిక నిపుణుల పనితీరు..

సాంకేతిక నిపుణుల పనితీరు..

90ML చిత్రానికి వచ్చేసరికి అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం పెద్ద అస్సెట్‌గా మారింది. అన్ని రకాల పాటలను అందరికీ నచ్చేలా కంపోజ్ చేశాడు. నేపథ్య సంగీతం కూడా హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉంది. ద్వితీయార్థాన్ని ఇంకాస్త పదునుగా కట్ చేస్తే బాగుండేదేమోనన్న ఫీలింగ్ కలగవచ్చు. అజర్ బైజాన్ లొకేషన్లను సినిమాటోగ్రఫర్ యువరాజ్.. తన కెమెరాలో అందంగా బంధించాడు. హీరోహీరోయిన్లను అందంగా చూపడంలోనూ అతని పనితనం కనబడుతోంది. సినిమా కోసం నిర్మాతలు ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయికు న్యాయం జరిగినట్టు అనిపిస్తోంది. ఈ చిత్రాన్ని అందంగా తెరకెక్కించడం కోసం నిర్మాతలు పడిన తాపత్రయం తెర మీద కనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X