Karuppu First Review: కరుప్పు మూవీ ఫస్ట్ రివ్యూ

సౌత్ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ త్రిషా కృష్ణన్ నటించిన తాజా చిత్రం కరుప్పు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు నిర్మించారు. ఈ చిత్రంలో ఆర్జే బాలాజీ, ఇంద్రాన్స్, స్వసిక విజయ్, శివాడ నాయర్, అనఘా మాయ, సుప్రీత్ రెడ్డి, యోగిబాబు, మన్సూర్ ఆలీ ఖాన్, జార్జ్ మార్యన్, ఆడుకాలమ్ నరేన్, జాఫర్ సాధిక్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాల్లో వెళితే.. సినిమాటోగ్రఫి: జీకే విష్ణు, ఎడిటింగ్: ఆర్ కళైవన్నన్, మ్యూజిక్ం సాయి అభయంకర్, స్టంట్స్: విక్రమ్ మోర్ తమ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రం మే 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రానికి లభించిన సెన్సార్ సర్టిఫికెట్ వివరాలు ఏమిటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? ఈ సినిమాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..

Karuppu CBFC Review

శరవణన్ అలియాస్ కరుప్పుస్వామి (సూర్య) అన్యాయాలు, అక్రమాలను సహించడు. తన చుట్టూ అలాంటి చోటుచేసుకొంటే ప్రతిఘటిస్తాడు. అయితే గ్రామంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనలు కరుప్పుస్వామిని కదిలిస్తాయి. సమాజంలో అసాంఘీక శక్తులు ప్రభావం పెరిగినప్పుడు వాటిని అడ్డుకొనేందుకు ఒకరు పుడుతారు అనే విధంగా శరవణన్ వాటిని అడ్డుకొనేందుకు సిద్దమవుతాడు. కరుప్పుస్వామిని కదలించిన సంఘటన ఏమిటి? అసాంఘీక శక్తుల నాయకుడు ఎవరు? ప్రీతి (త్రిషాకృష్ణన్)తో కరుప్పుస్వామి ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? అనే ప్రశ్నలకు సమాధానమే కరుప్పు సినిమా కథ.

యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, సెంటిమెంట్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో సాగే సినిమాను సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ ప్రతినిధులు, అధికారులు వీక్షించారు. అయితే ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్, సీన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసి సూచనలు అందించారు. వాటిని స్వీకరించిన చిత్ర యూనిట్ కొన్నింటికి వివరణ ఇచ్చారు. మరికొన్నింటికి మార్పులు చేర్పులు చేశారు. దాంతో సంతృప్తి చెందిన సెన్సార్ అధికారులు ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమాకు యూఏ (UA 13+) సర్టిఫికెట్ జారీ చేసింది. దాని ప్రకారం ఈ సినిమాను 13 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ సర్టిఫికెట్‌లో వెల్లడించారు.

ఈ సినిమా కథ, కథనాలు డిమాండ్ చేయడం వల్ల కరుప్పు నిడివి మధ్యస్థంగా సెట్ చేశారు. ఈ చిత్రం నిడివి సుమారుగా 2 గంటల 30 నిమిషాలు. అంటే మొత్తంగా 150 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమాను ఫిక్స్ చేశారు. అయితే ఈ చిత్రంలోని మాస్ ఎలిమెంట్స్, సెంటిమెంట్ అంశాలు ప్రేక్షకులకు కనెక్ట్ అయితే మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సొంతం చేసుకొంటుంది. త్రిష, సూర్య మధ్య కెమిస్ట్రీ యూత్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి అంశాలు వర్కవుట్ అయితే హిట్ రేంజ్‌తో మూవీ ఓపెనింగ్స్ సాధిస్తుంది అనే ఫీడ్ బ్యాక్ సెన్సార్ రిపోర్ట్ తర్వాత బయటకు వచ్చింది. ఈ సినిమా గురించిన మరిన్ని కథనాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Read more about: suriya trisha krishnan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X